❓ ప్రశ్న: బైబిల్ ఉండగా సువార్త చెప్పడానికి వేదాలలోని ఉపమానాలను తీసుకోవాల్సిన అవసరం ఏముంది? ప్రతిసారి అలా చెప్పకుండా మనము వారికి సువార్తను, యేసును పరిచయం చేయలేమా? అందరినీ ముట్టుకొని ముట్టుకోవద్దు.. అది ఎందుకు మనకు? అది అవసరమే లేదు కదా! (0:49:33)
YouTube Link: ఇక్కడ క్లిక్ చేసి వీడియో చూడండి
దైవజనులు Apostle. Ranjith Ophir గారి వివరణ: (09m 16s)
- 📖 ప్రశ్నలోని ఈగో మరియు పదే పదే వివరణ: ఈ ప్రశ్నకు నేను అనుకుంటా వెయ్యోసారి సమాధానం చెప్తున్నాను అనుకుంటాను. చెప్పిన విషయమే వాళ్ళకు నచ్చుతున్నా, అది నిజమే అనిపిస్తున్నా సరే.. ఒప్పుకోవడానికి ఈగో అడ్డం వచ్చి మళ్ళీ మళ్ళీ అడుగుతున్నారు వాళ్ళు. ఇప్పుడు నేను క్లియర్ గా చెప్పాను.. బైబిల్ లో ఉన్న ఉపమానములు గాని, ఆధారములు గాని ఏమైనా తీసుకొని క్రీస్తును ప్రకటించడానికి మనకు ఎంతో సమాచారం ఉన్నది. వేదాలు ఎందుకు ముట్టుకోవాలి అని అంటున్న వాళ్లకు నేను ఎన్నో సార్లు సమాధానం చెప్పాను. సమాజంలో ఉన్న అపోహలను తొలగించడానికి, ప్రజల హృదయాల్లో ఉన్న ద్వేషాన్ని జయించడానికి మనం కొన్ని మార్గాలను అనుసరించాల్సి ఉంటుంది.
- 🛡️ ద్వేషం ఉన్న చోట సువార్త ఎలా చేరుతుంది?: అసలు బైబిల్ లో ఉన్న సమాచారము ఆధారంగా, బైబిల్ వచనాలు ఆధారంగా సువార్త చెబితే.. బైబిల్ అంటే ఇష్టం లేని వారు, బైబిల్ మీద ద్వేషం పెంచుకున్నవాడు ఎందుకు అంగీకరిస్తాడు? ఇది అంటరాని వాళ్ళ గ్రంథము, మాల మాదిగ వాళ్ళ అనబడి అస్పృశ్యుల గ్రంథము, బ్రిటిష్ వాళ్ళ గ్రంథము, మిలేచుల గ్రంథము.. ఇది నిన్న మొన్న వచ్చిన గ్రంథము, మన దగ్గర లక్షల కోట్ల సంవత్సరాల నుండి ఉన్నటువంటి సనాతన గ్రంథాలు ఉన్నాయి అని దీన్ని చూస్తూనే వారు అసహ్యించుకొని మనసు నిండా ద్వేషం నింపుకున్న తర్వాత.. సోదరుడా బైబిల్ గ్రంథం ఇలాగ చెప్పుకుంటున్నది అంటే వాని ప్రతిస్పందన ఎలా ఉంటది? వానికి అసహ్యమైన ఒక గ్రంథములో నుండి నువ్వు ఎలాగ ఒక సత్యాన్ని చెబుతావు? ఆ ద్వేషం ఉన్నంత కాలం వాక్యము వారి హృదయాల్లోనికి వెళ్ళదు.
- 🛤️ ఆలోచన రేకెత్తించే వ్యూహం: గనుక బైబిల్ అంటే ఏమాత్రము ఇష్టము లేనివాడు కూడా.. నా కొరకు దేవుడు నరావతారము ఎత్తి మరణించి లేచాడు అనే సత్యాన్ని వినాలి. అతని కొరకు దేవుడు మనిషిగా పుట్టి రక్తము కార్చి చనిపోయి మళ్ళీ లేచాడు అనే విషయం అతని చెవిని పడాలి. ఏ గ్రంథంలో నుండి చెబుతున్నామో ఆ గ్రంథం మీద అతనికి ద్వేషం ఉండకూడదు. ఎలాగైనా అతడు రక్షణ పొందాలనే బాధతో.. నీకు వేదం అంటే ఇష్టం కదా బాబు, బైబిల్ ఇష్టం లేదుగా పోనీ కానీ వేదం అంటే ఇష్టం కదా.. వేదము కూడా ఇలా చెప్పింది నువ్వు ఆలోచించు అని ఆలోచన రేకెత్తించడానికి ఆ బుక్ రాశాము. దేవుడు ప్రతి జాతికి, ప్రతి భాషా హృదయానికి ఒక సాక్ష్యాన్ని ఉంచాడు. ఆ సాక్ష్యాన్ని పట్టుకుని మనం క్రీస్తు దగ్గరకు వారిని నడిపించాలి.
- 📖 హైందవ క్రైస్తవం గ్రంథం యొక్క ఉద్దేశ్యం: బైబిల్ నమ్మిన వాళ్ళ కొరకు నేను ‘హైందవ క్రైస్తవం’ గ్రంథం రాయలేదు. మళ్ళీ స్పష్టంగా చెప్తున్నా.. బైబిల్ అంటే ఇష్టం లేని వాళ్ళ కొరకు, వేదము మాత్రమే ప్రామాణికం అనుకున్న వాళ్ళ కొరకు నేను రాసిన చాలా పొడవాటి ఒక సువార్త కరపత్రిక ‘హైందవ క్రైస్తవం’. మరి వాళ్ళని అడుగుతున్నాను.. బైబిల్ లో నుండి ఎంతో చెప్పొచ్చు కదా అంటే బైబిల్ లో నుండి చెప్పొచ్చు గానీ బైబిల్ అంటే వాడికి ఇష్టం లేదు. నువ్వు ఎలా చెప్తావు? అసలు చెప్పేస్తే వింటాడా అతడు? వినడు కదా! బైబిల్ అనగానే “షట్ అప్ అండ్ గెట్ అవుట్” అంటాడు లేకపోతే ఆయనే వెళ్ళిపోతాడు. అతని చెవిలో సువార్త ఎలా వేస్తావు?
- ✨ సువార్త భారము మరియు ప్రేమ: బైబిల్ అంటే ఇష్టం లేనోళ్ళకి యేసుని చూపించే బాధ్యత తీసుకున్నాను, అది నా ప్రేమ. ఏ విధం చేతనైనా కొంతమంది రక్షణ పొందాలి, సువార్త అయితే వినాలి. వాడు నమ్ముతాడు నమ్మడు వాడికి అది వేరే విషయం.. సువార్త అయితే వినాలి, అందుకొరకు ఆ పుస్తకం రాశాను. ఇప్పుడు బైబిల్ ఇష్టం లేనోళ్ళు మన దేశంలో వందల కోట్ల మంది ఉంటుండగా.. ప్రపంచంలో వందల కోట్లు 700 కోట్ల మంది ఉన్నారు.. మన దగ్గర అయితే 100 కోటి 130 కోట్లు మన దగ్గర. గనుక ఇన్ని కోట్ల మందికి బైబిల్ే ఇష్టం లేకుండా ఉండగా, బైబిల్ లో నుండి చెప్పమన్నవాడిని ఏమనాలి మరి? అది మీరే నిర్ణయించి చెప్తే సంతోషిస్తాను.
- 🛡️ ముగింపు: ఒక రోగికి మందు వేసేటప్పుడు వాడు ఇష్టపడే ఆహారంలో కలిపి ఇచ్చినట్టుగా.. బైబిల్ మీద ద్వేషం ఉన్న వారికి, వారి గ్రంథాలలోని సత్యాన్ని చూపిస్తూ యేసు వైపు మళ్ళించడం అనేది ఒక ఆత్మీయ వ్యూహం. ఇది కేవలం వేదాలలోని విషయాలు చెప్పడం కాదు, వేదాల సారాంశం ద్వారా క్రీస్తు అనే అమృతాన్ని వారికి అందించడం. ఆ సత్యాన్ని గ్రహించినప్పుడు వారు బైబిల్ ని కూడా గౌరవిస్తారు. ఏ మార్గమైనా సరే, చివరికి వారు నజరేయుడైన యేసు పాదాల దగ్గరకు రావాలి. అది నా ఆశయం. అది విషయం. ఓకే.
Detailed English Translation:
❓ Question: Why is it necessary to use Vedic analogies to preach the Gospel when the Bible is sufficient? Can’t we introduce Jesus without involving other scriptures? (0:49:33)
- Addressing the Root of Resistance: This is perhaps the thousandth time I am addressing this. Even when the logic is clear, personal ego often hinders people from accepting this approach. While the Bible is more than enough for those who believe, we must consider those who harbor intense hatred or prejudice against it.
- Preaching to the Prejudiced: Many people in our country view the Bible as a foreign book, a colonial tool, or a book belonging only to certain castes. This prejudice creates a wall. If you try to speak the truth using a source they despise, they will shut their ears. To reach their hearts, we must first break the wall of hatred.
- Provoking Thought through Familiarity: My objective is for everyone to hear that God took human form and died for their sins. If they love the Vedas but hate the Bible, I use the Vedas to provoke their thinking. I point out that their own revered scriptures speak of a universal sacrifice. This is the strategy behind ‘Haindava Kraistavam’—it is a bridge for those who wouldn’t otherwise walk toward the Bible.
- Conclusion: My love for the lost compels me to find ways to reach them. ‘Haindava Kraistavam’ isn’t for the converted but for those who consider the Vedas their only authority. We must present the Gospel in a way that is accessible and less offensive to their cultural sensibilities, with the ultimate goal of leading them to the feet of Jesus Christ. Whether they accept it or not is their choice, but the Gospel must be delivered effectively.
