🛡️ ప్రశ్న: సమాజంలో దళితులపై జరుగుతున్న వివక్షకు శాశ్వత పరిష్కారం ఏమిటి? కుల వ్యవస్థ నిర్మూలనకు ఏ మార్గాలను మీరు ప్రతిపాదిస్తున్నారు? (0:15:10)
YouTube Link: ఇక్కడ క్లిక్ చేసి వీడియో చూడండి
దైవజనులు Apostle. Ranjith Ophir గారి వివరణ: (7m 54s)
- 🌍 జపాన్ మాదిరి మార్పు: రెండవ ప్రపంచ యుద్ధంలో జపాన్ మొత్తం బూడిద అయిపోయింది బికాజ్ ఆఫ్ ది ఆటమిక్ బాంబ్ అటాక్ బై అమెరికా (Because of the atomic bomb attack by America). మనకందరికీ చిన్న పిల్లలకు కూడా తెలుసు హిరోషిమా, నాగసాఖి అనే పట్టణాల మీద ఒక టెస్ట్ న్యూక్లియర్ వెపన్ ప్రయోగించారు అమెరికా. అయితే జపాన్ మళ్ళీ కోలుకోవడం అవకాశం లేదు కానీ కోలుకున్నారు. ఇప్పుడు అమెరికానే భయపెట్టగలిగేటంత అగ్రరాజ్యంగా జపాన్ మారింది. దానికి కారణం ఒకటి ఏంటంటే – జపాన్ లో కూడా కులాలు, వర్గాలు సామాజికంగా ఉండేవి అంతకుముందు. దేశం అంతా ఇప్పుడు బూడిద అయిపోయింది గనుక, నేలమట్టం అయింది గనుక, నేషన్ బిల్ట్ అప్ అగైన్ (Nation built up again), దేర్ మస్ట్ బి ఏన్ యాక్ట్ ఆఫ్ రీబిల్డింగ్ ద నేషన్ ఆఫ్ జపాన్ (There must be an act of rebuilding the nation of Japan), జపాన్ మస్ట్ బి రీబిల్ట్ (Japan must be rebuilt) అనే ఉద్దేశంతో అక్కడ ఈ ప్రభుత్వం ఏం చేసింది అంటే – నీ కులం ఏది, నీ వర్ణం ఏది, నీ వర్గం ఏది అని అడగడమే ఒక నేరంగా ప్రకటించారు. మీరు ఎవరంటే మేము జపనీయులం అండి. ఆ జపనీయులలో మీ వర్గం ఏది అని అడగకూడదు. జపాన్ లో ఉన్న వాళ్ళందరూ కూడా మనం ఒకటే అనుకోవాలి అనే పద్ధతిని అక్కడ అమలు చేశారు. ఆ తర్వాత ప్రతివారు కూడా హి ఈజ్ జపనీస్ టుగెదర్ విత్ మీ (He is Japanese together with me), సిటిజన్ ఆఫ్ జపాన్ (Citizen of Japan) అనుకున్నారు. ఇంకా కంట్రీ ఇంట్రెస్ట్ (Country interest) ముఖ్యం గాని, దేశ ప్రయోజనాలే ముఖ్యం గాని, ఇక నేను ఏ కులం వాడు, ఏ కులం అనేది ముఖ్యం కాదు.
- 🚫 కుల వ్యవస్థ – ఒక చీడ: అలాగే మన దేశంలో కూడా నేను నమ్ముతున్నది ఏంటంటే – ఈ కుల వ్యవస్థ పోవాలి. ఈ కుల వ్యవస్థ ఉన్నంతసేపు దేశం బాగుపడదు అనేది మాత్రం ఖాయం. అందుకే బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఏం చేశారంటే – ఈ కుల వ్యవస్థ అసలు చీడపురుగు దేశ అభివృద్ధికి ప్రధానమైన అవరోధము, ఆటంకం అని ఆయన స్వాతంత్రానికి పూర్వమే మను ధర్మశాస్త్రాన్ని పబ్లిక్ మీటింగ్ లో తగలపెట్టేసారు. అంటే మనుధర్మశాస్త్రము – అందులో మనుషులందరూ పుట్టుకతో సమానులు కాదు, పుట్టుకతోనే హెచ్చు తగ్గులు ఉంటాయి, క్యారెక్టర్ ను బట్టి కాదు వాడు ఒక ఫ్యామిలీలో పుట్టినందుకు ఉన్నతుడు, ఒక ఫ్యామిలీలో పుడితే నీచుడు అనేది మనువాదం. దీన్ని కాల్చేసేయాలి, తగలబెట్టేసేయాలి అనేది బాబాసాహెబ్ యొక్క ఉద్దేశం. దానికి మేము ఈ కుల వ్యవస్థ ఉన్నంతసేపు ఈ దళితుల మీద వివక్ష ఉంటుంది. కుల వ్యవస్థ అనేది మనుధర్మము లేక మనువాదము ప్రజల మనసులో ఉన్నంతసేపు ఈ దళితుల మీద వివక్ష కొనసాగుతుంది. అందుచేత మీరు ఎవరంటే – మేము ఇండియన్స్ అండి (We are Indians), మేము భారతీయులము అని చెప్పుకోవాలి తప్ప మేము రెడ్డి, కోమటి, బ్రాహ్మణ, మాల, మాదిగ, కమ్మ, కాపు, శెట్టి బలిజ, మేము బంజారా ట్రైబల్ అని చెప్పుకోవాల్సిన అవసరం రాకూడదు. ఆల్ ఇండియన్స్ ఆర్ ఈక్వల్ విత్ ఈక్వల్ రెస్పెక్ట్ అండ్ ఈక్వల్ స్టేటస్ అండ్ ఈక్వల్ అపార్చునిటీస్ టు డెవలప్ దేర్ ఓన్ లైఫ్ అండ్ దేర్ ఓన్ లివింగ్ కండిషన్స్ (All Indians are equal with equal respect and equal status and equal opportunities to develop their own life and their own living conditions).
- 📜 రెండు ప్రతిపాదనలు: దానికి మేము రెండు ప్రతిపాదిస్తున్నాం సార్. ఒకటి ఏంటంటే – అసలు ప్రభుత్వ అప్లికేషన్ ఫారం, దరఖాస్తు ఫారాలలో, రికార్డ్స్ లో ఎక్కడ కూడా కులము అనే దానిని అసలు ప్రస్తావించనేకూడదు. మీ కులం ఏదని గవర్నమెంట్ కూడా అడగొద్దు. ఏ భారతీయుడు ఇంకో భారతీయుడిని మీ కులం ఏదండి అని అడగకూడదు, అడిగేది పనిషబుల్ క్రైమ్ (Punishable crime) అని ఒక శాసనం చేయాలి. అలా చేస్తే – ఇప్పుడు కులాల వారీగా మరి మనం రిజర్వేషన్లు ఎంజాయ్ చేస్తున్నాం కదా, ఇప్పుడు నేను మాల, నేను మాదిగ, నేను ట్రైబల్, నేను బీసీ అని చెప్పుకోవాలి, చెప్పుకోకపోతే నాకు ఆ రిజర్వేషన్ రాదు కదా! మరి అప్పుడు ఎలాగ కులమే లేకుండా ఉంటే అది ప్రాక్టికల్ కాదు కదా అనే వాళ్ళు ఉంటారు. దానికి నేను చెప్పేది ఏంటంటే – అసలు కులాల బేసిస్ మీద, కుల ప్రాతిపదిక మీద రిజర్వేషన్లు ఎల్లకాలం కొనసాగాలని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారే భావించలేదు, కోరుకోలేదు. కొంతవరకే చేయండి ఈ లోపల ఈక్వాలిటీ (Equality) వచ్చేయాలి అని ఆయన ఆశించారు. గనుక ఇప్పుడు కులము అనే దాన్ని గవర్నమెంట్ అడగొద్దు, భారతీయ పౌరులు కూడా నా కులం ఫలానా అని చెప్పుకోవడానికి నిరాకరించాలి.
- 💰 ఆర్థిక ప్రాతిపదికన రిజర్వేషన్: మరి డెవలప్మెంట్ ఎలా జరుగుతుంది, ఈ రాయితీలు వీళ్ళకు ప్రోత్సాహకాలు ఎలా ఇస్తాము అని అంటే దానికి నా జవాబు – వాడి కులం ఏది అనేది చూడకుండా దారిద్ర రేఖకు దిగువ ఉన్నవాళ్ళు, బిలో ద పావర్టీ లైన్ (Below the poverty line), ఇంత కనీసం ఆదాయము వార్షిక ఆదాయం ఉన్నదానికంటే తక్కువ ఉన్న వాళ్లందరికీ ఏ కులమైనా ప్రభుత్వమే ఉచితంగా విద్య, వైద్యము, గృహ వసతి, కనీస అవసరాలు కల్పించాలి. అందులో ఆటోమేటిక్ గా దళితులు వాళ్ళు పేదలైతే వాళ్ళు బెనిఫిట్ పొందుతారు. బ్రాహ్మణులలో సో కాల్డ్ అగ్రవర్ణాలలో కూడా ఎవరైనా పేదలు ఉంటే వాళ్ళు కూడా లబ్ధి పొందుతారు. కనుక ఆర్థిక స్థితిగతులు ఎకానమిక్ కండిషన్స్ (Economic conditions) మీద ఆధారపడి అందరికీ మనము రాయితీలు ఇచ్చినప్పుడు, ప్రోత్సాహకాలు ఇచ్చినప్పుడు ఒకవేళ మనం సో కాల్డ్ నిమ్న కులాలు అనేవి ఒకళ్ళు ఉంటే వాళ్ళలో అధిక శాతం పేదలు ఉంటే ఆటోమేటిక్ గా వాళ్ళకి లబ్ధి కలుగుతుంది. అగ్రవర్ణాలు అనుకున్నోళ్ళు పేదలు ఉంటే వాళ్ళు లబ్ధి పొందుతారు. అప్పుడు అసలు కులం అనేదే పోతుంది, కాబట్టి కులం పేరు మీద వివక్ష అనేది ఇంకా ఉండదు అది సెకండ్ స్టెప్. కులం పేరు మీద ఐడెంటిటీ (Identity) ఉన్ననాడు వివక్ష వస్తది. కులం అనే ఐడెంటిటీ పోవాలి, ఇండియన్ అనే ఐడెంటిటీ ఉండాలి. అప్పుడు ఎవరు ఎవరిని వివక్ష చూపరు, చూపినా సరే అది పనిషబుల్ క్రైమ్ అయిపోతుంది.
Detailed English Translation:
🛡️ Question: What is the permanent solution to the discrimination faced by Dalits? What methods do you propose to eradicate the caste system?
- The Japanese Model: After WWII, Japan was completely devastated by nuclear attacks. To rebuild the nation, the government made it a law that no one should ask about another person’s caste or class. They prioritized being ‘Japanese’ over any sub-identity. Similarly, India can never truly progress as long as the caste system exists.
- Caste as a Pest: Dr. B.R. Ambedkar called the caste system a pest and an obstacle to the country’s development. He famously burnt the Manu Smriti because it justifies inequality by birth. To end discrimination, we must move beyond labels like Brahmin, Reddy, Mala, or Madiga and embrace a single identity: ‘Indian.’
- Policy of Non-Disclosure: I propose two steps. First, the government must remove the ‘caste’ column from all official forms and applications. Asking someone’s caste should be a punishable crime.
- Economic-Based Reservations: Instead of caste-based reservations, support should be provided based on the ‘Below Poverty Line’ (BPL) criteria. If the government provides free education, healthcare, and housing to everyone based on economic status, the marginalized sections (who are predominantly poor) will naturally benefit. This removes the ‘caste identity’ while still providing the necessary upliftment for those in need, regardless of their ancestral background. Discrimination ends when the caste identity is replaced by national identity.
