❓ ప్రశ్న: వైజాగ్ నుండి ఒక బ్రదర్ ప్రేమ్ రాజు గారు అని చెప్పేసి ఒక ప్రశ్న అడిగారు. వారు అడిగినటువంటి ప్రశ్న ఏమిటంటే – పరమగీతం ఆరవ అధ్యాయం ఎనిమిదవ వచనం.. ‘రాణులు అరువది మంది ఉపపత్నులు ఎనుబది మంది ఉన్నారు, కన్యకలు లెక్కలేనంత మంది ఉన్నారు’ అని ఉంది. దానిని ఎలా వ్యాఖ్యానిస్తారు? రాణులు అని ఉంది అంటే ఆల్రెడీ యేసుకు పెళ్లి అయిందా లేక భవిష్యత్తులో అవుతుందా? అలాగైతే యేసు ఏకపత్నీ పురుషుడు కాదన్న మాటేగా? అని అడుగుతా ఉన్నారు. (1:19:12)
YouTube Link: ఇక్కడ క్లిక్ చేసి వీడియో చూడండి
దైవజనులు Apostle. Ranjith Ophir గారి వివరణ: (10m 35s)
- 👑 పెళ్లి – ఒక ఛాయ: మంచి ప్రశ్న బ్రదర్. అసలు మొట్టమొదటి విషయం ఏమిటంటే ఏసుప్రభువు వారు పెళ్లి చేసుకోలేదు. మీరు అనుకున్నటువంటి పెళ్లి, నేను అనుకున్నటువంటి పెళ్లి, మనం చేసుకునే పెళ్లిళ్లు యేసు చేసుకోలేదు, చేసుకోడు కూడా. ఇప్పుడు భూమ్మీద మానవుల మధ్యలో జరిగే పెళ్లిళ్లు అన్నీ కూడా యేసు చేసుకునే పెళ్లికి సూచనలు, ఛాయారూపకములు, దృష్టాంతములు, సాదృశ్యములు. ఇక్కడ ఒక పురుషుడు ఒక స్త్రీ నిబంధన చేసుకుంటారు. “ఈరోజు మొదలుకొని మన ఇద్దరం జీవించినంత కాలం సర్వకాల సర్వావస్థల్లో నేను నీకు నమ్మకంగా భర్తగా ఉంటాను, నేను నీకు భార్యగా ఉంటాను” అని అలాగా వారు ప్రమాణాలు చేసుకుంటారు. దట్ ఈజ్ మ్యారేజ్ (That is marriage). ఇవన్నీ కూడా ఛాయ.
- ✨ అసలైన వివాహం: అసలు పెళ్లి ఇది కాదు. అసలు పెళ్లి ఏంటంటే – దేవుని కుమారుడైన ఆది సంభూతుడు, నాద శరీరుడు, వాక్య బ్రహ్మము, శబ్ద బ్రహ్మమైనటువంటి అదృశ్య దేవుని దృశ్య రూపమైనటువంటి యేసునాధుని పెళ్లి అసలైన పెళ్లి, జరగవలసిన పెళ్లి. ఆయన పెళ్లి చేసుకునేది ఎవరిని అంటే ఒక మనిషిని కాదు, కోట్లాది భక్తుల సమూహమును ఉపమాన రీతిగా ఆయన పెళ్లి చేసుకుంటాడు. శారీరక సంపర్కము కొరకు కాదు, ఆత్మ సంబంధమైనటువంటి అనుబంధము కొరకు. ఈ భక్త సమాజం అంతా కలిసి ఒక భార్యగా, ఒక స్త్రీమూర్తిగా పోల్చబడింది. పెళ్లి చేసుకున్న తర్వాత పురుషుడు తన భార్య పట్ల ఎలాంటి బాధ్యత కలిగి పోషణ, ఆలనా పాలనా చూసుకుంటాడో.. అలాగే వధువు సంఘము, ఈ భూమి మీద ఎత్తబడే భక్త సమాజమును ఎత్తబడిన తర్వాత పరలోక దర్బారులో ఒక నిబంధన చేసుకొని, మిగిలినటువంటి కాలమంతా నిత్యత్వం అంతా అంతము లేని కాలం యేసు చూసుకుంటాడు అనే పాయింట్.
- 🌌 విశ్వ ప్రేమ కథ: అయితే ఈ సంఘము ఎక్కడి నుంచి వచ్చింది అంటే ఆదాము కుటుంబంలో రక్షణ పొందిన వాళ్లే ఈ వధువు సంఘం. మరి ఆదాము పుట్టకముందు, ఆదామును ఏ మట్టితో చేశాడో ఆ మట్టి ముద్ద పుట్టకముందు, భూగ్రహము పుట్టకముందు విశ్వం ఉన్నది, బ్రహ్మాండం ఉన్నది, కోటానుకోట్ల ప్రపంచాలు ఉన్నాయి. మరి అక్కడ జరిగిన చరిత్ర ఏంటి? అక్కడ కూడా ఈ ఆదిసంభూతుని, యేసునాధున్నే ఆరాధించే భక్త సమాజాలు ఉన్నాయి. యేసుని పెళ్లి చేసుకోవాలని ఆరాటపడే కన్యకలు లేక భక్త సమాజాలు విశ్వంలో కోట్ల కోట్ల కోట్ల కొలది ఉన్నాయి. వాళ్ళ చరిత్ర ఏంటో మనకు తెలియదు, మొత్తం మీద ఒక భక్త సమాజం భూమిమీద క్రీస్తు సంఘం ఉన్నట్లుగానే ఒక భక్త సమాజం ఏర్పాటయింది. యేసుని పెళ్లి చేసుకోవాలని వాళ్ళు ఆశపడ్డారు.
- 💍 భూలోక సంఘం – పట్టపురాణి: కానీ వాళ్ళందరినీ వదిలేసి, అందరికీ ఆఖరున పుట్టినటువంటి భూలోక సంఘ కన్యకనే యేసు ఇష్టపడి పెళ్లి చేసుకుంటాడు. ఇది ఈ విశ్వంలో ఉన్నటువంటి విశ్వ ప్రేమ కథ, విశ్వనాధుని ప్రేమ చరిత్ర కథ. ఈ భూమి మీద ఉన్న భక్త సమాజం ఒక భార్య, ఆమె పట్టమహిషి, పట్టపురాణి. మిగతా వాళ్ళు.. మరి ఈ భూమే పుట్టక ముందు నుండి ఆరాధిస్తున్నటువంటి వాళ్ళు ఉన్నారు, వాళ్ళని ఏమన్నారంటే – వాళ్ళు కూడా నిజమైన దేవుని ఆరాధించారు గనుక పతివ్రతా ధర్మమును అనుసరించారు అని బైబిల్ లో చెప్పబడింది. సామెతల గ్రంథము 31వ అధ్యాయము 29వ వచనం చూడండి – “చాలామంది కుమార్తెలు పతివ్రతా ధర్మమును అనుసరించి ఉన్నారు గానీ నీవు వారందరినీ మించిన దానివ అని ఆమె పెనిమిటి ఆమెను పొగడును.” చాలామంది కూడా పతివ్రతా ధర్మముని అనుసరించారట, అంటే ఇతర లోకాలలో ఉన్న భక్త సమాజములన్నీ కూడా ఈ నిజమైన దేవుని రక్షకుడిని మాత్రమే ఆరాధించాయి. అది పతివ్రతా ధర్మం. కానీ వాళ్ళందరినీ మించినది భూలోక సంఘ కన్యక అని ఆ పెనిమిటి పొగుడుతున్నాడు.
- 🧱 ఉపపత్నులు అంటే ఎవరు?: పరలోక రాజ దర్బారులో యేసుప్రభువు వారు భూలోక సంఘానికి తన సింహాసనంలో సగభాగం ఇచ్చి అర్ధనారీశ్వరుడుగా రూపొందిన తర్వాత.. మిగతా భక్త సమాజాలు అడుగుతారు – “మరి మాకు అన్యాయం చేస్తావా? నిన్ను మేము యుగ యుగాలుగా ఆరాధిస్తున్నాము కదా” అని. అప్పుడు ఆయన – “మిమ్మల్ని కూడా నేను నా భార్య స్థానంలోనే ఆలనాపాలనా చూసుకుంటాను. మీ ద్వారా కూడా నా చిత్తం నెరవేర్చుకుంటాను. రాబోయేది కూడా అనంతమైన కాలము, నాకు అనంతమైన ప్రణాళికలు ఉన్నాయి. నా భార్య స్థానములో నాకు సహకరించవలసిన వాళ్ళు కోట్లమంది కూడా నాకు అవసరమే. ఆ విశ్వం విస్తరిస్తూ పోతుంది, దైవ కుటుంబం కూడా అనంతంగా విస్తరిస్తూనే పోతుంది. పట్టపురాణి పదవి మాత్రం మీకు రాదు, పట్టపురాణి పదవి మీకు రాదు. మీకు మాత్రము మహారాజు గారి యొక్క భార్య అనే గౌరవం విశ్వమంతటా దక్కుతుంది.” అది ఉపపత్ని అంటే. పట్టపురాణి కాకుండా ఉన్నటువంటి పత్ని ఆమె. వాళ్ళకు భర్తగా మాత్రం యేసునాధుడు ఒక్కడే ఉంటాడు. యేసునాధునికి మాత్రం అనేక భక్త సమాజములు అనే ఛాయిస్ (Choice) ఉంది గానీ, వాళ్ళకు అనేకమంది పెనిమిట్లు అనే ఛాయిస్ ఉండదు.
- 🛡️ ముగింపు: ఆధ్యాత్మికంగా మాత్రం ఒక భార్య భర్తకు లోబడినట్లు ఆయనకు లోబడి ఆయన చిత్తము నెరవేర్చాలని సమర్పించుకున్నటువంటి సుందరమైన భక్త సమాజాలు కోకొల్లలుగా విశ్వంలో ఉన్నాయి. ఆయనకు యౌగికార్థంలో ఎన్ని కోట్ల మంది భార్యలు ఉన్నా నష్టం లేదు, అది పాపం కాదు. ఇందులో శారీరక సంబంధం ఏమీ ఉండదు గనుక దీన్ని అపవిత్రంగా ఎవరు ఊహించుకోవద్దు. ఈ లోక సంబంధమైనటువంటి సంపర్కము గాని, వివాహ నిబంధన గాని ఆ పైన ఉండే పవిత్రమైనటువంటి బంధానికి ఇది ఒక ఛాయ మాత్రమే కానీ అక్కడ ఇలాంటి కార్యక్రమాలు ఉండవు అనే సంగతి అందరూ స్పష్టంగా తెలుసుకోవాలి. ఓకే సార్.
Detailed English Translation:
❓ Question: Isaac Prem Raju from Vizag asks about Song of Solomon 6:8, where ‘queens and concubines’ (upapathnulu) are mentioned. Does this mean Jesus is already married or will be? If He has multiple queens and concubines, does it mean He is not a monogamous husband?
- Marriage as a Shadow: Earthly marriage is merely a shadow or a symbolic representation of the ultimate union. Jesus did not, and will not, marry in the physical sense. The true ‘Marriage of the Lamb’ is a spiritual union between the Eternal Word (Jesus) and His collective body of believers. Our earthly ceremonies are just parallels to this divine reality.
- The Cosmic Bridegroom: Before the creation of Adam and the Earth, the universe already existed with billions of galaxies. Throughout the cosmos, there were and are ‘faith communities’ or ‘heavenly beings’ who have worshiped and loved the Eternal Christ for eons, desiring a union with Him. This is the grand Love Story of the Universe.
- The Earthly Church – The Chosen Queen: Out of all these countless cosmic entities and ancient communities, Jesus chose the ‘Earthly Church’—the redeemed humans from Adam’s race—to be His primary Bride, the Queen Consort (Pattapurannee). Proverbs 31:29 refers to this: “Many women do noble things, but you surpass them all.” While other cosmic beings followed ‘womanly virtue’ (faithfulness to God), the Earthly Church is uniquely elevated above all others.
- Queens and Concubines Explained: In the heavenly court, the Earthly Church shares the throne with Christ. The ‘concubines’ mentioned are the other faithful cosmic communities from other worlds. They fulfill His divine plans and receive His love, but the specific title of ‘Queen Consort’ belongs exclusively to the Church.
- A Spiritual Relationship: This is a purely spiritual bond. In the celestial kingdom, there is no physical lust or polygamy as humans understand it. Christ is the head and husband of all redeemed communities, and their devotion to Him is their absolute faithfulness. This spiritual rank allows Christ to have multiple ‘bride-communities’ without any ethical violation, as the relationship is rooted in divine governance and eternal love.
