126.Q: Daniel’s Use of Wine – Understanding the Difference (KSM 08) (KSM 126)

❓ ప్రశ్న: దానియేలు మొదటి అధ్యాయంలో ద్రాక్షరసాన్ని వద్దని, 10వ అధ్యాయంలో ఎందుకు తీసుకున్నాడు? అసలు వద్దన్నవాడు మళ్ళీ ఎందుకు తాగాడు? (0:28:18)

YouTube Link: ఇక్కడ క్లిక్ చేసి వీడియో చూడండి

దైవజనులు Apostle. Ranjith Ophir గారి వివరణ: (06m 24s)

  • 📜 మొదటి అధ్యాయం – అపవిత్రత నివారణ: అక్కడ దానియేలు ఎందుకు వద్దన్నాడో కూడా అక్కడ తేటగా చెప్పబడింది. దానియేలు మొదటి అధ్యాయము 12వ వచనం.. భోజనమునకు శాఖ ధాన్యములను, పానమునకు నీళ్లను మీ దాసులమగు మాకు ఇప్పించి దయచేసి 10 దినముల వరకు మమ్మును పరీక్షింపుము. ఇది 10 రోజుల వరకు అయినటువంటి పరీక్ష కాలం అది. ఎందుకు అంటే వీళ్ళను చెరగా తీసుకొని పోబడ్డారు కదా, వీళ్ళు రాజుకు సేవ చేయాలి, రాజ అంతఃపురంలో ఉండాలి, రాజు దర్బారులో ఉండాలి. వాళ్ళకు ఉన్న టాలెంట్లను బట్టి వాళ్ళకి రకరకాల పనులు అప్పచెప్తారు. అయితే రాజ పరిచర్యలో, రాజు యొక్క సేవలో, రాజ భవనంలో ఉండవలసిన వీళ్ళు చాలా హెల్తీగా, ఆరోగ్యంగా, బలంగా ఉండాలి. ఈ సురోమంటూ నీరస పక్షుల్లాగా ఉండకూడదు. అందుచేత రాజుగారు ఆ దేశపు రాజ భోజనం వాళ్ళకి పెడతాడు.
  • 🥩 నిషేధించబడిన ఆహారం: అయితే ఆ దేశంలో రాజభోజనం అంటే ఏంటి? ధర్మశాస్త్రంలో దేవుడు వద్దని నిషేధించిన కొన్ని జంతువులు వాళ్ళు పెడతారు. పాతకాలము పర్షియన్ ఆహారము ఏంటంటే కుక్కను కూడా తిన్నారు వాళ్ళు, ఇప్పుడు కూడా కుక్కను చాలామంది తింటారు.. నాగాలాండ్ వాళ్ళు తింటారు, ఇండోనేషియా వాళ్ళు తింటారు. మరి అది తినకూడదు యూదుడు. ఉమ్ గనుక అటువంటివి ఈ కుక్క ఒకటి, పంది ఒకటి, కోతులు.. కోతులను తినేవాళ్ళు ఉన్నారు. అసలు తిననిది ఏమీ లేదు. గబ్బిలాలను తింటారు, అన్నిటిని తింటారు, తొండలను, బల్లులను, ఎలకలను, పాములను, కప్పలను.. మరి ఇవన్నీ యూదుడుగా తను తినకూడదు కదా! అయితే మేము అలాంటి ఆహార పదార్థాలు తీసుకొని మేము అపవిత్రులం కాలేమండి అని ఎనిమిదవ వచనంలో దానియేలు 1:8లో చెప్పాడు.
  • 🛡️ నపుంసకుల అధిపతి భయం: అప్పుడు ఆ నపుంసకుల అధిపతి ఏమన్నాడంటే.. “మీకు అన్నపానములను నియమించిన రాజు అగు నా యజమానునికి నేను భయపడుచున్నాను బాబు. మీరు చెప్పిన పాయింట్ బాగానే ఉంది కానీ రాజుగారు గుర్తొస్తే భయమేస్తుంది. మీకు మీరు మామూలుగా శాఖాహారం తింటే, మరి మిగతా వాళ్ళందరూ మంచి నాన్-వెజిటేరియన్ ఫుడ్ తింటే వాళ్ళు బాగా నిగనిగలాడుతూ ఉంటారు, మీరేమో నీరసంగా ఉంటారు. రాజుగారు నా తల తీయించేస్తారు, ఎందుకు వాళ్ళను నువ్వు తక్కువ చూశావు, సరిగా పోషించలేదు అని అంటాడు. నాకు భయం వేస్తుంది” అన్నాడు. అప్పుడు అన్నాడన్నమాట.. “సరే 10 రోజుల వరకు పరీక్షించండి. మాకు నలుగురికి మాత్రం ఒట్టి వెజిటేరియన్ ఫుడ్, శాఖ ధాన్యములు ఇప్పించండి. త్రాగడానికి ఎలాంటి పళ్ళ రసాలు వద్దు, ఓన్లీ వాటర్. ఒట్టి నీళ్లే తాగుతాము, కాయగూరలు తింటాం. 10 రోజుల లోపల వాళ్ళకు మాకు తేడా మీరు చూడండి” అన్నాడు.
  • దైవకృపతో తేజస్సు: అప్పుడు ఆ 10 రోజులు అయ్యాక పరీక్షిస్తే 13వ వచనంలో.. “పిమ్మట మా ముఖములను రాజు నియమించిన భోజనము భుజించు బాలుర ముఖములను చూచి నీకు తోచినట్టుగా నీ దాసులమైన మా యెడల జరిగింపుము” అన్నాడు. అందుకు అతడు ఈ విషయంలో వారి మాటకు సమ్మతించి పది దినముల వరకు వారిని పరీక్షించెను. 10 దినములైన పిమ్మట వారి ముఖములు రాజభోజనం భుజించు బాలురందరి ముఖముల కంటే సౌందర్యముగాను, కళగాను కనబడ్డాయి. అక్కడ ఆ సందర్భం అది. దేవుడు ఆశీర్వదించాలి గానీ దానికి మనకు ఆల్కహాలిక్ డ్రింక్స్ మనకు అవసరం లేదు.
  • 🍷 ద్రాక్షారసము మరియు ఆరోగ్యం: ఇకపోతే ద్రాక్షారసము అనేది దాని పెద్ద సబ్జెక్ట్ అది. ఇప్పటికీ కూడా ద్రాక్షారసం నేను తాగుతాను విచ్ ఈజ్ నాట్ ఆల్కహాలిక్.. ఫ్రెష్ గ్రేప్ జ్యూస్. ఫ్రెష్ గ్రేప్ జ్యూస్ ఈజ్ వెరీ గుడ్. ఈవెన్ అకార్డింగ్ టు ఆయుర్వేదిక్ సైన్స్.. ఆయుర్వేదము ద్వారా మనకు తెలుస్తుంది ఏంటంటే ద్రాక్షారసం మన లివర్ కు చాలా మంచిది, మన జీర్ణ శక్తిని పెంపొందిస్తుంది, రక్తవృద్ధి, రక్త శుద్ధి కలిగిస్తుంది. మరి ఈ పళ్ళ రసములన్నీ కుళ్ళేదాకా చేసి దాన్ని ఆల్కహాలిక్ గా చేసేదే బీరు, ఇటువంటివి ఉన్నాయి. రాజ మర్యాదలు, రాజ భోజనంలో భాగంగా ఒక లిమిట్ గా వాళ్ళు ఆయనకు సర్వ్ చేసి ఉంటారు. ఎప్పుడు మొదలు పెట్టాడు అంటే ఈ 10 దినములలో తెలిసిపోయింది.. వీళ్ళు అడిగింది వీళ్ళకి ఇద్దాము, రాజు నియమించింది అక్కర్లేదు, వాళ్ళ ఆరోగ్యాలు వాళ్ళ భక్తి మీద ఆధారపడి ఉన్నాయి అని అతను డిసైడ్ అయిపోయినాక దే ఫెల్ట్ ఫ్రీ అన్నమాట. అది విషయం. ఓకే.

Detailed English Translation:

❓ Question: Why did Daniel refuse the king’s wine in chapter 1 but later consume it in chapter 10? What was the reason behind this change? (0:28:18)

  • Chapter 1 – Purity during Exile: Apostle Ranjith Ophir explains that Daniel’s refusal was a matter of spiritual defilement. The Babylonian royal diet often included meats forbidden by Mosaic Law, such as dogs, pigs, bats, and monkeys. To remain holy, Daniel requested a ten-day test, consuming only vegetables and water. Despite the concerns of the official over the king’s servants, Daniel and his companions appeared more radiant and healthier than those eating the royal dainties. This proved that divine blessing, not rich food, sustains a believer’s health.
  • Chapter 10 – Context and Health: Regarding the later mention of wine, Apostle Ophir clarifies that it likely refers to fresh grape juice, which is praised even in Ayurveda for its liver benefits and blood purification qualities. The ‘wine’ used in the royal court after the trial period was likely permitted in a limited, non-intoxicating manner once it was established that their strength came from God.
  • Conclusion: The primary focus for Daniel was avoiding the ritual uncleanness associated with pagan offerings. Once he proved his faithfulness and the officials realized that his health was divinely maintained, he was granted freedom in his diet, using items like juice for health and social decorum without compromising his spiritual integrity.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

సంప్రదించండి

📞 Call 9000083219 💬 WhatsApp

షేర్ చేయండి

WhatsApp Facebook Telegram