❓ ప్రశ్న: మలాకీ గ్రంథములో మూడవ అధ్యాయము ఐదు నుండి తొమ్మిది వచనాల్లో చూస్తే తొమ్మిదవ వచనంలో దశమ భాగము గురించి మాట్లాడుతూ మీరు నా యొద్ద దొంగిలుచున్నారు, ఆ దొంగిలు వారందరికీ కూడా శాపము కలుగుతుంది అని చెప్పేసి దేవుడు అన్నాడు. దశమ భాగం తప్పకుండా ఇవ్వాలా? దశమ భాగం ఇవ్వకపోతే దేవుడు ఏ విధమైన శాపాలు ఇస్తాడు? (1:12:42)
YouTube Link: ఇక్కడ క్లిక్ చేసి వీడియో చూడండి
దైవజనులు Apostle. Ranjith Ophir గారి వివరణ: (06m 08s)
- 💰 ధర్మశాస్త్రం కంటే ముందే దశమ భాగం: థాంక్యూ సో మచ్. ఇప్పుడు దశమ భాగము అనేది బాల శిక్షకుని కింద ధర్మశాస్త్రము మనలను క్రీస్తునొద్దకు నడిపించే స్కూల్ మాస్టర్, బాల శిక్షకుడు ఆయన అని గలతీ పత్రికలో పౌలు గారు చెప్తారు. గనుక దశమ భాగం అనేది ఫస్ట్ అఫ్ ఆల్ మోషే ధర్మశాస్త్రముతో రాలేదు. ఇది అందరూ కూడా గ్రహించాల్సిన విషయం. మోషే సీనాయి కొండ దగ్గర ధర్మశాస్త్రమును కొండ శిఖరంలో పొంది ఇశ్రాయేలు ప్రజలకు ఇచ్చినప్పుడు దశమ భాగం అప్పుడు స్టార్ట్ కాలేదు. మోషే కంటే ఐదు వందల ఏళ్ల కిందట మూల పురుషుడైన అబ్రహాము దశమ భాగం ఇచ్చాడు మెల్కీసెదకు ఇచ్చాడు. తర్వాత యాకోబు.. “నన్ను క్షేమంగా కాపాడి మళ్ళీ తీసుకొస్తే నా సంపాదనలో దేవునికి దశమ భాగం ఇస్తానని” యాకోబు ప్రార్థన చేశాడు. గనుక వీళ్ళు పితరులు ఇశ్రాయేలు జనాంగానికి వీళ్ళు మూల పురుషులు. మరి ధర్మశాస్త్రం పుట్టకముందే దశమ భాగం ఉన్నది. దశమ భాగం తీసుకొని మెల్కీసెదకు అబ్రహామును ఆశీర్వదించాడు.
- 📖 కొత్త నిబంధన క్రమం: తర్వాత క్రీస్తు ప్రభువు యజ్ఞంతో ధర్మశాస్త్రం కొట్టివేయబడింది. ధర్మశాస్త్రం కొట్టివేయబడ్డంత మాత్రాన దశమ భాగం అనేది కొట్టివేయబడదు. ఎందుకంటే ఈ సీనాయి కొండ సంబంధమైనటువంటి నిబంధనలో అది భాగము కాదు. ఇచ్చి ఆశీర్వదింపబడ్డ వాళ్ళు ఎందరో ఉన్నారు. ధర్మశాస్త్రములోనేమో పాత నిబంధనలో నూటికి పది రూపాయలు ఇమ్మని ఉంది. కొత్త నిబంధనకు వచ్చిన తర్వాత తమ చరాస్తి స్థిరాస్తి అమ్మేసి అపోస్తుల పాదాల దగ్గర పెట్టారని ఉన్నది. గనుక దశమ భాగం తప్పైతే మేము కొత్త నిబంధన క్రమంలో ఉంటాం అనుకుంటే మీ చర స్థిరాస్తులు అమ్మేసి తీసుకురండి మరి. సువార్త ప్రకటన చేద్దాం! చర స్థిరాస్తులు అమ్మడమే కొత్త నిబంధన పద్ధతి.. అమ్మి సువార్త కొరకు ఖర్చు పెట్టడం. మరి అది కష్టంగా ఉంటే కనీసం పాత నిబంధనలోనైనా ఉండండి. నువ్వు ఉన్న ఆస్తి అమ్మేసి దేవునికి ఇవ్వను అంటున్నావు.. మరి పోనీ ఓల్డ్ టెస్టమెంట్ కి పొమ్మంటే అక్కడ కూడా ఉండనంటావు.. మరి అసలు వీడు బైబిల్లోనే లేడు!
- ✨ నా వ్యక్తిగత అనుభవం: దేవునికి ఇచ్చే దగ్గర లెక్కలేమున్నదండి? నేనైతే ఎప్పుడు దేవునికి దశమ భాగం ఇవ్వలేదు. నేను ఉద్యోగం చేసిన వాడినే కదా.. దశమ భాగం ఇమ్మంటే చాలా కోపం వచ్చేది నాకు. నేను దేవునికి వంద రూపాయలు సంపాదించాను, నేను నీకు పది రూపాయలు ఇస్తాను తీసుకోమని అనడానికి నేనెవరిని? వచ్చిన వందకు వంద రూపాయలు దేవునివే! మొత్తం దేవునికి ఇచ్చేస్తానని నా జీవితం పణంగా పెట్టినట్టు నా బీరువాలో పెట్టి ప్రార్థన చేసి, నెల రోజులు ఒక రూపాయి, రెండు రూపాయలు, ఐదు రూపాయలు యేసయ్య నీ పర్మిషన్ తో తీసుకుంటున్నాను అని తీసుకునేవాడిని. నాకు వేరే అలవాటు ఏమీ లేవు.. అప్పుడప్పుడు టీ తాగడం, ఒక అరటిపండు తినడం అంతకంటే ఏమీ లేదు. గనుక మిగిలిన డబ్బంతా.. రెండు వేల ఐదు వందల రూపాయలు వచ్చాయనుకోండి అప్పుడు.. ఈ.సి.ఐ (ECI) లో 1977 లో సంగతి.. 1980 వరకు నెలంతా నాకు పాకెట్ మనీ 500 కూడా కాదు, మిగతా 2000 ఇది నీదే ప్రభువా అని దేవునికి ఇచ్చేసేవాడిని. ఆ విధంగా దేవునికి నేను ఇవ్వడం ఏంటి? వీలైతే ఇది కూడా ఇచ్చేద్దాం అనే ఆశ ఉండాలి.
- 🛡️ మరియ త్యాగం – సువార్త లక్ష్యం: ఇప్పుడు దేవునికి ఇవ్వడం ఎట్లాగంటే ఆమె అత్తరు జటామాంసి. యేసుప్రభువు వారు సిలువకు వెళ్లకముందు మొత్తం బద్దలు కొట్టి ఆయన అత్తరు ఆయన తల మీద పోసి అభిషేకిస్తే.. ఈ నష్టం ఎందుకు అన్నారు పరిసయ్యులు గానీ అక్కడ ఉన్నవాళ్లు శిష్యులు కూడా అన్నారు. అప్పుడు యేసయ్య అన్నారు ఆమె అది ఉంచుకొని ఆ ధర్మము, ఆ మంచి పని చేసింది.. సువార్త ఎక్కడ ప్రకటించినా సర్వలోకములో ఈమె ఏమి చేసిందో ప్రకటించబడుతుంది అన్నాడు. ఎందుకంటే సువార్త విన్న ప్రతివారు ఈమె లాగా తయారు కావాలి. దేవునికి ఎంత ఇచ్చేసేయాలంటే.. ఇంత ఎందుకు ఇస్తున్నావురా అని లోకం అనాలి! ఇంత నష్టం అవసరమా? ఇంత త్యాగం అవసరమా? ఇంత ఖరీదా? అని ఊరోళ్లు ఆశ్చర్యపడేటట్టు ఈ మరియ లాగా తయారు కావాలని సువార్త ప్రకటించబడుతుంది. సో టు మేక్ అస్ పీపుల్ లైక్ దట్ ఉమెన్ (To make us people like that woman), దట్ ఈజ్ ద గోల్ ఆఫ్ ద గాస్పెల్. సువార్త వినేసి నమ్మి బాప్తిస్మం పొంది ఊరుకోవడం కాదు.. మనకు ఉన్నదంతా దేవునికి ఎంత ఇచ్చేయాలి అంటే చూసే వాళ్ళకి మనకు పిచ్చి పట్టింది అనిపించాలి. అంతగా దేవునికి ఇవ్వడానికి మనం ఇష్టపడాలి. అలా తయారు చేయడమే సువార్త యొక్క గోల్. అంతగా దేవుని కొరకు ఇచ్చారు అనుకున్నవాడు ఈ ప్రశ్న అడగడు.. దశమ భాగం చేయాలా నశం భాగం చేయాలా అని అడగడు.
- ⚖️ శాపం వస్తుందా?: ఇక శాపాలు ఏమొస్తాయి ఇవ్వకపోతే అంటే.. శాపం కాదు ఆశీర్వాదం అనేది ఆగిపోతుంది అంతే. దేవునికి ఇవ్వడం గూర్చి మీరు డిస్కషన్ మొదలుపెట్టారంటే అక్కడ దేవుడు నల్లా కట్టేస్తాడు, కుళాయి కట్టేస్తాడు. ఆశీర్వాదాల ప్రవాహం ఆగిపోతుంది. ప్రత్యేకంగా శాపం ఏమీ రాదు. ఆశీర్వాదాలు రాకపోవడమే పెద్ద శిక్ష. దేవుని పట్ల మనకున్న ప్రేమను బట్టి సంతోషంగా ఇవ్వడమే గొప్ప విషయం. అది విషయం. ఓకే.
Detailed English Translation:
❓ Question: According to Malachi 3:5-9, those who rob God of tithes are cursed. Is tithing mandatory today? What kind of curses follow if one doesn’t tithe? (1:12:42)
- Tithing Predates the Law: Tithing is often misunderstood as merely a requirement of the Mosaic Law. However, Apostle Paul explains that the Law acted as a schoolmaster to lead us to Christ. Tithing actually existed long before Moses. Abraham gave a tenth to Melchizedek 500 years before the Law was given, and Jacob vowed to give a tenth of all he earned. Thus, tithing was a spiritual principle followed by the patriarchs before it became a legal requirement.
- New Testament Standards: While the Law was fulfilled in Christ, the principle of giving remained. In fact, the New Testament standard is higher—early Christians sold their possessions and brought the proceeds to the Apostles. If one rejects tithing as “Old Testament,” the New Testament alternative is to dedicate everything to God’s work. One cannot claim to be a New Testament believer while being less generous than those under the Old Covenant.
- Personal Testimony of Giving: I have never looked at it as a mere ten percent. When I was employed, I felt everything I earned belonged to God. I would surrender my entire salary to Him and only take a small amount for my basic needs like tea or fruit. The rest was dedicated to the Lord’s work. The goal is to develop a heart that desires to give everything to the Master.
- The Example of Mary: When Mary broke the alabaster box of expensive perfume to anoint Jesus, people called it a waste. But Jesus commanded that her story be told wherever the Gospel is preached. The goal of the Gospel is to create people like her—people whose generosity is so extreme that the world thinks they are mad. If we truly love God, we won’t haggle over percentages.
- Conclusion on Curses: Regarding the curse mentioned in Malachi, it’s not that a new curse is sent, but rather that the flow of divine blessings is cut off. When we stop giving, we effectively close the tap of God’s provision. The absence of God’s blessing is the greatest loss. True giving should stem from a heart of love and gratitude, not from a sense of legalistic obligation or fear of a curse.
