❓ ప్రశ్న: ఒంటరిగా ఉన్న స్త్రీ దేవుని పిలుపు మేరకు సంఘ స్థాపన లేదా పరిచర్య చేయవచ్చా? పౌలు రాసిన పత్రికలలోని నియమాలు దీనికి అడ్డంకా? (0:48:35) 👩💼📜🛡️
YouTube Link: ఇక్కడ క్లిక్ చేసి వీడియో చూడండి
దైవజనులు Apostle. Ranjith Ophir గారి వివరణ: (08m 43s) 🎙️🛡️
- 👩💼 నిరభ్యంతరంగా చేయొచ్చు: ఒంటరిగా ఉన్న స్త్రీలు సేవ చేసిన వాళ్ళు బోలెడు మంది ఉన్నారు. పెళ్లి కాలేదని గాని, విడాకులు అయిపోయినందుకు గాని లేక భర్త మరణించినందుకు గాని సేవ చేసిన వాళ్ళు ఉన్నారు. ఆ ఏమి అభ్యంతరము? మీరు స్త్రీ అయితే అభ్యంతరం ఏంటి? ఒంటరిగా ఉంటే అభ్యంతరం ఏంటి?
- 🛡️ జాగ్రత్తగా ఉండాలి: మీరు సేవ కొరకు అక్కడక్కడ ప్రయాణాలు చేసేటప్పుడు ఈ సొసైటీ నిండా మృగాల లాంటి మగోళ్ళు ఉన్నారు. ఒక ఇంకో ఇద్దరు ముగ్గురు సిస్టర్స్ ని ఏర్పాటు చేసుకొని, అనవసరంగా అర్ధరాత్రులు ఒంటరిగా సంచరించకుండా, ఒక టీం గా ఏర్పడి సువార్త చెప్పండి. ప్రార్థన బృందాలు ఏర్పాటు చేయండి.
- 📜 స్త్రీల సేవ – బైబిల్ సాక్ష్యం: ఆడవాళ్ళు ప్రవక్తలు ఉన్నారు. యోదియ, సుంటికే లాగా సువార్త పనిలో బహుగా ప్రయాసపడ్డ వాళ్ళు ఉన్నారు. ఆఖరికి రూఫు తల్లి పౌలుకే తల్లిగా ఎదిగింది. ఏ సంస్థ అయినా వర్ధిల్లిన సేవ అంతా కూడా స్త్రీలు సేవ చేసినందుకే వర్ధిల్లింది. కాపరిత్వం తప్ప మీరు అన్ని చేయొచ్చు.
- 🧱 నియమాలు: రొట్టె విరవడం, బాప్తిస్మాలు ఇవ్వడం, సంఘాలు నడిపించడం – ఈ బాధ్యతలు మాత్రం చేయడానికి స్త్రీకి అధికారం లేదని పౌలు రాశాడు. మీరు రొట్టె విరిచకూడదు కానీ రొట్టె విరిచే వాళ్ళు అనేకమందిని మీకు ఆత్మీయ కుమారులుగా దేవుడు ఇస్తాడు. సువార్త చెప్పుకోవచ్చు, వాక్యం చెప్పుకోవచ్చు, దేవుడు అద్భుతంగా వాడుకుంటాడు.
- 🏠 ముఖ్యమైన సలహా: మీరు చర్చే కట్టొద్దు, ఇల్లు కట్టుకోండి. ఆ ఇంట్లో ఒక హాల్ లాంటి దాంట్లో మీరు కూడుకోండి. ఇంటింటా రొట్టె విరిచి మొదటి శతాబ్దంలో జరిగినట్టు చేస్తే, ఎవడైనా వచ్చినా మా ఇల్లు సార్ అని చెప్పుకోవచ్చు. ఇక ఎవడేం మాట్లాడడు. అలాగే స్వస్థత ప్రార్థనలు చేయొచ్చు కానీ, హస్త నిక్షేపణ (సేవకులను నియమించడం) మాత్రం అపోస్తలులు చేయాలి.
Detailed English Translation:
❓ Question: Can a single woman start a church or lead a ministry according to God’s calling? 👩💼📜🤔
- Yes, You Can: Many single, widowed, or divorced women have served God. There’s no scriptural bar to serving Him as a woman.
- Safety First: Because society is dangerous, it’s better to work as a team. Don’t travel alone late at night.
- Scriptural Roles: Women like Euodia and Syntyche worked for the Gospel. History shows women are the backbone of most ministries.
- Pastoral Boundaries: Paul noted that administrative roles like being an Overseer, giving Baptism, or Holy Communion are reserved for men. You can preach and win souls, and God will give you spiritual sons to handle the pastoral duties.
- Strategy: Use the “house church” model to avoid legal trouble from fanatics. You can pray for the sick, but official ordination (laying of hands) should be done by Apostles.
