❓ ప్రశ్న: యెహోషువ 20వ అధ్యాయం ప్రకారం నరహంతకుడికి, యాజకుడు చనిపోవడానికి గల సంబంధం ఏమిటి? ఇది మనకు ఏ ఆత్మీయ సత్యాన్ని బోధిస్తుంది? (0:37:06) 🏰⚖️🛡️
YouTube Link: ఇక్కడ క్లిక్ చేసి వీడియో చూడండి
దైవజనులు Apostle. Ranjith Ophir గారి వివరణ: (10m 53s) 🎙️🛡️
- 🧱 పొరపాటున హత్య: తెలియకయే పొరపాటున ఒకని చంపిన నరహంతకుడు పారిపోవడానికి ఆశ్రయ పురములను ఏర్పరచుకోవాలని దేవుడు చెప్పాడు. అంటే తెలియకుండా పొరపాటున ఎట్లా చంపుతాడు? చెట్టు నరుగుతున్నప్పుడు ఆ గొడ్డలి ఇనుప భాగం ఊడిపోయి ఎవరికో తలకు తగిలి వాడు చచ్చిపోతే, అది ప్రమాద వశాత్తు జరిగింది. అప్పుడు చనిపోయిన వాని బంధువులు ఆవేశంతో వీడిని కొట్టి చంపేసే అవకాశం ఉంది.
- 🏰 ఆశ్రయపురాలు: తీర్పు జరిగేదాకా ఇతడు బ్రతికు ఉండాలి అంటే, పరుగు పరుగున పోయి ఆరు ఆశ్రయపురాలలో తల దాచుకోవాలి. లోపలికి వెళ్లి వాడిని చంపడానికి ఎవరికీ అధికారం లేదు. వాడు అందులో ఉన్నంతవరకు సేఫ్. ఒకవేళ వాడు బయటకి వచ్చి ఉంటే అప్పుడు చంపారు అనుకోండి, అప్పుడు చంపిన వాడిది కేసు కాదు. లోపల ఉండాల్సిన బాధ్యత ఉంది.
- 🩸 యేసుక్రీస్తుకు సాదృశ్యం: ఈ ఆశ్రయపురం అనేది మన ప్రభువైన యేసుక్రీస్తుకు సాదృశ్యం. మనందరం కూడా తెలియకయే యేసుప్రభు వారి మరణానికి కారణమైన వాళ్ళమే. పేతురు కూడా అన్నాడు – “సహోదరులారా మీరును మీ అధికారులను తెలియక చేసితిరని నాకు తెలియును.. మీరు జీవాధిపతిని చంపితిరి.” మన పాపాల వల్లే ఆయన మరణించాడు.
- 🛡️ రక్షణ దుర్గము: ఇప్పుడు మనల్ని కాపాడే ఆశ్రయ దుర్గము కూడా యేసుప్రభువే. వాడు ఆశ్రయపురంలో దాక్కున్నట్టు మనం యేసు లోపలికి వెళ్లి దాక్కోవాలి. “క్రీస్తు యేసు నందు ఉన్నవానికి ఏ శిక్షా విధి లేదని” రోమా 8:1 లో చెప్పాడు. యేసులో ఉన్నవాడికి క్షేమం ఉంది.
- ⛓️ యాజకుని మరణం: ఆ ప్రధాన యాజకుడు మరణించేదాకా అక్కడ ఉండాలి, మరణించిన తర్వాత రావచ్చు. ఇక్కడ అన్వయింపులోకి వచ్చేసరికి ప్రధాన యాజకుడు యేసుప్రభువే. మన ప్రధాన యాజకుడు ఎప్పటికీ చచ్చిపోడు. “నేను మృతుడనైతేనే గాని ఇదిగో యుగ యుగములు సజీవుడనై ఉన్నాను” అన్నాడు. ఆయన చచ్చిపోడు గనుక నువ్వు ఎప్పటికీ యేసులోనే స్థిరంగా ఉండాలి, బయటికి వెళ్ళకూడదు అన్న పాయింట్ ఇది.
Detailed English Translation:
❓ Question: What is the significance of the High Priest’s death in relation to the manslayer in Joshua 20? 🏰⚖️🤔
- Unintentional Manslaughter: If someone killed another accidentally (like an axe head slipping), they could flee to a city of refuge to escape the ‘avenger of blood.’
- Christ as the City of Refuge: This is a type of Christ. We all caused Jesus’ death through our sins in ignorance. Christ is our fortress. Romans 8:1 says there’s no condemnation for those in Him.
- The High Priest’s Role: The manslayer was released only upon the High Priest’s death. But our High Priest, Jesus, lives forever. Therefore, we must never leave His refuge; we are called to stay in Him eternally.
