❓ ప్రశ్న: సర్ ఇంకేం లేదు ఒక చిన్న మాట – మనకి కిరాణా షాపు మే రన్ (Run) చేస్తున్నాం కదా, అయితే హిందువులకి చాలా విగ్రహారాధన సరుకులు – ఊదు సిగరెట్లు లేకపోతే ఇంకా ఉంటాయి కదా, పటిక పంచదార లేకపోతే ఇంకా కొబ్బరికాయలు వాడొచ్చా లేదా? ఇంకోటి వాస్తు – వాస్తు మనం పాటించొచ్చా లేదా? ఈ సన్యం మూలంలో ఉండి తీవ్రంగా నష్టపోయాం సార్. ఇప్పుడు మన క్రైస్తవులు ఏం పాటిస్తామో అనుకుంటే.. నష్టపోయాము అది పాటించాలా పాటించకూడదా? అదొక డౌట్ (Soubt) సార్ అది అయ్యగారు మాత్రమే క్లియర్ చేయగలరు. (0:44:43)
YouTube Link: ఇక్కడ క్లిక్ చేసి వీడియో చూడండి
దైవజనులు Apostle. Ranjith Ophir గారి వివరణ: (9m 45s)
- 🏗️ వ్యాపారం – ప్రకృతి ఫలాలు: బ్రదర్ చంద్రశేఖర్ గారు, మొట్టమొదటి సంగతి మీరు అడిగిన ప్రశ్నలోనే రెండు సెక్షన్లు ఉన్నాయి. కిరాణా కొట్టులో అమ్మదగిన సరుకులు, అమ్మకూడని సరుకులు. మొట్టమొదటి విషయం నేను చెప్తా వినండి – ప్రకృతిలో దొరికేటటువంటి వస్తువులు పుష్పములు, ఫలములు, ఆ తర్వాత అగరొత్తులు గాని, ఆ పసుపు పువ్వు గాని, కొబ్బరికాయలు గాని ఇట్లా ఏవైనా సరే అవి అమ్మడం అనేది ప్రకృతిలో పంట అది. ప్రకృతిలో పంట, మనం దాన్ని అమ్ముతాం. కొనుక్కునేవాడు ఏం చేసుకుంటాడో మనకు సంబంధం లేదు.
- 🥥 కొబ్బరికాయ ఉదాహరణ: ఆ లెక్కన కొబ్బరి తోటలు పెంచడం కూడా పాపం కిందకే వస్తది. ఎందుకంటే కొబ్బరికాయలు మనం అమ్ముతున్నాం, వాడు కొబ్బరి తోటలో పండించకపోతే మనం అమ్మలేం కదా! మరి గనుక కొబ్బరికాయలు పండించాడు, అమ్మేసాడు. అమ్మటం ఆయన వృత్తి వ్యాపారము, ఆయన బ్రతుకు తెరువు. ఆ కొనుక్కున్నవాడు కొబ్బరికాయ తీసుకెళ్లి కొబ్బరి పచ్చడి చేసుకుంటాడు ఇడ్లీలోకి, ఏవండీ ఇంకోడేమో గుడిలో కొబ్బరికాయ కొడతాడు పూజలో భాగంగా. ఈ రెండు కొబ్బరికాయలు ఒక చెట్టుకి కాసినవే అని ఉంటాయి. ఇప్పుడు ఇది మన కడుపు నింపిన ఆహారపు చెట్టు అనుకోవాలా, విగ్రహారాధన చెట్టు అనుకోవాలా? ఒకే కొబ్బరి చెట్టు. గనుక అంత సూక్ష్మంగా పోయి చూడాల్సిన అవసరం లేదు. అమ్మేటప్పుడు ఒక కస్టమర్ (Customer) గా, ఒక కొనుగోలు దారిగా వచ్చాడు, మన దగ్గర ఉన్న సరుకు మనం అమ్మాము. అతడు పూజ చేసుకుంటాడో, ఇంట్లో తీసుకెళ్లి రోట్లో నూరి ఆయన రోట్లో పచ్చడి చేసుకొని తింటాడో మనకు సంబంధం లేదు. గనుక నిరభ్యంతరంగా మీరు ఏదైనా అమ్మండి.
- 🚫 నైతిక బాధ్యత – హానికరమైనవి: కానీ ఆరోగ్య విషయం వస్తే.. ఇప్పుడు పొగాకు ఉన్నది. ఇదేమో నైతికమైంది, ఇంతకుముందు మీరు చెప్పింది ఆధ్యాత్మికం పూజ సంబంధమైంది. ఇప్పుడు నైతికం – ఇప్పుడు నాకు సంబంధం లేదు వాడు ఏదన్నా చేసుకొని అనుకుంటే, ఇప్పుడు మనము సారా లేకపోతే బ్రాందీ, పొగాకు, గంజాయి, ఆ తర్వాత ఇట్లాంటి సిగరెట్, చుట్ట, బీడి ఇట్లాంటివి మనము అమ్మొచ్చా అనేది ప్రశ్న. కొబ్బరికాయ తీసుకెళ్లి వాడు చట్నీ చేసుకుంటాడో గుడిలో కొబ్బరికాయ కొడతాడో మనకు తెలీదు, దానికి మంచి ఉపయోగం ఉంది, మనకు అభ్యంతరమైన ఉపయోగం రెండు ఉన్నాయి 50% ఛాన్సెస్. గనుక మనకు అటో ఇటో తెలియదు గనుక మనం ఆ సందేహం అనే దాని కింద లాభం పొందొచ్చు. కానీ చుట్ట తీసుకెళ్ళినవాడు చేసే మంచి కార్యం ఏమీ లేదు. చుట్ట, గంజాయి, సారా ఇటువంటివి డెఫినెట్ (Definite) గా ఆరోగ్యానికి హానికరమే గాని అవి మేలుకరమైనవి కాదు. గనుక విషాన్ని అమ్మినట్టే. గనుక ఈ అభ్యంతరకరమైనటువంటి పొగాకు, గంజాయి, సారా ఇటువంటివి అమ్మడం మానేస్తే మంచిది. చుట్టలు, బీడీలు ఇవన్నీ అమ్మడం మానేస్తే మంచిది.
- 🧭 వాస్తు – అష్టదిక్పాలకులు: ఇక వాస్తు సంగతి నేను చెప్తున్నాను – వాస్తు అనే దానికి అష్టదిక్పాలకులు ఉన్నారు అనే హిందూ మత సిద్ధాంతము పునాది. అగ్ని, ఇంద్రుడు, వరుణుడు.. ఇలాంటి అష్టదిక్పాలకులైనటువంటి దేవతలు ఎనిమిది దిక్కులకు అధిపతులు, వాళ్ళకు అనుగుణ్యంగా మనం అన్ని పెట్టుకోవాలి. ఆ దేవతలకు అపచారము, ఆగ్రహం కలిగించే విధంగా మనము ఈ ఇంటిలోని వస్తువులను పెట్టకూడదు అనేది వాస్తు శాస్త్రము. గనుక అష్టదిక్పాలకులు ఉన్నారని క్రైస్తవుడు నమ్మడు. అన్ని దిక్కులకు ఉన్న దిక్పాలకుడు, సకల దిక్పాలకుడు యేసుప్రభువు వారు. నాలుగు దిక్కులు ఉన్నా, ఎనిమిది దిక్కులు ఉన్నా, 16 దిక్కులు ఉన్నా యేసే రాజు. గనుక మనకు దాని మీద నమ్మిక లేదు, మనం నమ్మము.
- 🏛️ సామాజిక అవసరం: కానీ మన దేశంలో అయితే ఆ నమ్మకం ఉన్నది గనుక, ప్రజల కొరకు మనం ఎప్పుడూ వాస్తు ప్రకారమే ఇల్లు కట్టుకోవడం మంచిది. ఎందుకంటే వాస్తు విరుద్ధంగా మీరు ఇల్లు కడితే, భారతదేశంలో ఉన్నటువంటి వాళ్ళు ఎవరు కూడా – పరమ నాస్తికులు అయితే తప్ప – ఆ ఇల్లు కొనరు. జర్మనీ నుండి రష్యా నుండి వచ్చి కొనాల్సిందే తప్ప ఇక వాళ్ళు వచ్చి ఇక్కడ ఎందుకు కొనుక్కుంటారు? గనుక దేశానికి ఉన్న నమ్మకాన్ని బట్టి మీరు వాస్తు ప్రకారమే ఏదైనా చేయండి. అయితే వాస్తు వచ్చిన వాళ్ళకే చెప్పండి ఏంటంటే – “నాకు దేని మీద నమ్మకం లేదండి, ఆరోగ్యము కొరకు ఏదో కొన్ని చిన్న చిన్నవి”.
- ✨ యదార్థం: అసలు ఏ ఇద్దరు వాస్తు పండితులు కూడా పూర్తిగా అంగీకరించరు సుమా! మీరు ఈశాన్యంలో బరువు పెట్టాను దెబ్బ తిన్నాము అన్నారు, ఆ అక్కడ బరువు దించేసి ఇంకో దగ్గర మేము నెరక పెంచితే ఇంకో వాస్తు పండితుడు వచ్చి – “ఎవడు మీ సంగతి చెప్పిన చవట ఎవడండి వాడు, వాస్తు శాస్త్రజ్ఞుడా లేకపోతే ఇంకేమన్నా కమ్మరి కుమ్మరి వాడికి ఏం తెలుసు అసలా, ఇది తప్పు” అంటాడు. వాస్తు శాస్త్రజ్ఞులు ఇద్దరు కూడా పూర్తిగా ఏకీభవించరు. ఒకవేళ ఈ ప్రకారంగా మనం వాస్తు చేస్తే ఇంట్లోకి లక్ష్మి వస్తుంది అనేది నిజమైతే, ఆ శాస్త్రజ్ఞుడు మాసిక వేసిన పంచె ఎందుకు కట్టుకుంటా ఉంటాడు? ఆయన వాస్తు పాటించి ఇంట్లోకి లక్ష్మిని తెచ్చుకోవచ్చు కదా! భారతదేశం అంతా వాస్తు ప్రకారం ఇల్లు కడితే మన దేశానికి అప్పులే ఉండకూడదు మరి.
- 🛡️ ముగింపు: గనుక వాస్తు మీద నమ్మకం ఉన్నదని కాదు, వాస్తు పాటించి పాటించి కూడా నాశనం అయిపోయినవాళ్లు ఉన్నారు. కనుక మనకు నమ్మకం ఉన్నదని కాదు, దేశానికి నమ్మకం ఉన్నది గనుక మనం ఇల్లు కట్టినా ఏది చేసినా కనీసం మినిమమ్ (Minimum) వాస్తు ప్రిన్సిపుల్స్ (Principles) ప్రకారంగా మనం దాన్ని కట్టుకుంటే ఊర్లో వాళ్ళైనా దాన్ని అంగీకరిస్తారు. ఎప్పుడైనా మీరు అమ్మాలనుకున్నప్పుడు కొనుక్కుంటారు లేకపోతే అమ్మబోతే అడవి, కొనబోతే కొరివి అన్నట్టు అయిపోతుంది. సో సామాజికంగా దాన్ని మనం పాటించొచ్చు కానీ అందులో దేవుడు ఉన్నాడని కాదు, దయ్యం ఉందని కాదు. వాస్తు పాటించి నాశనమైన వాళ్ళని కూడా వేల మందిని నేను చూపిస్తాను. ఓకే అండి.
Detailed English Translation:
❓ Question: We run a grocery shop. Can we sell items like incense sticks and coconuts used for Hindu rituals? Also, regarding Vastu—is it permissible for Christians to follow it? We suffered losses previously while following certain principles. What is the correct stance?
- Trade vs. Natural Harvest: Selling natural produce like flowers, fruits, turmeric, or coconuts is a matter of trade and livelihood. Whether the buyer uses the coconut for a ritual or to make chutney is not the seller’s concern. If we consider selling a coconut for puja a sin, then even growing coconut trees would be sinful. You are selling a commodity; its subsequent use by the customer—be it spiritual or culinary—doesn’t fall on you.
- Ethical Responsibility – Harmful Substances: However, selling harmful items like alcohol, tobacco, cigarettes, or drugs is different. While a coconut has multiple good uses (50/50 chance), harmful substances serve no constructive purpose; they only damage health. Selling these is equivalent to selling poison. Therefore, it is ethically better for a Christian to avoid trading in harmful products.
- Vastu and Deities: The foundation of Vastu Shastra is the belief in ‘Ashta Dikpalakas’ (deities governing the eight directions). As Christians, we do not believe in these directional deities; we believe that Jesus Christ is the Sovereign Lord over all directions and dimensions.
- Social Practicality: However, since we live in a society where Vastu is a strong belief, it is practically wise to build according to basic Vastu principles. If you build a ‘Vastu-defective’ house, no one in India—except an absolute atheist—will buy it. For resale value and social acceptance, following basic layouts is a practical decision, not a spiritual one.
- A Reality Check on Vastu: If Vastu alone brought prosperity, why would Vastu consultants themselves often struggle financially? If India as a nation followed Vastu, we should have no debts. Many have followed Vastu to the letter and still faced ruin. Our security is in Christ, not in the orientation of a room. Use it for social convenience, but do not rely on it for spiritual blessing or fear it for curses.
