❓ ప్రశ్న: అసలు ఈ దయ్యాలు పట్టడము అంటే ఏంటి? ఈ దయ్యాలు పట్టడము అంటే ఏంటి? పట్టాయి అంటారు, పట్టిన వాళ్ళను గుర్తించడం ఎట్లా? పట్టలేదు అనే సంగతి ఎలా తెలుస్తుంది? అవి మనుషులను ఎలా ఆవహిస్తాయి? దీనిపై క్లారిటీ ఇవ్వగలరు. (1:31:00)
YouTube Link: ఇక్కడ క్లిక్ చేసి వీడియో చూడండి
దైవజనులు Apostle. Ranjith Ophir గారి వివరణ: (14m 00s)
- 🧠 ఆత్మరూపులైన శక్తులు: ఈ పడిపోయిన దేవదూతలు ఆత్మరూపులు గనుక వాళ్ళు ఈ మానవులను తమ ఆధీనంలోకి తెచ్చుకోవడానికి వాళ్ళు రెండు విధాలుగా ప్రయత్నం చేస్తారు, కార్యాలు చేస్తారు. ఒకటి ఏంటంటే – పక్కనే నిలబడి మైండ్ కంట్రోల్ (Mind control) చేయడం.
- 🎮 పద్ధతి 1: మైండ్ కంట్రోల్ (Mind Control): ఈవెన్ (Even) మనుషులలో కూడా హిప్నాటిజం (Hypnotism) నేర్చుకున్న వాళ్ళు మనుషుల మైండ్ మీద కంట్రోల్ తీసుకొని, కళ్ళల్లో కళ్ళు పెట్టి డీప్ గా చూసి చూసి కొన్ని సజెషన్స్ (Suggestions) ఇచ్చి, అవతల వాడిని హిప్నటైజ్ (Hypnotize) చేసి ఇతను చెప్పింది చెప్పినట్టు అతడు మారు మాట్లాడకుండా చేసేటటువంటి బానిసగా చేసుకుంటాడు మెంటల్ పవర్స్ (Mental powers) తో. ఓకే, మరి మనిషికి అంత శక్తి ఉన్నప్పుడు ఈ పడిపోయిన దేవదూతలకి ఎంత శక్తి ఉంది! వాళ్ళు మైండ్ కంట్రోల్ చేస్తారు. లోపలికి ఏమీ రారు, బయటే ఉండి వాళ్ళు మైండ్ కంట్రోల్ చేస్తా ఉంటారున్నమాట. తమ మెంటల్ ఫ్రీక్వెన్సీస్ (Mental frequencies) చాలా పవర్ఫుల్ (Powerful) శక్తులు గనుక, మన మానసిక తరంగాలను వాళ్ళ ఆధీనంలోకి తీసుకొని వాడు ఏ పని చేయాలనుకున్నాడో అది మనం చేసేటట్టు, ఆ కోరిక మనలో పుట్టేటట్టుగా వాడు చేసే మానసిక కసరత్తు అనేది ఒకటి ఉంది.
- 👤 వ్యక్తిత్వం మరియు నిరోధం: వాడు బయట ఉండి స్వాధీన పరుచుకుంటున్నప్పుడు సొంత వ్యక్తిత్వం మనిషికి ఉంటుంది. అట్ ఎనీ స్టేజ్ (At any stage) వీడిని ‘గెట్ అవుట్’ (Get out) అని వాడు చెప్పగలిగే అవకాశం ఉంటుంది. వెళ్ళిపోరా నువ్వు నాతో మాట్లాడొద్దు, నాలోనికి నీ తలంపులు తీసుకురావద్దు, యేసు నామంలో గద్దిస్తున్నాను వెళ్ళిపోమంటే వాడు వెళ్ళిపోతాడు. వాడు బయట ఉన్నాడు కదా, వాడి థాట్స్ (Thoughts) ను వీడు స్వీకరించకుండా ఎదురు తిరిగితే వాడు వెళ్ళిపోతాడు.
- 🏚️ పద్ధతి 2: ఆవాహన (Possession): రెండవది – ఆవాహన అంటే ఆవహించడం. అంటే ఈ శరీరం లోపలికి వాడు వచ్చేస్తాడు. ఒక ఇంట్లోకి మనిషి ప్రవేశించినట్టు మనిషి లోపలికి ఈ ఆత్మ ప్రవేశిస్తుంది. మనిషి లోపల ఒక ఆత్మ ఉండనే ఉన్నది, మానవాత్మ. ఇంకో ఎక్స్ట్రా మెంబర్ (Extra member) వస్తాడు లోపలికి. వచ్చేసరికి మానవాత్మ బలహీనమైంది, ఇప్పుడు వచ్చిన ఆత్మ చాలా బలమైంది. గనుక ఆ కొత్త ఆత్మ, పడిపోయిన దేవదూత వాడు రాగానే మానవాత్మను పీక పిసికేసి బంధించేసి పెడతాడు. ఇక ఈ శరీరము వాడిదైనట్టుగా వాడు వాడుకుంటాడు. ఇది ఆవాహనం, దయ్యం పట్టడం అంటే ఇది.
- 🚫 వ్యక్తిత్వం కోల్పోవడం: ఆవహించినప్పుడు ఏమవుతుందంటే ఈ మనిషి తన సొంత వ్యక్తిత్వాన్ని (Individuality) మొత్తం కోల్పోతాడు. బయటే ఉండి థాట్స్ ని కంట్రోల్ చేసే దశలో ఈ మనిషికి సొంత వ్యక్తిత్వం ఇంకా ఉంటుంది గానీ, వాడు లోపలికి వచ్చాక సొంత వ్యక్తిత్వం ఉండదు. ఇక శరీరము వాడి సొత్తు అయిపోతుంది, వాడు ఎలాగైనా దీన్ని వాడుకుంటాడు. అలాంటప్పుడు సాధారణ మానవులలాగా కాకుండా వీళ్ళు కొన్ని విపరీతమైన కార్యాలు చేస్తారు. మనం అసహ్యించుకునే పనులు చేస్తారు – మలాన్ని తింటారు, మూత్రాన్ని తాగుతారు లేకపోతే మరీ చెడ్డ పనులు చేస్తారు. ఇవన్నీ ఏంటంటే మానవ ఇండివిడ్యువాలిటీని వాడు పోగొట్టుకున్నాడు, లోపల ఇంకెవడు వచ్చి కూర్చున్నాడు. వీడు ఏం చేస్తున్నాడో వీడికి తెలియదు. అలాంటప్పుడు ఈ లోపల ఉన్నవాడిని వెళ్లగొట్టాలి. వెళ్లగొట్టినప్పుడు వీడికి మళ్ళీ సొంత వ్యక్తిత్వం వస్తుంది.
- 🎭 అంధకార రాజ్యపు నాటకాలు: ఇప్పుడు ఇంకొక్క విషయం చెప్తాను – సృష్టికర్త మీద తిరుగుబాటు చేసే పడిపోయిన దేవదూతలు, దురాత్మలు ఒక మనిషి లోపలికి ఆవాహన చేసి దూరినప్పుడు ఆ సృష్టికర్త నామములో వీడిని వెళ్లగొట్టడం అనేది ఒక ప్రక్రియ. ఇప్పుడు ఇలాంటి డ్రామా (Drama) ఒకటి అంధకార రాజ్యం లోపలే జరుగుతుంది. దయ్యాలే పది మంది కలిసి ఒక స్కెచ్ (Sketch) గీసుకుంటారు – “ఇదిగో నువ్వు ఆ మనిషిలో దూరు, దూరి వాడితో విపరీతమైన ప్రవర్తన ప్రవర్తించేలాగా చెయ్, వాడితో విపరీతమైన పనులు చేయించు. నేను ఇంకొకరిలో దూరి ఏదో కొన్ని మంత్రాలు పలికించినట్టు పలికించి వెళ్ళిపోమని చెప్తా, అప్పుడు నువ్వు వెళ్ళిపో”. ఇదంతా వాళ్ళ ఆట, దాగుడు మూతల ఆట. “నువ్వు కొట్టినట్టు చెయ్ నేను ఏడిచినట్టు చేస్తా” అన్నట్టు.. నువ్వు అట్లా ఊరికే వెళ్లి దూరు నేను వెళ్లగొడతా వెళ్ళిపో. అప్పుడు చూసే ప్రజలకు ఈ మాంత్రికుడి మీద నమ్మకం కలుగుతుంది. “హో! ఈ మంత్రంలో గొప్ప శక్తి ఉందని” అందరూ అనుకుంటారు. ఇంత శక్తి ఉన్నప్పుడు మనకు ఆది సంభూతులు ఎందుకురా, యజ్ఞం ఎందుకురా అని.. ఏదో ఒక రూపేణా వీడు యేసు దగ్గరికి రాకుండా అడ్డగించాలి.
- ✨ ముగింపు: ఈ కోట్ల మంది పడిపోయిన దేవదూతలు ఇలాంటి డ్రామాలు ఎన్నో చేసి ప్రజలు యేసు దగ్గరికి రాకుండా చేస్తున్నారు. కానీ ఆఖరి మాట చెబుతున్నాను – ఎన్ని నాటకాలు ఆడినా, వేదములు చదివి వేదములో ఉన్నటువంటి లక్షణాలు కలిగిన విరాట్ పురుషుడు నాకు కావాలి అనే స్థిర తీర్మానానికి అందరూ రాగలిగితే.. కచ్చితంగా వారు సూనర్ ఆర్ లేటర్ (Sooner or later) యేసు దగ్గరికి వస్తారు, నమ్మి బాప్తిస్మం పొంది తీరుతారు.
Detailed English Translation:
❓ Question: What is demonic possession? How do spirits inhabit humans, and how can we differentiate between possession and non-possession? What is the actual mechanism of a spirit taking control of a person?
- Spiritual Manipulation vs. Possession: Fallen angels operate in two distinct ways. The first is ‘Mind Control.’ Just as human hypnotists use mental focus and suggestions to command another person’s actions, demons use powerful mental frequencies. They don’t enter the body; they influence the human mind from the outside, planting desires and thoughts that the person might mistake for their own.
- The Power of Choice: In the mind-control stage, the individual still retains their individuality and free will. They can resist the influence at any moment by rejecting those thoughts in the name of Jesus. If the person refuses to accept the demonic suggestion, the spirit must flee.
- Aavaahana (Actual Possession): Possession is the second mode. It occurs when the external spirit literally enters the human body, much like a person moving into a house. A human already has a soul, but when a more powerful demonic spirit enters, it suppresses the human soul, effectively ‘shackling’ the person’s will. The body then becomes the demon’s tool.
- Loss of Self: Once possessed, the person loses their individuality. They may exhibit vile or erratic behaviors—such as consuming filth or committing acts of extreme depravity—because the human being is no longer in control of their own limbs or speech. The person often has no recollection of these actions once the spirit is cast out.
- Deceptive Exorcisms: In the kingdom of darkness, demons often stage fake ‘deliverances.’ One demon possesses a person and acts out violently, while another influences a sorcerer to perform rituals. By ‘leaving’ on command, they give the sorcerer false credibility. This is a strategic ‘drama’ played by fallen spirits to keep people trapped in superstition and away from the true Savior.
- The Ultimate Liberation: While spiritual drama abounds, the only permanent solution is found in the ‘Virat Purusha’—the Promised One described in ancient Vedas who fulfilled all righteousness. When an individual seeks this absolute Truth, they eventually find their way to Jesus Christ, where true spiritual freedom resides.
