206. ప్రశ్న : డిటెన్షన్ సెంటర్లో పెట్టడం వల్ల ముస్లింలు 28 మంది చనిపోయారు. అంతే కాకుండా రాజస్థాన్, గుజరాత్ ప్రాంతాల్లో దళితుల గుడిలోకి వచ్చి దళితులు, అనే నెపంతో వారిని కొట్టి కాళ్ళు వేళ్లు విరగొట్టారు చంపేసారు. ఈ విషయాల పట్ల ఏ విధంగా స్పందించాలి? ప్రజలు ఏ విధంగా ఉండాలి? మీరు ఏ విధమైన పిలుపునిస్తారు.
(అపో. అద్దంకి రంజిత్ ఓఫీర్ గారు) జవాబు: ఎవరైనా న్యాయం జరగాలి అన్నా, అన్యాయాన్ని ఆపాలి అన్నా, ఎదిరించాలన్నా, చాలా Direct గా చెప్తున్నాను. ఏమిటంటే యేసును ద్వేషించడం మానండి. అప్పుడు న్యాయము కొరకు ఎవరైనా పోరాడగలుగుతారు. అన్యాయాన్ని నశింపజేయ గలుగుతారు. అరికట్టగలుగుతారు. ఎందుకు ఈ మాట అంటున్నానో ఇప్పుడు చెప్తాను వినండి. ఏంటంటే ఇటీవల బి.జే.పి వాళ్ళు మీటింగు పెట్టి ఎస్.సి., ఎస్.టి. ముర్దాబాద్ అని నినాదాలు ఇవ్వడాన్ని మనం మీడియాలో చూశాం. మరి ఆ […]
