❓ ప్రశ్న: ప్రకటన గ్రంథంలో ’10 దినములు శ్రమ కలుగును’ అనే మాటలోని అంతరార్థం ఏమిటి? (0:23:51)
YouTube Link: ఇక్కడ క్లిక్ చేసి వీడియో చూడండి
దైవజనులు Apostle. Ranjith Ophir గారి వివరణ: (01m 33s)
- ⏳ కాల వ్యవధి ప్రాముఖ్యత: పది దినములు శ్రమ కలుగును అనేది మరి అది దీర్ఘకాలము, మరీ దీర్ఘకాలము కాకుండా మరీ తక్కువ కాకుండా కొంత సమయము నీకు శ్రమ కలుగుతుంది అని తీసుకోవాలి తప్ప దానికి ఆత్మీయ అర్థం ఏమీ మనం చెప్పకూడదు. ఎందుకని అంటే అటువంటి విషయాలు మరికొన్ని బైబిల్ లో ఉన్నాయి. అది ఇప్పుడు ఏ వచనానికైనా మనం ఒక వైఖరి అవలంబిస్తున్నామంటే దాన్ని జస్టిఫై చేసుకోవాలి కదా.
- 📖 లేఖన సమన్వయం: ఇప్పుడు ఆ పది మంది రాజులు క్రూర మృగముతో కూడా ఒక గడియ అధికారం పొందుదురు అని ఉంది. గడియ అంటే మరి అంతనే టైం అని అనుకోలేము కదా. తర్వాత ‘కొంచెము కాలం’ వారు అధికారంలో ఉండాలి అని అంటాడు.. మరి ఎంత కాలము?. గనుక అక్కడ ఆ టైం పీరియడ్ (Time Period) ఇంత లెంగ్త్ అనేది స్పెసిఫై చేసి దాంట్లో ఆత్మీయ అర్థం వెతుక్కోవాల్సిన అవసరం లేదు.
- 🛡️ ముగింపు: ఒకవేళ ఆ టైం పీరియడ్ అదే స్పెసిఫై చేసి దాంట్లోనే మనకు ఇంపార్టెంట్ మెసేజ్ ఉంటే అదే ఫ్రేజ్ (Phrase) ఇంకొక చోట బైబిల్ లో రిపీట్ అవుతుంది. కనీసం రెండు చోట్ల రిపీట్ అయినటువంటి స్టేట్మెంట్ గురించి మనం పట్టించుకోవాలి కానీ ఒకటే చోట ఆ విధమైన పదజాలం కనపడి ఇంకా లేఖనంలో ఎక్కడా లేదనుకోండి, దాన్ని మనం అంత సీరియస్ గా తీసుకోవద్దు. ఇది ఆ ప్రశ్నకి సమాధానం.
Detailed English Translation:
❓ Question: What is the inner meaning of the phrase ‘ten days of tribulation’ mentioned in the Book of Revelation? (0:23:51)
- Duration and Interpretation: Apostle Ranjith Ophir explains that the ‘ten days’ should be understood as a specific, limited duration of time rather than searching for a complex spiritual or hidden meaning. It signifies a period that is neither too long nor too short, but a defined time of testing.
- Biblical Patterns: He notes that the Bible uses various time-related terms like ‘one hour’ or ‘a little while’ to describe periods of authority or trial. Unless a specific duration is repeated across multiple scriptures to establish a doctrinal point, it should be taken as a literal or descriptive timeframe for that specific context.
- Conclusion: The emphasis is on the fact that the tribulation is temporary and ordained by God, rather than the numerical value of ‘ten’ holding a secret spiritual code.
