38.Q: Why Few People Attend Your Church Despite Great Truth? (KSM 03) ⛪

❓ ప్రశ్న: సార్ చుట్టుపక్కల సేవకుల సంఘానికి విశ్వాసులు లక్షలకు ఎక్కువగా వెళ్తున్నారు సార్, అయితే మీరు అంత గొప్ప ప్రవక్త కదా సార్ మరి మీ సంఘానికి ఎందుకు తక్కువగా వస్తున్నారు? ఈ విషయంలో మాకు కొంత క్లారిటీ ఇస్తారా? (0:57:03)

YouTube Link: ఇక్కడ క్లిక్ చేసి వీడియో చూడండి


దైవజనులు Apostle. Ranjith Ophir గారి వివరణ: (4m 45s)

  • మార్కెట్ విశ్లేషణ: మొట్టమొదటి విషయము – చేపల మార్కెట్ లో ఉన్నంతమంది జనం గోల్డ్ షాప్ (Gold shop) లో ఉండరు. చేపల మార్కెట్ లో వేల వేల మంది ఉంటారు, తొక్కిసలాట. మరి గోల్డ్ షాప్ లో ఇద్దరో ముగ్గురో ఉంటారు. కానీ అల్టిమేట్ (Ultimate) గా సాయంత్రం పోయి మొత్తం లెక్క చూస్తే గోల్డ్ షాప్ లో జరిగే వ్యాపారం ఏమో కోట్లలో ఉంటది, అక్కడేమో వందల్లో ఉంటుంది.
  • 💎 గోల్డ్ మార్కెట్: గనుక మాది గోల్డ్ మార్కెట్, మిగతాది అంతా చేపల మార్కెట్ అని మా నమ్మకము. అసలు ప్రజలు ఎందుకు రావడం లేదు? మీరే అన్నారు రెండు మాటలు – మీరు ఇంత గొప్ప ప్రవక్త, ఏ ప్రశ్నకైనా లేఖనానుసారంగా సమాధానం చెపుతారు అని. వాళ్ళు ఎందుకు రావడం లేదంటే యాక్చువల్ (Actual) గా ఆ రానోళ్ళని అడగాలి – “ఏ ప్రశ్నకైనా లేఖనానుసారంగా సమాధానం చెప్పగలిగిన రంజిత్ ఓఫిర్ గారి దగ్గరికి మీరు ఎందుకు రావడం లేదు?” అని.
  • 🎭 ప్రజల కోరిక: అడిగితే వాళ్ళేం చెప్తారంటే – “మాకు లేఖనానుసారమైన సమాధానం అక్కర్లేదండి, మాకు ఏదైనా సొల్లు కావాలి, సోది కావాలి, ఏదైనా కట్టు కథలు కావాలి, పిట్ట కథలు కావాలి, ఏదో మమ్మల్ని మెప్పించే మాటలు కావాలి గానీ.. ఆ లేఖనానుసారమైన బోధ మాకెందుకు? మాకు అక్కర్లేదు” అని చెప్తారు. ఇప్పుడు గోల్డ్ షాప్ కి ఎందుకు రాలేదు అంటే వాళ్ళు చెప్తారు – “అసలు మాకు గోల్డ్ అక్కర్లేదు, మాకు కావలసిందే వన్ గ్రామ్ గోల్డ్ కదా అంటారు, మాకు కావలసిందే రోల్ గోల్డ్” అని.
  • 📖 లేఖన ప్రవచనం: గనుక అది అమ్మ, సత్య బోధను వెంబడించాలి అంటే దానికి ఖరీదు చెల్లించాలి, దానికి మూల్యం చెల్లించాలి, ఎందరో సమాజ ప్రముఖుల ద్వేషాలను ఎదుర్కోవాలి. ఆ తర్వాత సమాజంలో “సత్యమునకు చెవి ఇవ్వక” అని ఉంది తిమోతికి పౌలు చెప్తాడు – “ఎందుకనగా జనులు హితబోధన సహింపక దురద చెవులు గలవారై, సత్యమునకు చెవి ఇవ్వక తమ స్వకీయ దురాశలకు అనుకూలమైన బోధకులను పోగు చేసుకునే కాలం వచ్చుచున్నది”.
  • ముగింపు: కనుక ప్రజలు సత్యమునకు చెవి ఇవ్వరు అనే ఆ లేఖన ప్రవచనం నెరవేరుతుంది. ప్రజలు సత్యానికి చెవి ఇవ్వరు అని చెప్పిన తర్వాత ప్రపంచంలో నాదే పెద్ద సంఘం అయితే అది నాకు డిస్క్వాలిఫికేషన్ (Disqualification). ఓహో అంటే సత్యానికి చెవిని ఇచ్చే వారు తక్కువ మంది ఉంటారు, సత్యానికి చెవి ఇవ్వని వారు ఎక్కువ మంది ఉంటారు అని బైబిల్ లో చెప్పినాక.. తక్కువ మంది రావడం నాకు కిరీటం పెట్టినంత విలువ. ఓహో అయితే నేను సత్యాన్ని చెబుతున్నాను అన్న మాట! అందుకే ఎక్కువ మంది రాలేకపోతున్నారని నేను సంతోషిస్తున్నాను. థాంక్యూ ఫర్ ఆస్కింగ్ దిస్ క్వశ్చన్ (Thank you for asking this question) అమ్మ. గాడ్ బ్లెస్ యు (God bless you).

Detailed English Translation:

❓ Question: There are pastors whose churches are attended by lakhs of people. Since you are such a profound prophet who can answer any question through the Scriptures, why is your congregation relatively small? Could you provide clarity on this?

  • The Gold Shop Analogy: Think of it this way: a fish market is always crowded with thousands of people jostling each other, while a gold shop may only have two or three customers. However, at the end of the day, the gold shop’s turnover is in crores, while the fish market’s is in hundreds. We believe our ministry is a ‘Gold Market’—focused on quality and absolute Truth.
  • The Desire for Entertainment: If you ask the crowds why they don’t seek scriptural depth, they might admit they aren’t looking for deep biblical answers. People often prefer stories, myths, or messages that simply make them feel good. They look for ‘rolled gold’ (imitation) because the cost of real gold—the cost of following absolute Truth—is too high for them.
  • Fulfillment of Prophecy: The Bible itself foretold this. Apostle Paul warned Timothy that a time would come when people would not put up with sound doctrine. Instead, to suit their own desires, they would gather around them a great number of teachers to say what their itching ears want to hear. They will turn their ears away from the Truth.
  • Small Numbers as a Badge of Honor: If the Bible says that those who listen to the Truth are few, then having a massive worldly following would actually be a ‘disqualification’ for me. The fact that the numbers are small proves that I am preaching the difficult, uncompromised Truth. For me, these small numbers are like a crown of validation—confirming that I am indeed standing by the Word, regardless of its popularity.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

సంప్రదించండి

📞 Call 9000083219 💬 WhatsApp

షేర్ చేయండి

WhatsApp Facebook Telegram