❓ ప్రశ్న: కొలొస్సి 2:16 మరియు కీర్తన 81:3 ప్రకారం అమావాస్య, పున్నమి పండుగలకు గల ప్రాముఖ్యత మరియు అర్థం ఏమిటి? కొత్త నిబంధనలో వీటిని ఎలా అర్థం చేసుకోవాలి? ప్రొఫెసర్ డాక్టర్ సందీప్ గారు కృష్ణా జిల్లా నుండి అడుగుతున్నారు. (0:42:26)
YouTube Link: ఇక్కడ క్లిక్ చేసి వీడియో చూడండి
దైవజనులు Apostle. Ranjith Ophir గారి వివరణ: (07m 06s)
- 🌙 నీడ మరియు నిజం: థాంక్యూ సో మచ్. చాలా ప్రాముఖ్యత కలిగిన ప్రశ్న అడిగారు ప్రొఫెసర్ డాక్టర్ సందీప్ గారు. కొలొస్సి రెండు 16 లో చెప్పబడిన విషయం ఏంటంటే.. నాలుగు సంగతులు చెప్పారు అక్కడ. కాబట్టి అన్నపానముల విషయంలోనే గాని, పండుగ విషయంలోనే గాని, అమావాస్య విషయంలోనే గాని, విశ్రాంతి దినము విషయంలోనే గాని.. ఈ నాలుగు విషయాల్లో మీకు తీర్పు తీర్చడానికి ఎవరికీ అవకాశం ఇవ్వద్దు అని చెబుతూ.. ఇవి రాబోవు వాటికి ఛాయే (Shadow) గాని, నిజం క్రీస్తులో ఉన్నది అని చెబుతున్నాడు. అంటే అన్నపానముల విషయంలో మీకు తీర్పు తీర్చడానికి అవకాశం ఇవ్వద్దు అంటే అర్థం ఏమిటి? మీరు విశ్రాంతి దినం సరిగ్గా పాటించలేదనో, పండుగలు పాటించలేదనో, బాగా చేశారనో చేయలేదనో.. మీ మీద ఒక జడ్జిమెంట్ (Judgment) ఎవరు పాస్ చేయనివ్వకండి. ఎందుకంటే అవి ఫైనల్ ఎక్స్ప్రెషన్ ఆఫ్ ట్రూత్ (Final expression of truth) కాదు అవి. అవి ఛాయయయే, నీడయే. అంటే అన్నపానములు ఒక నీడ, అసలైన అన్నపానములు వేరే ఉన్నాయి. విశ్రాంతి దినము ఒక నీడ, అసలైన విశ్రాంతి వేరే ఉన్నది. అమావాస్య ఒక నీడ, అసలైన అమావాస్య వేరే ఉన్నది అని చెప్తాడు.
- 📖 చంద్రబింబం – సంఘానికి సూచిక: ఇప్పుడు ఈ నాలుగు విషయాలలో అమావాస్య అనేది కూడా వచ్చింది. మరి 81వ కీర్తన మూడవ వచనంలో “అమావాస్య నాడు కొమ్ము ఊదుడి” అన్నాడు. అమావాస్య అనే మాటకు అర్థం ఏంటంటే.. చంద్రుడు క్షీణించి క్షీణించి క్షీణించి మొత్తం ఆల్మోస్ట్ జీరో పాయింట్ కి వచ్చేసే ఆ దినం. చంద్రకాంతి వెన్నెల ఆ రాత్రి ఏమాత్రమూ ఉండదు, అంతా చిమ్మ చీకటి. ఆ రోజు కొమ్ము ఊదమన్నాడు. కొమ్ము అనేది జయసూచకము, విజయ సూచకం. మొత్తం అంతా చిమ్మ చీకటి అయిపోయినప్పుడు కొమ్ము ఊదమన్నాడు. ఇక్కడ చంద్రబింబం అనేది క్రీస్తు సంఘానికి సూచక. ఎందుకంటే చంద్రుడికి స్వయం ప్రకాశము లేదు, స్వయం ప్రకాశకత్వము.. సెల్ఫ్ ఇల్యూమినేషన్ (Self-illumination) లేదు ఆయనకు. సూర్యుడు అయితే సెల్ఫ్ ఇల్యూమినేషన్ ఉన్నవాడు, తనంత తానే ప్రకాశిస్తాడు ఎవరి సహాయము అక్కర్లేదు. సూర్య కిరణాలు వచ్చి ఆ చంద్రుడి మీద పడాలి. చంద్రుడిది రిఫ్లెక్టెడ్ లైట్ (Reflected light), రిఫ్లెక్టెడ్ ఇల్యూమినేషన్. అంచేత ప్రతిఫలించిన ప్రతిబింబించే వెలుగే తప్ప సొంత వెలుగు కాదు.
- ⚖️ వృద్ధి క్షయములు మరియు ఆత్మీయ స్థితి: క్రీస్తు సూర్యుని వంటివాడు, ఆయన నీతి గాని పరిశుద్ధత జ్ఞానం అంతా ఆయన సొంత ప్రకాశమే. సంఘానికి ఉండే జ్ఞానం గాని, పరిశుద్ధత నీతి శక్తి బలం అంతా రిఫ్లెక్టెడ్ గ్లోరీ (Reflected glory), ప్రతిబింబించిన మహిమే గాని సొంత మహిమ కాదు. అందుచేత సూర్యునికి వృద్ధి క్షయములు ఉండవు, సంవత్సరమంతా ఏకరీతిగా ఉంటాడు. చంద్రుడికి నెలలో సగ భాగము క్షీణిస్తూ ఉంటాడు, ఇంకో సగ భాగం వృద్ధి చెందుతా ఉంటాడు. సంపూర్ణ చంద్రబింబం కలిగినప్పుడు ఎంతో అందంగా ఉంటుంది, సంబరపడతాం. మళ్ళా నెక్స్ట్ డే నుండే తగ్గుతా ఉంటుంది. మొత్తం చిమ్మ చీకటి అయిపోయినప్పుడు అయ్యో అని కృంగిపోతాం. నెక్స్ట్ డే మళ్ళీ పెరగడం స్టార్ట్ అవుతుంది. క్రీస్తు సంఘము ఇలాగే ఉంటుంది. అప్పుడప్పుడు పెరుగుతూ ఉంటుంది, తరుగుతూ ఉంటుంది. ఏ విశ్వాసికైనా అప్స్ అండ్ డౌన్స్ (Ups and downs) ఉంటాయి. పౌలు గాని, అబ్రహాము గాని, మోషే గాని, మీరు గాని, నేను గాని ఆత్మీయ జీవితంలో ఎప్పుడు ఏకరీతిగా ఉండము.. చంద్రుడు లాగా పెరుగుతూ తరుగుతూ ఉంటాం.
- ✨ కొత్త ఉజ్జీవం (New Revival): అయితే అమావాస్య అంటే క్రీస్తు కాంతి మన మీద పడి మనం ప్రకాశించేటటువంటి స్థితి మినిమం (Minimum) స్థాయికి వెళ్ళిపోయింది. మొత్తం చిమ్మ చీకటి చంద్రుడికి అసలు వెలుగే లేనటువంటి స్థితి అనుకున్నప్పుడు “కొమ్ము ఊదుడి” అన్నాడు. అంటే బిగినింగ్ ఆఫ్ ఏ న్యూ రివైవల్ (Beginning of a new revival) అన్నమాట! ఆ రోజే చంద్రుడు మళ్ళీ గ్రోత్ ప్రారంభం అవుతుంది. సంఘము గాని, విశ్వాసి గాని చాలా అత్యంత బలహీనంగా ఉన్నారు అనుకున్నప్పుడే ఉజ్జీవం వస్తుంది. గనుక మీరు బాధపడి కృంగిపోయి చిమ్మ చీకటి అయిపోయామని బాధపడకండి. దిస్ మే బి ఏ న్యూ రివైవల్ (This may be a new revival), బిగినింగ్ ఆఫ్ ఏ న్యూ రివైవల్ అనే ఒక నిరీక్షణ గల మాట 81వ కీర్తన మూడవ వచనం చెబుతోంది. దీని గూర్చి ‘ప్రమాణ వాక్యం’ అనే నా గ్రంథంలో చాలా తేటగా నేను చెప్పాను. అది తప్పకుండా ప్రొఫెసర్ సందీప్ గారు చదవాలని నేను ఆశిస్తున్నాను. ఇంకా చాలా మేటర్ ఉంది నా పుస్తకం చదివితే తెలుసుకుంటారు. అది విషయం. ఓకే.
Detailed English Translation:
❓ Question: What is the spiritual significance of New Moon and Full Moon festivals in light of Colossians 2:16 and Psalm 81:3? (0:42:26)
- Shadow vs. Substance: In Colossians 2:16, Apostle Paul mentions food, festivals, New Moons, and Sabbaths as ‘shadows’ of things to come, while the reality belongs to Christ. This means these rituals are not the final truth but pointers toward spiritual realities. No one should judge a believer based on the outward observation of these days because their true meaning is found in Jesus.
- The Moon as a Symbol of the Church: In Psalm 81:3, blowing the trumpet during the New Moon—a time of total darkness—is symbolic. The moon represents the Church, which has no light of its own (no self-illumination). It only reflects the glory of the Sun (Christ). Just as the moon relies entirely on the sun for its brilliance, the Church relies on Christ for its wisdom, holiness, and power.
- Spiritual Waxing and Waning: Unlike the Sun, which remains constant, the moon waxes and wanes. Similarly, the spiritual life of the Church and individual believers often fluctuates. There are periods of great spiritual brightness (Full Moon) and periods of decline or weakness (New Moon). Even great men of God like Abraham and Moses experienced these highs and lows.
- The Hope of New Revival: The New Moon marks the darkest point, but it is also the precise moment when the moon begins to grow again. Blowing the trumpet at the New Moon symbolizes the beginning of a ‘New Revival.’ When a believer feels at their lowest or darkest, it is often the start of a fresh spiritual awakening. This provides hope that spiritual growth is about to restart.
