❓ ప్రశ్న: పవిత్ర మరియు అపవిత్ర జంతువుల వర్గీకరణకు గల కారణం ఏమిటి? వాటి సాదృశ్యాలు (సామ్యతలు) ఏమిటి? (0:12:42)
YouTube Link: ఇక్కడ క్లిక్ చేసి వీడియో చూడండి
దైవజనులు Apostle. Ranjith Ophir గారి వివరణ: (10m 15s)
- 📜 ధర్మశాస్త్ర విభజన: మొట్టమొదటి విషయం ఏంటంటే అసలు ధర్మశాస్త్రములోని ఆజ్ఞలు నైతిక పరమైన ఆజ్ఞలు ఒక వర్గము ఒక కోవకు చెందినవి. అలాగే మరి దాన్ని ఏమంటారంటే ఆచార వ్యవహారానికి లేక పరంపర్యము లేక పూజా విధానమునకు ఆరాధన విధానానికి సంబంధించినటువంటి ఆ ధర్మశాస్త్రము ఆజ్ఞలు. దైవారాధనకు సంబంధించిన ఆజ్ఞలన్నిటిని సెరిమోనియల్ లా (Ceremonial Law) అంటాం. అలాగే నైతిక ప్రమాణాలకు కొలతలకు సంబంధించిన ఆజ్ఞలను మోరల్ లా (Moral Law) అంటారు. ఏసుప్రభువు వారు అవతరించి యజ్ఞము జరిగిన తర్వాత మోరల్ లా అనేది చేంజ్ కాలేదు, మోరల్ లా అనేది కొట్టివేయబడలేదు. నీతి ప్రవర్తన కొరకైన ఆజ్ఞలు ఎన్నైతే పాత నిబంధనలో ఉన్నాయో అవన్నీ కొత్త నిబంధనలో యేసు ప్రభువు గాని ఆయన అపోస్తలులు గాని మళ్ళీ రిపీట్ చేశారు.
- ⚖️ సెరిమోనియల్ లా మరియు ఆహారం: దేవుని దృష్టిలో మనం ఇది చేస్తే పవిత్రము ఇది చేస్తే అపవిత్రము అనేవి సెరిమోనియల్ లా అంటాం. మనలను దేవుని ముందు నీతిమంతులుగా లేక పరిశుద్ధులుగా పాపరహితులుగా సంపూర్ణులుగా నిలబెట్టడానికి ఈ ఆజ్ఞలు కావాలి. దేవునితో మనం సమాధాన పడడానికి ఈ ఆజ్ఞలు మనం పాటించి తీరాలి అప్పుడే దేవుని ముందు మనం క్షమాపణ పొందుతాము అనేది సెరిమోనియల్ లా.. అది ఇప్పుడు లేదు. అందులోనే ఈ పవిత్ర జంతువులు లోపలికి వస్తాయి. పందిని తినొద్దు అన్నాడు, తింటే వాడు అపవిత్రుడు అని అన్నాడు. దీనిలో దేవుడు కొన్ని సాదృశ్య పాఠాలు చెప్పాడు.
- 🐂 చీలిన గిట్టలు – స్థిరత్వం: పవిత్ర జంతువులు అని అంటే దానికి గిట్టలు చీలి ఉండాలి, నెమరు వేయాలి. ఈ రెండు ఉంటేనే పవిత్ర జంతువు బలికి పనికొస్తుంది, మనకు ఆహారానికి పనికొస్తుంది. గిట్టలు అంటే భూమి మీద గ్రిప్ (Grip) ఉంటుంది దానికి. ఉదాహరణకు గుర్రము అతి వేగంగా పరిగెడుతుంది కానీ దానితోని మనము భూమి దున్నలేము, నాగలి కడితే అది జారుతుంది. ఎందుకు గిట్టలు ఉంటాయి అంటే భూమిని ఆ రెండు గిట్టలతో ఇట్లా గుచ్చి తన్ని పట్టుకొని భూమి మీద గ్రిప్ పెట్టుకొని బరువులు ఎంతైనా లాగగలుగుతుంది. “మీరు స్థిరులును కదలని వారునై ఉండండి” అని మొదటి కోరింది 15:58 లో చెప్పిన హెచ్చరిక గిట్టలు కలిగినటువంటి విశ్వాసికే సాధ్యమవుతుంది. ఎన్నో శ్రమలలో యోబు, దావీదు, యోసేపు, పౌలు అందరూ కూడా స్థిరంగా నిలబడ్డారు. ఆ స్థిరంగా నిలబడే శక్తిని అలంకార రూపకంగా గిట్టలు అన్నారు.
- 🧠 నెమరు వేయుట – ధ్యానం: రెండవది నెమరు వేయుట. విన్నది విన్నట్టు మర్చిపోవడం కాదు. పందికి గిట్టలు ఉంటాయి కానీ అది నెమరు వేయదు. అది తిన్నది అటు నుంచి అటు వెళ్ళిపోవాల్సిందే తప్ప మళ్ళీ వెనక్కి తెచ్చుకునేది దానికి ఉండదు. దేవుడు మనతో మాట్లాడే మాటలు మనకు ఆహారం అయితే ఒకేసారి విని దాన్ని మర్చిపోవడం కాదు. దేవుని మాటలు మళ్ళీ మళ్ళీ ధ్యానము చేయాలి. మొదటి కీర్తనలో దావీదు చెప్పినట్టు ధర్మశాస్త్రమునందు ఆనందించుచు దివారాత్రములు దానిని ధ్యానించువాడు ధన్యుడు.. అదే నెమరు వేయడం. చాలామంది క్రైస్తవులు ప్రసంగం అంతా విన్నాక బయటకు వెళ్ళాక ఏమి చెప్పారని అడిగితే గుర్తులేదు అంటారు. వాడు దేవునికి సజీవ యాగంగా పనికిరాడు. అటువంటి వాళ్ళను పందులు అని అవమానించొద్దు కానీ అది నిర్లక్ష్యం.
- 🛡️ దేవుని పరీక్ష: అసలు ఈ ఆజ్ఞలు ఎందుకు ఇచ్చాడు అని అంటే ద్వితీయోపదేశకాండము 8:2 లో ఉన్నట్టు నీవు ఆయన ఆజ్ఞలను గైకొందువో లేదో నిన్ను శోధించి నీ హృదయములో ఉన్నది తెలుసుకొనుటకు నిన్ను అణుచు నిమిత్తము దేవుడు నిన్ను పరీక్షించాడు. దేవుని మాట నాకు అర్థమైనా లోబడతాను, అర్థం కాకపోయినా లోబడతాను అనే కమిట్మెంట్ నీకు ఉన్నదో లేదో అని తెలుసుకోవడానికి ఈ ఆజ్ఞలు ఇచ్చాడు. కొత్త నిబంధనకు వచ్చినాక సెరిమోనియల్ లా అనేది లేదు, ఆహార విషయంలో నియమ నిబంధనలు లేవు. హెబ్రీ 13:9 ప్రకారం ఆహారమును బట్టి హృదయం స్థిరపరచుకోవద్దు అని ఉంది. అది విషయం. ఓకే.
Detailed English Translation:
❓ Question: What is the reason behind the classification of clean and unclean animals, and what are their spiritual symbolisms? (0:12:42)
- The Distinction of Laws: Apostle Ranjith Ophir explains that the Mosaic Law contains Moral Laws (eternal ethics) and Ceremonial Laws (ritual purity). While Jesus reaffirmed the Moral Law, the Ceremonial Law, which included dietary rules, was fulfilled through His sacrifice and is no longer a requirement for salvation.
- Spiritual Symbolism of Hooves: Clean animals were defined by split hooves and rumination. Split hooves represent spiritual stability and the ability to hold one’s ground (grip) during trials. Just as an ox with split hooves can pull heavy loads without slipping, a believer must remain steadfast in faith as instructed in 1 Corinthians 15:58.
- The Importance of Rumination: Chewing the cud (rumination) symbolizes continuous meditation on the Word of God. Animals like pigs have split hooves but do not ruminate, representing those who hear the Word but do not retain or meditate on it. True spiritual maturity comes from ‘chewing’ on scripture day and night.
- Testing of the Heart: These dietary laws were primarily a test of obedience (Deuteronomy 8:2) to see if humanity would follow God’s instructions even without fully understanding the reasons. In the New Testament era, a believer’s heart is established by grace rather than dietary observances (Hebrews 13:9).
🔑 Keywords:
✍️📜🤝
