❓ ప్రశ్న: “క్షీరసాగర మధనం” అనే పేరు ఈ కార్యక్రమానికి పెట్టడానికి గల కారణం ఏమిటి? దాని ఆధ్యాత్మిక అర్థం ఏమిటి? ఇందులో హాలాహలం, అమృతం దేనికి సూచనలు? (1:46:30)
YouTube Link: ఇక్కడ క్లిక్ చేసి వీడియో చూడండి
దైవజనులు Apostle. Ranjith Ophir గారి వివరణ: (12m 30s)
- 🥛 పురాణ నేపథ్యం మరియు ఆంతర్యం: థాంక్యూ సో మచ్. ఈ యొక్క కార్యక్రమానికి క్షీరసాగర మధనం అనే పేరు ఎందుకు పెట్టారని చాలామంది అడుగుతున్నారు. అసలు ఈ పేరు వెనుక ఉన్న మర్మం ఏంటో ఇప్పుడు వివరంగా చెబుతాను. పాలసముద్రము అనే దాన్ని చిలికినప్పుడు దాంట్లో నుంచి ఐరావతం వచ్చింది, లక్ష్మీదేవి వచ్చింది, ముందు హాలాహలం వచ్చింది, ఆ తర్వాత అమృతం వచ్చింది అనేది పురాణ కథ. పాలసముద్రాన్ని చిలికితే అమృతం వచ్చింది, అది తాగిన వాళ్లకు అమరత్వం సిద్ధిస్తుంది. ఇది ఒక యోగికార్థంలో ఆధ్యాత్మిక పాఠం చెబుతుంది. నా మటుకు నాకు బైబిల్ పేజీలో ఉన్నదే చరిత్ర, మిగతాదంతా కూడా యోగికార్థపు కథలు అని నేను నమ్ముతున్నాను. ఏదైనా సరే.. వారు ఆ పాలసముద్రాన్ని ఎందుకు చిలికారు అంటే అమృతం కొరకు చిలికారు. అమృతం కొరకు చిలికితే హాలాహలం వచ్చింది. అంటే అమృతం ఎక్కడి నుంచి వస్తుందో అక్కడి నుంచే హాలాహలం కూడా వస్తుంది.
- 📖 బైబిల్ – అసలైన పాలసముద్రం: దీన్ని నేను క్రైస్తవునిగా ఒక అన్వయింపు చెబుతున్నాను.. బైబిల్ ను, వాక్యమును దేవుడు పాలతో పోల్చాడు. “వాక్యమనే నిర్మలమైన పాలు” అని పేతురు పత్రికలో ఉంది. నీ ధర్మోపదేశము అపరిమితమైనది అని కీర్తనల గ్రంథం చెబుతోంది. గనుక అపరిమిత ధర్మోపదేశము అనగా అపారమైన పాలసముద్రముతో ఇది పోల్చడానికి అవకాశం ఉంది. అక్కడేమో పాలసముద్రంలో నుండి అమృతం వచ్చింది, హాలాహలం కూడా వచ్చింది. మరి బైబిల్ లో నుండి సత్యబోధ వస్తుంది.. కానీ బైబిల్ లోని వచనాలకు సరైన వ్యాఖ్యానం చెప్పకపోతే నరకానికి తీసుకువెళ్లే అసత్య బోధ కూడా వస్తుంది. బైబిల్ లోని వచనాలే ఎత్తిచూపి వ్యభిచారం పాపం కాదనో, తాగినా తప్పు లేదనో ఎవరైనా చెబితే అది పాలసముద్రంలో నుంచి వచ్చిన హాలాహలమే అవుతుంది. కాలకూట విషయమే అవుతుంది. బైబిల్ గ్రంథంలో నుండి మనల్ని పరలోకానికి చేర్చే సత్య బోధ పుడుతుంది.. అయితే జీవమై ఉన్న యేసును కనుమరుగు చేసే యెహోవా సాక్షుల బోధ కూడా పుట్టింది బైబిల్ నుంచి. సరైన వ్యాఖ్యానం చెబితేనేమో బైబిల్ లో నుండి అమృతం వస్తుంది, సరైన వ్యాఖ్యాన పద్ధతులు తెలియకుండా వ్యాఖ్యానిస్తే అదే బైబిల్ నుండి నరకానికి తీసుకెళ్లే బోధ కూడా వస్తుంది. సో బైబిల్ ఈజ్ ద రియల్ పాలసముద్రం.. నిజమైన పాల సముద్రం అని నా నమ్మకం.
- 🐍 కాలకూట విషం మరియు క్రీస్తు త్యాగం: పాలసముద్రం నుండి వచ్చిన ఆ గరళాన్ని, హాలాహలాన్ని శివుడు మింగేసి కంఠంలో పెట్టుకున్నాడని కథ చెబుతోంది. ఆయన మింగి ఉండకపోతే ఆ విషం సర్వ విశ్వాన్ని నాశనం చేసేది. మరి అది కూడా యేసుప్రభువుకు ఒక మంచి సూచన, మంచి ఒక ముంగురుతు. సర్వ విశ్వాన్ని దహించే పాపాన్ని, ఆ నిత్య చీకటిని, లూసిఫర్ చేసినటువంటి ఆ దుష్ట క్రియలన్నిటినీ యేసుప్రభువు వారు సిలువలో భరించి మనకు జీవాన్ని ఇచ్చారు. సిలువ యజ్ఞమే జరిగి ఉండకపోతే, యేసు ఆ హాలాహలాన్ని భరించకపోతే విశ్వమే నాశనం అయ్యేది అని మనం చెప్పుకోవచ్చు. ఈ విధంగా ఒక గ్రంథము కంటే ఈ గ్రంథము గొప్పది అని దూషించడం కంటే సమన్వయం చెప్పడం మంచిది. ఎంత సమన్వయం చెప్పినా చారిత్రిక సంఘటన మాత్రం ఒకటే.. అది కల్వరి కొండ మీద జరిగిన యేసు సిలువ యజ్ఞం.
- ✨ అమృతం – యేసుప్రభువు: అమృతం వచ్చిన తర్వాత ఆ పాలసముద్రాన్ని ఎవరూ పట్టుకోరు, అమృతం రావడమే అక్కడ పాయింట్.. అది ధ్యేయము, ఆశయము, లక్ష్యం. అలాగే క్రీస్తు ప్రభువు దొరకడమే అసలైన అమృతం. “నేనే జీవమును” అని చెప్పినవాడు దొరికిన తర్వాత ఈ గ్రంథాల యొక్క ఉద్దేశం నెరవేరింది, అయిపోయింది. ప్రతి మానవుడికి అన్ని గ్రంథాల సారాంశ బోధగా ప్రతి మానవుడికి యేసు అనే అమృతాన్ని తీసి అందించాలి అని మా ప్రయత్నం. యేసు కొరకే మా పోరాటం. బైబిల్ ఎందుకు కావాలంటే యేసు ఉన్నాడు గనుక ఇందులో.. నాకు జీవమైన యేసు దొరకకపోతే బైబిల్ కూడా నాకు ప్రయోజనం లేదు. అమృతం కొరకే పాలసముద్రం కావాలి.. యేసు దొరకడం కొరకు ఏ గ్రంథమైనా కావాలి. అన్ని గ్రంథాల్లోని పోలికలు యేసు అనే చారిత్రిక వ్యక్తి దగ్గరికి అందరినీ నడిపించాలి.. అది సువార్త. అది విషయం. ఓకే.
Detailed English Translation:
❓ Question: What is the significance of the title “Ksheerasagara Madhanam” (Churning of the Ocean of Milk) for this program? What spiritual lessons do the nectar and the poison convey? (1:46:30)
- Allegory and Spiritual Truth: Apostle Ranjith Ophir explains that he uses the ancient allegory of churning the ocean of milk to illustrate deep spiritual truths. While he views the Bible as historical fact and other accounts as symbolic, he draws a parallel: just as the ocean yielded both deadly poison (Halahala) and the nectar of immortality (Amrita), spiritual study can lead to either life or destruction depending on its focus.
- The Bible as the Ocean of Milk: Scripture is compared to milk in the Bible. The vastness of divine knowledge is the ‘Ocean of Milk.’ If interpreted correctly, it provides the ‘Amrita’—the truth of salvation. If misinterpreted, it can produce ‘Halahala’—false doctrines that lead to spiritual death. The goal of churning these scriptures is to extract the life-giving truth while identifying and discarding the poison.
- Christ and the Halahala: The story of a deity swallowing the poison to save the world serves as a profound type or shadow of Jesus Christ. The sins of the entire world were like a lethal poison threatening to destroy the universe. Jesus took this ‘Halahala’ upon Himself on the Cross, enduring the wrath and death that we deserved, thereby saving humanity.
- Conclusion: The ultimate goal of churning any scripture or spiritual thought is to find the ‘Amrita,’ which is Jesus Christ Himself. Once the Savior is found, the purpose of the quest is fulfilled. This program aims to churn the essence of various scriptures to present the nectar of salvation through Jesus Christ to all people.
