266. ప్రశ్న : అయ్యగారు దేవుని రాకడ వచ్చేవరకు ఎవరము జీవించి ఉంటామో, తెలియదు కావున చిన్నపిల్లలను భక్తి జీవితంలో ఏ విధంగా నడపాలి. తల్లిదండ్రులు వారి పిల్లల భక్తి సాధనకు ఏవిధంగా కృషి చేయాలి. T.V., Mobile లలో ఎక్కువగా పాప దృశ్యాలు కనిపిస్తున్నాయి కదా చిన్నపిల్లలకు మీరేమైన సందేశం ఇస్తారా! మీరేమైనా చిట్కా / రహస్యం కనుక్కున్నారా?
(అపో. అద్దంకి రంజిత్ ఓఫీర్ గారు) జవాబు: పిల్లల పెంపకం అనేది అత్యంత క్లిష్టమైన ఒక ప్రక్రియ అది అంత ఈజీ కాదు. కోళ్లను, మేకలను పెంచొచ్చు వాటికి సమయానికి దాన వేస్తే సరిపోతుంది. కానీ మన ఇంట్లో ఉన్న పిల్లలు వాళ్లు దేవుని పోలికలో సృష్టింపబడిన చిన్న, చిన్న మానవ మూర్తులు వాళ్లు. గనుక వాళ్లను సాతాను తనవైపు మళ్లించుకోవాలని విశ్వప్రయత్నం చేస్తాడు. మనమేమో వాళ్లను దేవునిలో పెంచాలని ప్రయత్నం చేస్తుంటాము మీరేమైనా చిట్కా / […]
