👤 ప్రశ్న: దైవజనులైన అద్దంకి రంజిత్ ఓఫిర్ గారిని ఒకే వ్యక్తిగా ఇన్ని విభిన్న కోణాల్లో (సేవకుడు, ప్రవక్త, రాజకీయ నాయకుడు) ఏ విధంగా అర్థం చేసుకోవాలి? (0:04:05)
YouTube Link: ఇక్కడ క్లిక్ చేసి వీడియో చూడండి
దైవజనులు Apostle. Ranjith Ophir గారి వివరణ: (3m 48s)
- 👤 నన్ను గూర్చిన అంచనా: నా మటుకు నేను యదార్ధంగా నమ్మేది ఏంటంటే – నన్ను గూర్చిన అంచనా నేను ఒక పాస్టర్ అని కొంతమంది, సామాజిక సంస్కర్తనని, రచయితలని, కవినని, గాయకుండని, ఇలాగా రాజకీయ నాయకుడు కూడా ఈ మధ్య నేను అలాగ పరిణామం చెందానని, తర్వాత అనాధలకు దిక్కులని, వారికి సహాయం చేస్తూ సేవ చేస్తున్నారని.. ఇలాగా నన్ను రకరకాలుగా మనుషులు రకరకాల కోణాలలో చూస్తున్నారు. కానీ నా మటుకు నన్ను గూర్చిన అంచన ఏంటంటే – నేను ఒక మంచి మనిషిగా ఉండడానికి ప్రయత్నం చేస్తున్నాను అంతే. ఐ వాంట్ టు బి ఏ గుడ్ పర్సన్ (I want to be a good person).
- 🇮🇳 బాధ్యత గల పౌరుడు: సమాజంలో భారతదేశ పౌరుడిని అయితే ఒక బాధ్యత గల పౌరుడ్ని కావాలి. ఒక క్రైస్తవుడిని అయితే ఒక క్రైస్తవుని నుండి దేవుడు ఏం ఆశిస్తున్నాడు, రక్షకుడైన యేసు ఏం ఆశిస్తున్నాడు ఆ ప్రకారంగా నేను ఉండాలి. ఐ వాంట్ టు శాటిస్‌ఫై క్రైస్ట్ అండ్ డూ మై డ్యూటీ టు ద సొసైటీ (I want to satisfy Christ and do my duty to the society). నా మనస్సాక్షిని బట్టి నేను ఏం చేసినా నేను చేశాను. కాబట్టి – యాజ్ ద నీడ్ అరైజెస్ రైజింగ్ టు ది అకేషన్ (As the need arises rising to the occasion) అంటారు. అంటే పరిస్థితులను బట్టి సిచువేషనల్ గా ఒక మనిషిగా మానవత్వాన్ని ప్రదర్శించడానికి ఏది అవసరమో అది నేను చేశాను.
- 🛡️ హక్కుల కొరకు పోరాటం: అందుచేత ఆ క్రమంలో భాగంగానే రాష్ట్రీయ క్రైస్తవ పరిషత్ (RKP) వచ్చింది. ఎందుకంటే క్రైస్తవుల మీద అన్యాయంగా దాడులు జరుగుతున్నాయి, చర్చిలు కూల్చివేస్తున్నారు, పాస్టర్లను చంపుతున్నారు, ఆ మరి క్రైస్తవ సన్యాసినులను మానభంగాలు చేస్తున్నారు. ఎక్కడ కూడా శిక్ష అనేది జరగడం లేదు. అందుచేత హక్కుల కొరకు పోరాడాలి అనే ఒక సందేశంతో, ప్రయత్నంతో, కార్యక్రమంతో ఆర్కేపి అనేది పెట్టారు.
- 🗳️ రాజకీయ ఆవశ్యకత: అలాగే రాజకీయ రంగం – రాజకీయ రంగంలో ఒక గ్యాప్, ఒక శూన్యం అనేది ఏర్పడింది. ముస్లిములైనా, హిందువులైనా ముందేదో భారతీయ పౌరుడిని. దేశం పట్ల కూడా నాకు బాధ్యత ఉన్నది. మరి అధికార యంత్రాంగం ప్రవర్తిస్తున్న విధానాన్ని ప్రశ్నించాలంటే ఒక రాజకీయ పార్టీగా ఉండి ప్రశ్నిస్తే ఆ వాయిస్ అనేది గుర్తించబడుతుంది. అందుచేత పార్టీ పెట్టాము. సో పార్టీ పెట్టడం అనేది అదేదో ఇల్లీగల్ యాక్టివిటీ కాదు, రాజ్యాంగబద్ధంగా మనకు ఉన్నటువంటి హక్కుల్లో అది ఒకటి. ప్రతి పౌరుడు పార్టీ పెట్టుకోవచ్చు.
- 💎 ముగింపు: అంచేత నేను పార్టీ పెట్టినా, ఆర్కేపి పెట్టినా, అనాధ శరణాలయం పెట్టినా, మరి ఇంకా ఏ కార్యక్రమాలు చేసినా నేను ఒక మనిషిని. నా మనస్సాక్షి నాకు ఉన్నది. అయ్యో ఇక్కడ తప్పు జరుగుతుంది, అన్యాయం జరుగుతుంది, మనవంతు కృషి అయితే ఏదో చేద్దాం, ఆ సిచువేషన్ లో మనం ఒక మంచిని నిలబెడదాం అనే ఉద్దేశంతో చేశారు. అయితే ఏ ప్రయత్నం చేసినా కొందరు వద్దంటూనే ఉన్నారు. పర్వాలేదు, అందరూ నన్ను మంచోడు అనాలి అనే ఉద్దేశంతో నేను పనులు చేయడం లేదు, నా మనస్సాక్షి అయినా సంతోషంగా ఉండాలనే ఉద్దేశంతో చేస్తున్నాను.
Detailed English Translation:
👤 Question: How should one perceive Apostle Addanki Ranjith Ophir, who functions in diverse roles as a servant of God, a Prophet, and a political leader?
- Self-Assessment: People perceive me in various roles—as a Pastor, a Social Reformer, an Author, a Poet, a Singer, and now even a Politician. However, my personal assessment is simple: I strive to be a good human being.
- Duty to Christ and Country: Whether as an Indian citizen or a Christian, I aim to fulfill the expectations God and society have of me. I believe in ‘rising to the occasion’ as needs arise. My actions are guided by my conscience and the situational necessity to uphold humanity.
- The Role of RKP and Politics: RKP was formed to defend the rights of Christians who face unjust attacks and persecution. Similarly, I entered politics to fill a vacuum and provide a voice for the voiceless. Forming a political party is a constitutional right, not an illegal act.
- Integrity Over Popularity: Whether through social service, advocacy, or politics, my goal is to stand for truth in every situation. I am not motivated by public approval but by the satisfaction of my conscience before God.
