❓ ప్రశ్న: చేతికి ఉంగరాలు పెట్టుకోవడం వల్ల రక్షణకు ఏమైనా ఆటంకం కలుగుతుందా? దీనివల్ల పరిశుద్ధాత్మ శక్తి తగ్గిపోతుందా? వరంగల్ నుండి శివకుమార్ గారు అడుగుతున్నారు. (1:02:03)
YouTube Link: ఇక్కడ క్లిక్ చేసి వీడియో చూడండి
దైవజనులు Apostle. Ranjith Ophir గారి వివరణ: (05m 40s)
- 💍 రక్షణకు ప్రాతిపదిక: శివకుమార్ గారు వందనాలు.. గుడ్ ఈవెనింగ్. మీరు YouTube లో చూశానని చెప్పారు కదా.. ప్రభువైన యేసునందు విశ్వాసముంచుము, నమ్మి బాప్తిస్మం పొందినవాడు రక్షింపబడును అని చెప్పాను తప్ప, చేతికి రింగు పెట్టుకున్న వాడికి రక్షణ వస్తుందని నేను చెప్పలేదు. అలాగని రింగు పెట్టుకోవడం వల్ల రక్షణ పోతుందని కూడా నేను చెప్పలేదు. చేతికి రింగు పెట్టుకోవడం వల్ల పరిశుద్ధాత్మ శక్తి వస్తుందని గాని, లేకపోతే క్రీస్తు న్యాయపీఠం ముందు బహుమానం ఉంటుందని గాని నేను ఎక్కడా చెప్పలేదు. ఇది రక్షణకు సంబంధం లేని విషయం.
- 🛡️ భౌతిక vs ఆత్మీయ విషయాలు: రక్షణకు సంబంధం లేని విషయాన్ని మనం ఎలా అర్థం చేసుకోవాలి? ఇప్పుడు తలకాయ నొప్పి వస్తే అమృతాంజనం పెట్టుకుంటాము. అమృతాంజనం అనేది స్పిరిచువల్ మేటర్ (Spiritual matter) కాదు, అది ఫిజికల్ (Physical) గా తలకాయ నొప్పికి వచ్చింది కాబట్టి అమృతాంజనము లేదా జండుబామ్ పెట్టుకుంటాం. అట్లాగే ఇప్పుడు రింగ్ పెట్టుకున్నాము అంటే.. పెళ్లైందనే సూచనకో రింగ్ పెట్టుకుంటాము, అందం కొరకో ఒకటి పెట్టుకుంటాము, సౌందర్యం కనపడడానికి ఏదో ఒకటి పెట్టుకుంటాం. నాకు గ్రీన్ కలర్ అంటే ఇష్టం, బ్లూ అంటే ఇష్టం అని పెట్టుకుంటాం. దానివల్ల సమాజంలో మనకు కొంత వ్యతిరేకత తక్కువైపోతుందని ఒక నమ్మకం. అది చచ్చిపోయినాక అగ్నిగుండం నుండి తప్పించడానికి మాత్రం పనికి రాదు. మనల్ని అగ్నిగుండం నుండి కాపాడేది యేసు రక్తము తప్ప ఇంకేది కాదు.
- 📖 ఆకాశ మండలపు కట్టడలు: ఈ భూమి మీద ఉంటున్నాము గనుక, తలకాయ నొప్పి వచ్చినప్పుడు అమృతాంజనం పెట్టుకున్నట్టు ఏదో ఒకటి పెట్టుకుంటాం. దీనివల్ల యేసుప్రభువు కోప్పడతాడు అని నేను చెప్పలేదు. ఇది మన సంఘ సిద్ధాంతం కాదు, మీరు అందరూ పెట్టుకోవాలని నేను రూల్ పెట్టలేదు. దేవుని ముందు మనం నిలబడ్డప్పుడు ఆయన నువ్వు పెట్టుకున్న అమృతాంజనాన్ని గురించి అడగడు, నువ్వు పెట్టుకున్న రాయి గురించి అడగడు. అది భూసంబంధమైనది. ఈ విషయంలో యోబు గ్రంథం 38వ అధ్యాయం 33వ వచనంలో ఒక మాట ఉంది.. “ఆకాశ మండలపు కట్టడలు నీవెరుగుదువా? ఆకాశ మండలమునకు భూమి మీద గల ప్రభుత్వము నీవు స్థాపింపగలవా?” అని దేవుడు యోబును అడిగాడు. ఆకాశ మండలము అంటే ఏమిటి? దానికి భూమి మీద ఉన్న ప్రభుత్వం ఏమిటి? ఆకాశ మండలం దీని మీద గవర్నమెంట్ (Government) చేయడం ఏమిటి? దీనికి సమాధానం తెలియకుండా నన్ను బ్లేమ్ చేయడం అర్థం లేని పని.
- ✨ ముగింపు: నా సాహిత్యం చదవండి.. ‘పోరాడండి’ అనే గ్రంథంలో యూదా పత్రిక గురించి రాసినప్పుడు ఆకాశ మండలానికి భూమి మీద ఉన్న ప్రభుత్వం గురించి వివరంగా రాశాను. ఇది రక్షణకు సంబంధించింది కాదు, రక్షణకు సహాయం కాదు, రక్షణకు ఆటంకం కాదు. అమృతాంజనంతో సమానం అది. రక్షణ పొంది దేవునితో సంబంధం కలిగి ఉండటం ముఖ్యం తప్ప, ఇటువంటి బాహ్యమైన విషయాలను బట్టి ఒకరిని తీర్పు తీర్చకూడదు. నా ప్రసంగాలు వినకుండా, నా పుస్తకాలు చదవకుండా డైరెక్ట్ గా బ్లేమ్ చేసే ముందు ఆ సమాచారం అంతా తెలుసుకోండి. అది విషయం. ఓకే.
Detailed English Translation:
❓ Question: Does wearing rings interfere with salvation or reduce the power of the Holy Spirit? Does the Bible forbid wearing such adornments? (1:02:03)
- The Basis of Salvation: Salvation is rooted entirely in faith in Jesus Christ and obedience through baptism. I have never preached that wearing a ring grants salvation or provides spiritual power. Similarly, wearing a ring does not take away one’s salvation. These are physical matters that do not influence the spiritual state of a redeemed soul.
- Physical Necessity vs. Spiritual Reality: I often use the analogy of using a pain balm like Amrutanjan for a headache. Applying balm is a physical response to a physical ailment; it is not a spiritual act. Similarly, people wear rings for various reasons—as a symbol of marriage, for aesthetic beauty, or out of personal preference. These objects cannot save a person from eternal judgment; only the blood of Jesus can do that.
- The Dominion of the Heavens: In Job 38:33, God asks, “Do you know the laws of the heavens? Can you set up their dominion over the earth?” There are celestial laws and influences that the Bible mentions, which I have explored in my book ‘Poradandi’ while explaining the Epistle of Jude. These are complex biblical mysteries that go beyond simple legalism about jewelry.
- Conclusion: Wearing a ring is neither a requirement for salvation nor an obstacle to it. It is as mundane as using a physical medicine. One should focus on their relationship with Christ rather than judging others based on external adornments. I encourage everyone to read my literature to understand the deeper scriptural context before jumping to conclusions.
