❓ ప్రశ్న: ఒక భక్తిపరుడు యాక్సిడెంట్‌లో అకస్మాత్తుగా మరణించాడంటే దానికి కారణం ఏమిటి? దేవునికి అంత భక్తిగా ఉంటే స్పాట్‌లో అలా చనిపోవడానికి కారణం ఏమిటి? (0:09:28)
YouTube Link: ఇక్కడ క్లిక్ చేసి వీడియో చూడండి
దైవజనులు Apostle. Ranjith Ophir గారి వివరణ: (01m 41s)
- ⏳ మరణం మరియు దైవ నిర్ణయం: అమ్మ, ఎవరు ఎప్పుడు చచ్చి మర్చిపోయినా మీరు ఏమనుకోవాలంటే ప్రసంగి గ్రంథము ఎనిమిదవ అధ్యాయము ఎనిమిదవ వచనాన్ని మనం ప్రామాణికంగా తీసుకోవాలి. “గాలి విసరకుండా చేయుటకు ఎవనికిని గాలి మీద అధికారము లేదు, ఒకని మరణ దినము ఎవ్వనికి వశము కాదు” అన్నాడు ప్రసంగి 8:8లో. ఒకని మరణ దినము ఎవనికి వశం కాదు. గనుక దేవుడు మనం తల్లి గర్భంలో ఉన్నప్పుడే మనం జీవించాల్సిన దినాలు ఒక్క దినమైనా జరగకముందే మన దినములన్నీ ఆయన గ్రంథంలో రాయబడ్డవట.
- 📜 విశ్వాసి అంతిమ స్థితి: గనుక అంత భక్తిపరుడి జీవితంలో ఆ మరణ దినం కూడా రాయబడి ఉంటుంది కదా దేవుని డైరీలో! కనుక ప్రభువు చిత్తము లేనిది ఒక తలవెంట్రుకైనా రాలేదు అన్నాడు, ప్రాణం ఎలా పోతుంది? గనుక మీరు జరిగిపోయిన దాన్ని బాధపడకుండా.. అతను రక్షించబడ్డాడా లేదా? ఎలా మరణించాడు, యాక్సిడెంట్ అయిందా, యవ్వనస్తుడుగానా అనేదంతా పక్కన పెట్టి, ఆయన కడవరి శ్వాస పీల్చి వదలక ముందు రక్షణ పొందాడు, మనకంతే చాలు. రక్షింపబడిపోయాడు గనుక ధన్యుడే. రక్షణ లేకుండా 90, వంద ఏళ్ళు బ్రతికినా వ్యర్థమే కదమ్మా! అది విషయం. ఓకే.
Detailed English Translation:
❓ Question: What is the reason for the sudden death of a devoted believer in an accident? (0:09:28)
- The Sovereignty of God over Death: Apostle Ranjith Ophir references Ecclesiastes 8:8, explaining that no human has authority over the day of their death. According to scripture, all our days are ordained and written in God’s book before we are even born.
- Salvation over Circumstances: The method of death—whether through an accident or old age—is less significant than the state of one’s soul. If a person has received salvation through Christ, they are considered blessed regardless of how they die. Living a long life without salvation is ultimately futile.
