❓ ప్రశ్న: రక్షణ పొందిన తర్వాత కూడా శోధనలు ఎందుకు వస్తాయి? పాపపు టెంప్టేషన్స్ నుండి జయం పొందడం ఎలా? నేను యేసుప్రభువును నమ్ముకున్నాను కానీ మళ్ళీ మళ్ళీ పడిపోతున్నాను, నాకు జయం ఎలా కలుగుతుంది? కడప నుండి శివచరణ్ గారు అడుగుతున్నారు. (0:36:03)
YouTube Link: ఇక్కడ క్లిక్ చేసి వీడియో చూడండి
దైవజనులు Apostle. Ranjith Ophir గారి వివరణ: (06m 22s)
- 🛡️ పరిశుద్ధంగా బ్రతకడం: శివచరణ్ బాబు, మీ ఏజ్ ఎంతో తెలుసుకోవచ్చా? నాది ఏజ్ 21.. చాలా చిన్నవాడివి అయితే.. మంచిది నాయనా. ఒక బ్రదర్ జవాబు వినండి.. నేను ఒక విషయం చెప్తా వినండి. ఒకప్పుడు మనము ఎన్నో తప్పులు చేసి ఉంటాము, తర్వాత యేసుక్రీస్తులోనికి వచ్చిన తర్వాత పరిశుద్ధంగా బ్రతకడానికి ప్రయత్నం చేస్తాము. ఎంత ప్రయత్నించినా అప్పుడప్పుడు బ్యాలెన్స్ అవుట్ అయి పడిపోయినట్టుగా పరిస్థితి కలుగుతూ ఉంటుంది. ఇలాగ ఎందుకు జరుగుతుంది, మనకు జయం ఎలా వస్తుంది, పడిపోయే ప్రమాదమే లేకుండా పరిశుద్ధ మార్గం ఎలా నడవాలి అనే ప్రశ్న మీరు అడుగుతున్నారు.
- 📖 జయానికి నాలుగు సూత్రాలు: నేను చెప్తున్నాను వెరీ సింపుల్.. అపోస్తల కార్యాలు రెండు 42 లో చెప్పినటువంటి నాలుగు విషయాలు మీరు క్రమం తప్పకుండా చేస్తూ ఉంటే.. ఒక్క రోజులోనే మీరు మార్పు రాకపోవచ్చు, దాన్ని క్రమక్రమేపి కొన్ని వారాలు నెలల లోపల తప్పక మీరు ఈ యొక్క సుడిగుండాల నుండి బయటకి వస్తారు గట్టెక్కుతారు. ఆ నాలుగు ఏంటంటే.. మొట్టమొదట అపోస్తలుల బోధ యందును, తర్వాత సహవాసమందును, రొట్టె విరుచుట యందును, ప్రార్థన చేయుటయందును. ఈ నాలుగు కూడా మీరు క్రమం తప్పకుండా చేస్తూ ఉండాలి.
- 🤝 సంఘ సహవాసం: కడప అని చెప్పారు, అక్కడ మీ ఊర్లో ఉన్నటువంటి ఒక సంఘాన్ని చూసుకోండి. అక్కడ చార్లెస్ విజయకుమార్ గారని, కడపలోనే రవికుమార్ గారు ఉన్నారు.. యా చార్లెస్ ఉన్నారు, రవికుమార్ గారు కూడా ఉన్నారు కడపలో. గనుక మీరు ఏం చేయాలంటే వారిని మీరు సంప్రదించి అక్కడ మన సహవాసానికి మీరు వెళితే.. ప్రతి ఆదివారము అపోస్తలులు చేసిన బోధ.. మొదటి శతాబ్దంలో క్రీస్తు అపోస్తలులు చేసిన ఆ బోధనే మనం వింటూ ఉంటే.. ప్రతి ఆదివారము సరైన విధానములో సిద్ధపడి మన పాపాలు ఒప్పుకొని యేసు రక్తంలో కడుక్కొని ఆయన శరీర రక్తంలో మనం పాలుపొంది ప్రభురాత్రి భోజనంలో కొనసాగితే.. మూడవదిగా పరిశుద్ధుల సహవాసంలో సాధ్యమైనంత ఎక్కువగా మనం ఉంటూ ఉంటే.. నాలుగవదిగా వ్యక్తిగత ప్రార్థన, సంఘ ప్రార్థన.. ఈ రెండు ఏది నిర్లక్ష్యం చేయకుండా ప్రార్థనలో కొనసాగితే మీకు శోధన రావడానికి అవకాశం ఉండదు.
- ✨ మనోబలం మరియు పరిశుద్ధాత్మ: ఫస్ట్ అఫ్ ఆల్ శోధన వచ్చే అవకాశం ఉండదు, వచ్చినా దాన్ని గెలిచేటటువంటి బలము, మనోబలం, సంకల్ప బలం దేవుడు మీకు ఇస్తాడు. పరిశుద్ధాత్మ దేవుడే మీలో ఉండి ఆ యుద్ధాన్ని చేసి మీకు జయం సాధించి పెడతాడు. వి డోంట్ బిలీవ్ ఆర్ ఎక్స్‌పెక్ట్ సిన్‌లెస్ పర్ఫెక్షన్ ఇన్‌స్టాంటేనియస్లీ (We don’t believe or expect sinless perfection instantaneously). నమ్మి బాప్తిస్మం పొందగానే ఏ పొరపాటు జరగనటువంటి సంపూర్ణ పరిశుద్ధత మనకు వస్తుందని బైబిల్ కూడా చెప్పడం లేదు. దానికి టైం పడుతుంది. యాకోబు భక్తుడు చెప్పాడు.. మనమందరము అనేక విషయాల్లో తప్పిపోవుచున్నాము, తొట్రిల్లుచున్నాము. గనుక ఒక్కసారైనా తప్పు చేయని భక్తుడు ఎవడు లేడు. ఒక్కసారైనా తప్పు చేయనోడు ఉంటే వాడిని మనం దేవుడు అంటాం, భక్తుడు అనం. కనుక మీరు అతిగా బాధపడకండి.. తప్పక దేవుడు మీకు జయ జీవితం ఇస్తాడు.
- 🛡️ ముగింపు: క్రైస్తవ జీవితం అనగా మనము దేవుని కొరకు జీవించే జీవితం కాదు.. మన కొరకు దేవుడు మన లోపలికి వచ్చి దేవుడే జీవించే జీవితం క్రైస్తవ జీవితం. మీరు ఎంత నిష్టగా ఉన్నా, ఎంత ప్రయత్నించినా సరే మీ సొంత కృషి వల్ల పరిశుద్ధతలో నడవలేరు. దేవుని కొరకు మనం బ్రతకడం కాదు, క్రీస్తే వచ్చి మనలో జీవించడం అది కౌశల్. క్రీస్తే వచ్చి మనలో జీవించాలంటే ఈ నాలుగు మనం చేస్తూ ఉండాలి. ఈ నాలుగు చేసినప్పుడు మీకు అతి సులభంగా పరిశుద్ధత సాధ్యమవుతుంది. అది విషయం. ఓకే బ్రదర్ గాడ్ బ్లెస్ యు.
Detailed English Translation:
❓ Question: Why do temptations still occur after salvation? How can a believer overcome sinful temptations and lead a holy life? (0:36:03)
- Understanding the Struggle: It is a common struggle for believers to face temptations even after accepting Christ. Many try hard to remain holy but occasionally find themselves stumbling. True spiritual victory is not achieved through human effort alone but through divine empowerment.
- The Apostolic Pattern for Victory: According to Acts 2:42, there are four essential pillars for a victorious Christian life: Apostles’ doctrine, fellowship, breaking of bread, and prayer. Consistency in these four disciplines creates a spiritual environment where sin cannot thrive.
- The Role of the Church and Holy Spirit: Being part of a local fellowship that teaches the original apostolic doctrine is vital. By participating in the Lord’s Table (Communion) and staying in prayer, a believer receives strength from the Holy Spirit. Sanctification is often a gradual process, not an instant state of perfection.
- Conclusion: Christian life is not about you trying to live for God, but about Christ living through you. As Apostle Paul taught, it is no longer we who live, but Christ who lives in us. By adhering to the apostolic pattern, overcoming temptation becomes possible through God’s strength.
