45.Q: The Secret to Health and Vitality (KSM 03) 💪

❓ ప్రశ్న: సార్ ఈనాడు చాలామంది మన సేవకులు, విశ్వాసులు కూడా అనుకుంటున్నటువంటి మాట ఏంటంటే – మేము ఒక 100 కిలోమీటర్లు ప్రయాణించంగానే అలసిపోయి మళ్ళీ తెల్లారి దాకా లేవని పరిస్థితి. మా గురువు గారు ఏంటి ఇన్ని రేయింబగలు ప్రయాణాలు చేస్తూనే ఉన్నారు, ఎప్పటి నుండో చేస్తూనే ఉన్నారు కానీ అలసిపోరు! అంటే ఏ మెడిసిన్ (Medicine) వాడుతున్నారు? ఆ మహత్యం ఏమిటి? మీ అద్భుతమైన ఆరోగ్యానికి మరియు ఎనర్జీకి (Energy) గల రహస్యం ఏమిటి? (1:58:12)

YouTube Link: ఇక్కడ క్లిక్ చేసి వీడియో చూడండి


దైవజనులు Apostle. Ranjith Ophir గారి వివరణ: (9m 07s)

  • 💪 దైవకృప మరియు ప్రాథమిక సూత్రాలు: ఆరోగ్య రహస్యం అనేది చెప్పాలంటే – దేవుని కృప. ఇప్పుడు నేను హ్యూమన్ సైడ్ (Human side) చెప్పాలంటే ఎన్నో చెప్పుకోవచ్చు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ (For example) – నేను పుట్టి బుద్ధి ఎరిగిన కాడి నుంచి నేను ఎప్పుడు పొగాకు గాని, దాని ప్రాడక్ట్స్ (Products) దాని వివిధ రూపాల్లో పొగాకు గాని, ఆల్కహాలిక్ డ్రింక్స్ (Alcoholic drinks) గాని నేను ముట్టుకోలేదు అసలు. నాకు తెలియదు. బ్రాందీ అంటారు, ఇంకేదేదో అంటారు కదా.. అలాగ రకరకాల పేర్లు అనగా నేను విని నాకున్న జ్ఞాపక శక్తిని బట్టి మళ్ళీ వాడడం కానీ, దానికి దీనికి డిఫరెన్స్ (Difference) ఏంటో కూడా నాకు తెలియదు. బీర్ అంటారు, బ్రాందీ అంటారు, విస్కీ అంటారు.. ఇవన్నీ కలిసి చెడ్డవి అని తెలుసు తప్ప, అన్నీ నా ముందు పెడితే ఏది బ్రాందీ, ఏది విస్కీ నాకు తెలియదు. సో దేహానికి హానికరమైనవి నేను ముట్టుకోలేదు.
  • ⚖️ మనస్సాక్షి – ఎముకలలో స్వస్థత: అలాగే నాలాగా ఈ చెడు వాటికి దూరంగా ఉన్న హిందువులు, ముస్లింలు కూడా బోలెడు మంది ఉన్నారు. ఐ యామ్ నాట్ క్లెయిమింగ్ దట్ ఐ ఏ గ్రేట్ మ్యాన్ (I am not claiming that I am a great man) బికాజ్ ఐ డింట్ టచ్ దోస్ థింగ్స్ (Because I didn’t touch those things). అటువంటి మాట కాదు నేను చెప్పేది. కానీ ఎవరైనా ఈ ఆల్కహాల్ అండ్ టొబాకో (Alcohol and Tobacco) కు దూరంగా ఉంటే ఆరోగ్యం బాగానే ఉంటది. రెండో విషయం ఏంటంటే – దేవుని కృప ముఖ్యమైన సంగతి. ఒకటి చెప్తున్నాను, మన మనస్సాక్షి మనకు చెప్పాలి – దేవునికి విరోధమైనది నేనేమీ చేయలేదు అని. మన మనస్సాక్షి మనలో సాక్ష్యం ఇస్తూ ఉన్నట్లయితే ఆరోగ్యము అద్భుతంగా ఉంటుంది. ఇది ముఖ్యమైనటువంటి విషయం.
  • 🦴 ఆత్మ నింద మరియు ఎముకల మూలుగు: మరి దావీదు భక్తుడు తన అనుభవంలో చెబుతాడు ఏంటంటే – 38వ కీర్తన మూడవ వచనంలో “నా పాపమును బట్టి నా ఎముకలలో స్వస్థత లేదు” అని చెబుతాడు. అంటే పాపము అంటే ఏదైనా ఆజ్ఞాతిక్రమం. దేవుడు చేయమని చెప్పింది నేను చేయలేదు అనే సాక్ష్యము, దేవుడు వద్దన్నది నేను చేశాను అనే నింద.. ఆ ఆత్మ నింద మనలోనే పెరిగిపోయినప్పుడు ఎముకలలోని మూలుగు (Bone Marrow) మీద ఎఫెక్ట్ (Effect) ఇస్తుంది. నా పాపమును బట్టి నా ఎముకలలో స్వస్థత లేదని అంటాడు. ఎప్పుడైతే నా హృదయం నా మీద నింద మోపుతున్నప్పుడు – “ఒరేయ్ రంజిత్ ఓఫిర్ నువ్వు తప్పు చేశావు, నువ్వు తప్పు చేశావు” అంటున్నప్పుడు లోకమంతా నాకు గజమాలలు వేసినా, సన్మానించినా, భజనలు చేసినా, పొగిడినా నాలో నాకే ఉన్న స్వయం ఖండన ఉంది చూశారు.. అది ఆరోగ్యాన్ని చెడగొట్టేస్తుంది. మనశ్శాంతి ఉండాలి (Tranquility of mind). దేవుని ముందు పోయినప్పుడు – “అయ్యా నాకు తెలిసి నువ్వు వద్దన్నది ఏది నేను చేయలేదు” అనే సాక్ష్యం ఎవరిలో ఉంటుందో వాళ్ళకి ఆరోగ్యం బాగానే ఉంటుంది.
  • 🧪 సైంటిఫిక్ హెల్త్ ప్రొడక్ట్స్: అది కాక ఈనాడు సైంటిఫిక్ (Scientific) గా ఆరోగ్యం బాగుండడానికి తయారు చేసిన హెల్త్ ప్రాడక్ట్స్ (Health products) అన్నీ కూడా నేను వాడి చూశాను. డి.ఎక్స్.ఎన్ (DXN) అనుకోండి, ఆ తర్వాత ఇప్పుడు ఐ-పల్స్ (i-Pulse) అనేది ఒకటి వచ్చింది, ఇంకా ఎన్నెన్నో వచ్చాయి. అయితే నేను ఏంటంటే – ముందు ఆరోగ్యానికి మంచిది అనుకున్నది నేను తీసుకొని వాడతాను, ఇంకోరికి పరిచయం చేస్తాను. ఎందుకైనా మంచిది. అలాగే ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి.
  • శక్తికి మించిన సేవ – దేవుని బలం: కానీ ముఖ్యమైన సంగతి నేను నమ్మేది ఏంటంటే – దేవుని చిత్తములో మనము అలసిపోయినప్పుడు ఆరోగ్యం చెడిపోదు. దేవుడు చేయమన్నటువంటి పని చేసి అలసిపోయినప్పుడు ఆరోగ్యం చెడిపోదు. “శక్తికి మించి అలసిపోతున్నాను ప్రభువా, నాకు శక్తిని ఇవ్వమని” అడిగితే ఇస్తాడు ఆయన. ఎందుకంటే ఆయన సృష్టికర్త కదా! ఒక ఉదాహరణ చెబుతాను – జపాన్ లో స్కూల్ పిల్లలు లేట్ గా వస్తే మెడకాయ నరికేసేటట్టుగా ఒక మిషన్ ఏర్పాటు చేశారంట, ఒక చిన్న పిల్లోడు వన్ సెకండ్ లేట్ కి వస్తే మెడకాయ నరికేసింది. దేవుడు అటువంటివాడు కాదు. హి ఈజ్ నాట్ ఏ ప్రీ-ప్రోగ్రామ్డ్ కంప్యూటర్ (He is not a pre-programmed computer). ఆయన మన ఎమోషన్స్ తెలిసినవాడు. నేను గత అనేక మాసాలుగా రోజు రెండు గంటలే నిద్రపోయాను, అయినా సరే షష్టిపూర్తి అయిపోయింది నన్ను చూసి ఎవరు కూడా అనుకోరు. ఇప్పటికీ ప్రయాణాలు చేస్తున్నాను. 15 సంవత్సరాలుగా నేను రాత్రి పూట ఒక పూటే తింటాను (Intermittent Fasting). దినమంతా మరి ఇంత ఎనర్జీ ఎక్కడిది? దేవుని మహా కృప.
  • ముగింపు: చిట్కాలు అనేది ఏమీ లేదు, మనకు అందుబాటులో ఉన్నటువంటి హెల్దీ ఫుడ్ (Healthy food) తీసుకోవాలి. ఆహార పదార్థాల్లో హెల్దీ ఫుడ్ తీసుకోవాలి, తర్వాత అవకాశం ఉన్నంతవరకు హెల్త్ టానిక్స్ వాడుకుంటే మంచిది. అన్నిటికంటే ముఖ్యంగా దేవుని చిత్తమునకు విరోధంగా తెలిసి తెలిసి మనం ఏది చేయకూడదు. దేవుడు మనల్ని వాడుకోవాలంటే మనకు ఆరోగ్యం ఉండాలి, పరిశుద్ధత ఉండాలి. పరిశుద్ధత అనేది ఆత్మ సంబంధమైన ఆరోగ్యం, ఆరోగ్యం అనేది భౌతికమైన పరిశుద్ధత (Health is physical holiness and holiness is spiritual health). మనకు శరీరంలో ఆరోగ్యం ఉండాలి, ఆత్మీయ జీవితంలో పరిశుద్ధత ఉండాలి. ఈ రెండు ఉన్నప్పుడు దేవుడు మనల్ని వాడుకోగలుగుతాడు. అప్పుడు భూలోకాన్ని మనం సత్యంతో నింపివేయగలుగుతాం. థాంక్యూ ఫర్ రైజింగ్ దట్ గుడ్ క్వశ్చన్ (Thank you for raising that good question).

Detailed English Translation:

❓ Question: Many believers and fellow ministers are in awe of your stamina. We get exhausted after traveling just 100 kilometers, but you have been traveling and preaching day and night for years without signs of fatigue. What secret medicine or miracle behind your energy and health?

  • Discipline and Divine Grace: The secret to my health is primarily God’s grace, but there is a human side to it. Since childhood, I have strictly avoided tobacco and alcohol in all their forms. I don’t even know the difference between various types of liquor because I have never touched them. Staying away from these toxins is a fundamental rule for maintaining the body.
  • The Connection Between Conscience and Health: I believe a clear conscience is vital for a healthy body. When your conscience testifies that you haven’t willfully disobeyed God, your vitality remains intact. King David noted in Psalm 38:3, “There is no health in my bones because of my sin.” Guilt and self-condemnation act as spiritual toxins that affect the bone marrow and overall health. True ‘Tranquility of Mind’ is the best medicine.
  • Wise Use of Health Supplements: I am not against science. I use and recommend high-quality health supplements (like i-Pulse or DXN products) that support physical wellbeing. It is our responsibility to take care of the physical vessel God has given us by using the best available resources.
  • Supernatural Energy for Divine Assignments: I firmly believe that when you exhaust yourself while doing God’s work, He provides supernatural strength. He is not a ‘pre-programmed computer’ like a machine; He is a loving Father who understands our emotions and needs. For the past 15 years, I have practiced eating only once a day and often sleep only two hours a night, yet God sustains me even at this age.
  • The Two Pillars of Ministry: To be effective for God, one needs both ‘Physical Holiness’ (Health) and ‘Spiritual Health’ (Holiness). Health is the physical aspect of being set apart, and Holiness is the spiritual state of being healthy. When a servant of God maintains both, they become a powerful tool to spread the Truth throughout the world.

సంప్రదించండి

📞 Call 9000083219 💬 WhatsApp

షేర్ చేయండి

WhatsApp Facebook Telegram