195. ప్రశ్న : భక్తుడి జీవితంలో తప్పులు జరిగితే అది దేవుడి ప్రణాళికలో భాగంగా జరుగుతాయా? (చిన్న Doubt) దావీదు మహారాజు ఊరియాను చంపేసి ఆయన భార్యతో పాపము చేసారు. అయితే 1 రాజులు 15:4 లో ప్రస్తావించినప్పుడు కచ్చితంగా దావీదు ఊరియా విషయంలోనే తప్పుచేసాడు అన్నట్లు ఉంటుంది. అందులో బత్సెబతో పాపాన్ని ఎందుకు ఎంచలేదు, దాని విషయంలో ఎందుకు కట్టుబడమని చెప్పారు. అలాగే 1 దినవృత్తాంతముల గ్రంథంలో సొలోమోను రాజు పుడతాడు అని చెప్పేసి దేవుడు ముందుగానే ప్రవచించడం జరిగింది. అయితే దేవుడి ఉద్దేశ్యం అది. సొలోమోను మహారాజు కచ్చితంగా బత్సెబకే పుడతాడు కాబట్టి మన దావీదు మహారాజు పాపం చేయడంలో దేవుని ప్రణాళికబద్ధమైన వ్యూహరచన ఏమైనా ఉందా? ఇది నా ప్రశ్న అండి.)
(అపో. అద్దంకి రంజిత్ ఓఫీర్ గారు) జవాబు: మీకు అభినందనలు చాలా మంచి ప్రశ్న అడిగారు ! అయితే నేను తప్పక సమాధానం చెబుతాను. మొట్టమొదటి విషయం ఏమిటంటే దావీదు, దేవుని చిత్తానుసారమైన మనసు గలవాడు. దేవుని మైండుకు దావీదు మైండు ట్యూన్ అయిపోయింది. అయితే దావీదుకు దేవుని మనసులో ఉన్నటువంటి ప్రకంపనలు, దేవుని మనస్సులో ఉండే మెంటల్ Waves అనేవి దావీదుకు కొంతవరకు స్పర్శలోకి, అతని యొక్క అనుభూతిలోకి వచ్చాయన్న మాట ఇక్కడ బత్సెబను దావీదు […]
