⚖️ ప్రశ్న: వరంగల్‌లో తొమ్మిది నెలల పసిపాపపై జరిగిన అత్యాచారం మరియు హత్య ఉదంతంపై మీ స్పందన ఏమిటి? ఇలాంటి నేరాలకు ఎలాంటి శిక్షలు ఉండాలి? (0:08:04)
YouTube Link: ఇక్కడ క్లిక్ చేసి వీడియో చూడండి
దైవజనులు Apostle. Ranjith Ophir గారి వివరణ: (7m 06s)
- 👹 ఉన్మాద చర్య: అసలు మానభంగము అనేదే ఒక క్షమించకూడని నేరం. మానభంగం అనేది ఏ ఆడపిల్లకు కూడా ఎప్పుడు జరగకూడదు. ఒకసారి ఒక అమ్మాయికి మానభంగం జరిగితే ఆమె హృదయము, ఆమె శరీరము, ఆమె మనసు, ఆమె జీవితమే గాయపడుతుంది. గనుక మానభంగం అనేది జరిగితే చాలా కఠినమైన శిక్ష ఉండాలి. ఇప్పుడు వరంగల్ జిల్లాలో మీరు చెప్పింది మరీ విపరీతం అది. ఇట్ ఇస్ టోటల్లీ ఆన్ ఇన్సేన్ యాక్ట్ (It is totally an insane act) అంటే ఉన్మాద చర్య.
- 🚫 సాకులు వెతకలేము: ఏ విధంగా కూడా అది ఊహించడానికి కూడా వీలు కానటువంటి విషయం. ఇప్పుడు కొంతమంది రేపిస్టులను సమర్ధించేవాళ్ళు ఏమంటారంటే – ఆమె లో నెక్ బ్లౌజ్ వేసుకున్నది, శరీరాన్ని ప్రదర్శించింది, ఆమె అంగాంగ ప్రదర్శన చేసి మగవాళ్ళను రెచ్చగొట్టింది గనుక వాడు రెచ్చిపోయాడు, రేపులు జరగడానికి ఆడవాళ్ళ వస్త్రధారణ కూడా కారణం అని ఒక వాదన ఉన్నది. మరి ఆ పసిపాప ఏమి అంగాంగ ప్రదర్శన చేసింది? అసలు ప్రదర్శించడానికి అక్కడ స్త్రీ దేహమే లేదు. అది ఒక పరిపూర్ణంగా స్త్రీత్వం వచ్చింది కాదు, ప్యూబర్టీ రాలేదు, అసలు బొమ్మలాగా ప్రాణం ఉన్న బొమ్మ లాంటిది అంతే. ఆ పాప మీద కామం ఎలా వచ్చింది? వాడు ఎలాగ చేయగలిగాడు? అసలు వాడి దేహమైనా ఎలా తయారయింది ఆ పని కొరకు ఎలా సహకరించింది? ఇది టోటల్గా ఉన్మాద చర్య. దీనికి అసలు క్షమాపణ లేనే లేదు.
- ⚔️ శిక్షల ఆవశ్యకత: నేను ప్రజాబంధు పార్టీ పెట్టినప్పుడు మా పార్టీ మేనిఫెస్టోలోనే ప్రకటించాను – మానభంగ నేరస్తులకు మర్మాంగాలు ఖండించే శిక్షను మేము అధికారంలోకి వస్తే ముందు మేము పాస్ చేసే బిల్ అదే. మర్మాంగ ఖండనే ఈ మానభంగ నేరస్తులకు శిక్ష అని మేము ప్రకటించాము. ఆ మరి సౌదీ అరేబియాలో, మరి కొన్ని దేశాల్లో ఇటువంటి కఠినమైన శిక్షలు అమల్లో ఉన్నాయి. ఎవడికైనా అసలు ఆ తలంపు వస్తేనే వాడు వణకి చస్తాడు. దొంగతనం చేస్తే చెయ్యి నరికేసేయడము, మానభంగం చేస్తే మర్మాంగాలు ఖండించడం.. మళ్ళీ వాడికి లైఫే ఉండదు. ఒకడికి అలాంటి శిక్ష అమలు జరిగినప్పుడు మళ్ళీ ఇంకొకడు చేద్దామని అనుకోడు. చేయాలని తలంపు వచ్చినా వణుకు పుడుతుంది వాడికి. ఆ విధంగా ఇంకొక నేరస్తుడు తయారు కాకుండా భయపడేటట్టుగా శిక్షలు ఉండాలి.
- 📖 బైబిల్ సందేశం: బైబిల్ లో ఒక వాక్యము – ప్రసంగి గ్రంథం 8వ అధ్యాయం 11వ వచనంలో ఈ మాట ఉంటుంది – “దుష్క్రియకు తగిన శిక్ష శీఘ్రముగా కలగకపోవుట చూచి మనుషులు భయము విడిచి హృదయపూర్వకముగా దుష్క్రియలు చేయుదురు.” అంటే లాక్ ఆఫ్ ప్రాపర్ పనిష్మెంట్ (Lack of proper punishment), ఇన్ టైమ్ పనిష్మెంట్ రావడం అనేది జరగనప్పుడు ఇంకా నేర ప్రవృత్తి ఎక్కువైపోతుంది ప్రజల్లో, అంటే భయం అనేది పోతుంది. దుష్క్రియలు చేయడానికి మనుషుల్లో భయం పుట్టాలంటే శిక్షలు శీఘ్రంగా, తీవ్రంగా ఉండాలి.
- ⚖️ చట్టాల రివర్సల్: మన శిక్షా స్మృతి యొక్క స్పిరిట్ ఏంటంటే – “100 మంది నేరస్తులు తప్పించుకున్నా పర్వాలేదు కానీ ఒక్క నిరపరాధికి కూడా శిక్ష పడకూడదు” అనే సెంటిమెంట్ మన పెనల్ కోడ్ లో ఉంది. అందుకే వాడు ఆ తప్పు చేశాడా చేయలేదా అనేది డౌట్ ఫుల్ గా ఉన్నా కూడా బెనిఫిట్ ఆఫ్ డౌట్ కింద అతన్ని నిర్దోషిగా వదిలేస్తాం. కాబట్టి నేను అంటున్నాను ఆ సెంటిమెంట్ రివర్స్ చేయాలి – “100 మంది నిరపరాధులు శిక్షించబడ్డా పర్వాలేదు, ఒక్క దోషి కూడా శిక్ష తప్పించుకోకూడదు” అనే రివర్సల్ ఆఫ్ ది సెంటిమెంట్ మనం అమలు చేయాలి. అప్పుడు దోషులు కొత్త వాళ్ళు తయారు కాకుండా ఉంటారు. నా వ్యక్తిగత ఆలోచన విధానం, ప్రజాబంధు పార్టీ యొక్క పాలసీ అదే.
Detailed English Translation:
⚖️ Question: What is your response to the brutal rape and murder of a nine-month-old infant in Warangal? What kind of punishments should be given for such heinous crimes?
- An Insane Act: Rape is an unforgivable crime that shatters a woman’s soul, body, and life. The incident in Warangal is not just a crime; it is an act of absolute insanity. While some try to blame women’s clothing for such crimes, this case of a mere infant exposes the utter vileness of the criminal mind. A child is like a living doll; there is no justification for such depravity.
- Capital Punishment and Castration: My political party, India Praja Bandhu Party, has declared in its manifesto that we will propose a bill for the physical castration of rapists. In countries like Saudi Arabia, such harsh punishments deter criminals. One must tremble at the very thought of committing such an act.
- Biblical Perspective on Justice: Ecclesiastes 8:11 states that when a sentence for a crime is not quickly executed, people’s hearts are filled with schemes to do wrong. Justice must be swift and severe to instill fear in potential offenders.
- Reforming the Legal Spirit: Our current legal system operates on the principle that 100 guilty people may go free so that one innocent person isn’t punished. I believe this must be reversed to ensure that no guilty person escapes, even if it means higher scrutiny. Only strict deterrence can clean the society of such monsters.
