🩸 ప్రశ్న: నరుని రక్తం చిందించే అధికారం మరొకరికి ఉందా? లేవియాకాండం 27:29 అర్థం ఏమిటి? మానవుని రక్తం చిందించే అధికారం ఇంకో మానవునికి ఉందా? అది ఏ సందర్భమైనా గానీ.. ఎందుకంటే లేవియాకాండం 27:29 లో మనుషులను కూడా హతం చేయొచ్చు అనే మాట ఉంది కదా! దీనిపై క్లారిటీ ఇవ్వగలరు. (0:00:04)
YouTube Link: ఇక్కడ క్లిక్ చేసి వీడియో చూడండి
దైవజనులు Apostle. Ranjith Ophir గారి వివరణ: (3m 31s)
- 🩸 దేవుని స్వరూపం: విచారణ చేయుదును.. నరుని రక్తమును చిందించు వాని రక్తము నరుని వలనే చిందించబడును. ఏలయనగా దేవుడు తన స్వరూపమందు నరుని చేసెను. ఇక్కడ మానవుని రక్తం చిందించే అధికారం ఇంకో మానవునికి లేదు, అది ఏ సందర్భమైనా గానీ. గనుక జంతు రక్తం చిందిస్తే విచారణలోకి తెస్తానని దేవుడు అనలేదు కానీ, మానవుని రక్తాన్ని చిందిస్తే దోషిగా ఎంచుతాను, విచారణ చేస్తాను అన్నాడు. ఎందుకంటే మానవుడు దేవుని స్వరూపం గనుక.
- 📖 లేవియాకాండం 27:29 వివరణ: ఇంత డైరెక్ట్ (Direct) గా ఇక్కడ చెప్పిన తర్వాత, లేవియాకాండం 27 లోకి పోయి ఆ మనుషులను కూడా హతం చేయొచ్చు అనే సంగతి అక్కడ దేవుడు చెప్పడానికి అవకాశం లేదు. అలాగైతే మళ్ళీ రెండవ కోరింథీ మొదటి అధ్యాయము 18వ వచనం ప్రకారం – “మన దేవుడు అవునని చెప్పి కాదనువాడు కాదు” అనే వచనాన్ని కొట్టేయాల్సి వలసి ఉంటుంది. అవి కొట్టేసుకోవాలి. అందుచేత దేవుడు నమ్మదగినవాడు, ఆయన అవునని చెప్పి కాదనువాడు కాదు. అవునంటే అవును అంటాడు, కాదంటే కాదు అంటాడు. దేవునికి కన్ఫ్యూజన్ (Confusion) లేదు, మతిమరుపు అసలే లేదు.
- 🧱 పరిభాషలో తేడా: అందుచేత నరుని రక్తమును చిందించొద్దు అని చెప్పిన దేవుడు, ఇక లేవియాకాండానికి వచ్చి ఆ నరుని రక్తం అయినా సరే చిందించవచ్చు మీరు హతం చేయాలి అని అనలేదు. అక్కడ “దేనినైనను” అన్నాడు 29వ వచనంలో. మరి మనుషులు ప్రతిష్టించు వాటిలో దేనినైన.. మనుషులనైతే “వాటిలో” అన్నారు, “అవి” అన్నారు. అంటే అది జంతువులకు సంబంధించిన విషయం.
- 🐑 ఉదాహరణ: ఇప్పుడు నాకు నలుగురు పిల్లలు ఉన్నారు అనంగా గానీ, “నాలుగు పిల్లలు ఉన్నాయి” అనం కదా! ఆ పిల్లలు చాలా అల్లరి చేస్తుంటే “అవి అంతే” అని నా పిల్లలను అనం. గనుక అక్కడ వస్తువులను, విషయాలను అన్నట్టుగా “వాటిని వాటిని” అన్నాడు గనుక అది మానవులను గూర్చిన పరిభాష కాదు. అందుచేత లేవియాకాండము 27:29 ని తీసుకొని యెఫ్తా హతము చేయడం రైట్ (Right) అనేది మనం అనుకోలేము.
- ✨ ముగింపు: యెఫ్తా కాలానికి ఆదికాండం ఉంది. నాయకుడైన వాడు ధర్మశాస్త్రాన్ని చదవాలని యెహోషువకే చెప్పాడు దేవుడు. ధర్మశాస్త్రాన్ని ఎల్లప్పుడూ చదవాలి, ధ్యానించాలి, తొలగిపోకుండా ఉండాలి అన్నాడు. మరి యెఫ్తా ఆ పని చేస్తే గనుక ఈ పని చేయడు. అందుచేత ఎలాగైనా యెఫ్తా అనవసరమైనటువంటి దుందుడుకు చర్య అది.
Detailed English Translation:
❓ Question: Does any human have the authority to shed the blood of another human? What is the true meaning of Leviticus 27:29, which some interpret as allowing human sacrifice or execution in certain religious contexts?
- Man in God’s Image: Genesis 9:6 establishes a firm law: “Whoever sheds human blood, by humans shall their blood be shed; for in the image of God has God made mankind.” God explicitly warns that he will demand an accounting for human life. This is because humans are created in the divine image, unlike animals. Therefore, no human has the inherent right to kill another, regardless of the circumstance.
- Consistency of God’s Word: If God forbade murder so directly, He would not contradict Himself in Leviticus 27:29 by allowing humans to be ‘devoted to destruction.’ As 2 Corinthians 1:18 says, God is faithful, and His word is not “Yes” and “No.” He does not suffer from confusion or forgetfulness.
- The Language of ‘Things’ vs. ‘People’: In Leviticus 27:29, the Hebrew phrasing refers to things or animals ‘devoted’ to God. In the context of verse 29, the pronouns used are often neuter (“them/those”), which typically applies to property or livestock, not human beings. Just as we wouldn’t refer to children as “it” or “those things,” the biblical terminology here distinguishes between ritual devotion of property and the life of a human.
- The Error of Jephthah: Some use this verse to justify Jephthah’s sacrifice of his daughter. However, Jephthah had access to the early scrolls of the Law. Had he diligently meditated on God’s commands as Joshua was instructed to do, he would have known that human sacrifice is an abomination to God. His act was a result of a rash, unscriptural vow, not an obedience to a divine law found in Leviticus.
- Conclusion: Human life is sacred and belongs to God alone. Ritual or unauthorized killing is never sanctioned by the Creator. Leviticus 27:29 deals with dedicated property, and any attempt to use it to justify shedding human blood is a grave misinterpretation of the character of God.
