125.Q: Woe to Pregnant and Nursing Mothers (KSM 08) (KSM 125)

❓ ప్రశ్న: గర్భిణీలకు, పాలిచ్చు వారికి శ్రమ అని ఎవరిని ఉద్దేశించి చెప్పారు? అది ఎప్పుడు జరుగుతుంది? (0:25:27)

YouTube Link: ఇక్కడ క్లిక్ చేసి వీడియో చూడండి

దైవజనులు Apostle. Ranjith Ophir గారి వివరణ: (02m 28s)

  • 🤰 యూదులకు సంబంధించిన విషయం: అది నాశనకరమైన హేయ వస్తువు పరిశుద్ధ స్థలములో నిలుచుట మీరు చూసిన తర్వాత అప్లై అవుతుందని యేసునాధుడే చెప్పాడు. మరి మత్తయి సువార్త 24వ అధ్యాయాన్ని మనం చూసినట్లయితే అక్కడ ప్రభువు వారే చెబుతారు ఆ 15వ వచనంలో.. ప్రవక్త అయిన దానియేలు ద్వారా చెప్పబడిన నాశనకరమైన హేయ వస్తువు పరిశుద్ధ స్థలమందు నిలుచుట మీరు చూడగానే యూదయలో ఉండువారు కొండలకు పారిపోవాలి. అంటే యూదులకు, ఇశ్రాయేలు జనాంగానికి సంబంధించిన విషయం అది.
  • 🏃 పారిపోయేటప్పుడు కలిగే ఇబ్బందులు: ఆ దినమున పొలములో ఉండువారు తన బట్టలు తీసుకుపోవడానికి ఇంటికి రాకూడదు, మరి మిద్దె మీద ఉండువాడు ఇంట్లో నుంచి ఏమైనా తీసుకొని పోవడానికి దిగకూడదు. “అయ్యో ఆ దినములలో గర్భిణులకును పాలిచ్చు వారికిని శ్రమ!”. మీరు పారిపోవుట చలికాలమందైనా విశ్రాంతి దినమందైనా సంభవింపకుండవలెనని ప్రార్థించుడి అని ప్రభువు అన్నాడు. పారిపోయే వాళ్ళు ఎవరు? 16వ వచనంలో చెప్పినట్టు యూదయలో ఉండేవారు. వాళ్ళు పారిపోయేటప్పుడు అది చలికాలం అయితే ఎక్కువ దూరము పారిపోలేరు, గర్భిణులు అయితే ఎక్కువ దూరం పారిపోలేరు.
  • సమయం మరియు సందర్భం: అది రెండవ అర్ధవారం (Second half of the 70th week). ప్రవక్త అయిన దానియేలు ప్రవచించిన నాశనకరమైన హేయవస్తువు అంటే దానియేలు గ్రంథము 9:27లో ఉన్నది ఆ మాట.. “అర్ధవారమునకు నాశనకరమైనది నిలుచును” అని. అంటే ఫస్ట్ హాఫ్ వీక్ (First half week) లో ఏమీ జరగదు. ఆ అర్ధవారం గడిచినాక, ఇన్ ద మిడిల్ ఆఫ్ ద వీక్ (In the middle of the week) వాడు అధికారంలోకి వచ్చాక, మూడున్నర సంవత్సరాలకు ఈ నాశనకరమైన వస్తువు నిలబడుతుంది, అప్పుడు యూదయలో ఉండే వాళ్ళు పారిపోతారు. గనుక వాళ్లకు చెబుతున్నాడు అన్నమాట. అది విషయం. ఓకే.

Detailed English Translation:

❓ Question: Who was Jesus referring to when He said “Woe to those who are pregnant and nursing,” and when will this happen? (0:25:27)

  • Specific Context for Judea: Apostle Ranjith Ophir clarifies that this prophecy in Matthew 24 is specifically addressed to the Jewish people in Judea. It concerns the time when the “Abomination of Desolation” is set up in the temple.
  • The Hardship of Fleeing: The warning highlights the extreme difficulty for pregnant women and nursing mothers to flee quickly during this intense period of persecution. Jesus urged prayer that this flight would not happen in winter (due to cold) or on the Sabbath (due to travel restrictions).
  • The Prophetic Timeline: This occurs during the second half of Daniel’s 70th week (the final 3.5 years of the tribulation). Once the Antichrist breaks his covenant and sets up the abomination, the time for immediate flight begins for those in Judea.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

సంప్రదించండి

📞 Call 9000083219 💬 WhatsApp

షేర్ చేయండి

WhatsApp Facebook Telegram