❓ ప్రశ్న: ప్రైస్ ది లార్డ్ సార్, జైరాబాద్ నుండి కాల్ చేస్తున్నాం. కీర్తన 137 చివరి వచనంలో ఒక మాట ఉంది – “నీ పసిపిల్లలను పట్టుకొని బండకేసి కొట్టువాడు ధన్యుడు” అని. అది కొంతమందిని అడిగితే కొన్ని విధాలుగా వివరిస్తున్నారు. బబులోను వంశం ప్రకారం అని కొందరు, మోషే ధర్మశాస్త్రం అని కొందరు, బండ అనగా క్రీస్తు అని కొందరు అంటున్నారు. దీని ఆత్మీయ అర్థం ఏంటో మీరు చెప్తారని అడుగుతున్నాను. (0:35:14)
YouTube Link: ఇక్కడ క్లిక్ చేసి వీడియో చూడండి
దైవజనులు Apostle. Ranjith Ophir గారి వివరణ: (6m 27s)
- 📖 దృష్టాంతములు – అలంకార రూపకము: బాగా వినండి. పాత నిబంధన గ్రంథములో ఉన్నటువంటి చరిత్ర గానీ, ఆజ్ఞలు గానీ అవన్నీ కూడా ఉపమాన రూపకముగా, అలంకార రూపకముగా మన కొరకు రాయబడినవి అని మనకు గలతీ పత్రికలో పౌలు భక్తుడు రాస్తాడు. ఒక్కసారి మీకందరికీ వింటున్న వాళ్లందరికీ సహాయకరంగా ఉంటుంది.. గలతీ పత్రిక 4:23 – “అయినను దాసి వలన పుట్టినవాడు శరీర ప్రకారము పుట్టెను, స్వతంత్రురాలి వలన పుట్టినవాడు వాగ్దానమును బట్టి పుట్టెను. ఈ సంగతులు అలంకార రూపకముగా చెప్పబడి ఉన్నవి.” అబ్రాహాము అనే ఒక చారిత్రిక పురుషుడు ఉన్నాడు, షారా, హాగరు నిజమైన వ్యక్తులు.. కానీ ఆ చరిత్ర రాస్తూ “అలంకార రూపకముగా చెప్పబడి ఉన్నది” అని చెబుతున్నాడు.
- 📚 యుగాంతమందున్న మనకు బుద్ధి: అలాగే మొదటి కోరింథీ పత్రిక 10:11 – “ఈ సంగతులు దృష్టాంతములుగా వారికి సంభవించి, యుగాంతమందున్న మనకు బుద్ధి కలుగుటకై రాయబడెను” అని చెబుతున్నాడు. అందుచేత పాత నిబంధనలో ఉన్నటువంటి అన్ని సంగతులు కూడా మనకు జ్ఞానము కలుగుటకై అవి దృష్టాంతముగా రాయబడ్డాయి.
- 👹 బబులోను – సాతాను సామ్రాజ్య చిహ్నం: బబులోను అనేది యాక్చువల్ (Actual) గా సాతాను సామ్రాజ్యమునకు చిహ్నము. ప్రకటన గ్రంథము 18:2 – “మహా బబులోను కూలిపోయెను, అది దయ్యములకు నివాస స్థలము, ప్రతి అపవిత్రాత్మకు కునికిపట్టు ఆయెను.” 17వ అధ్యాయంలో – “మహా బబులోను అనే ఒక వేశ్య ఉన్నది, భూరాజులు ఆమెతో వ్యభిచరించిరి.” ఈ మహా బబులోను అనే వేశ్య దేవ విరోధమైనటువంటి సాతాను సమాజమునకు సూచన. అసలు బబులోను అనేది ఆదికాండం 11వ అధ్యాయంలో ప్రారంభమైంది, అక్కడ నుండి సాతాను సామ్రాజ్యానికి అది ప్రతీకగా ఉన్నది.
- 🍼 బబులోను పిల్లలు అంటే ఎవరు?: దృష్టాంతంగా, అలంకార రూపకంగా చెప్పేది ఏంటంటే – దేవుని సువార్త సత్యానికి విరోధంగా పోరాడే సాతాను సామ్రాజ్యము, సాతాను బోధలు.. ఆ బోధలో పుట్టి పెంచబడిన వాళ్ళు అని అర్థం. అంటే అపవాది సంబంధులు అని అర్థం. బబులోను పుట్టిన పిల్లలు అంటే – బబులోను బోధలో పెంచబడిన అబద్ధ బోధలకు స్తంభంగా ఉన్న విశ్వాసులు వాళ్ళు అని అర్థం.
- 🧱 బండకేసి కొట్టడం – అబద్ధాన్ని చంపడం: వారిని బండకేసి కొట్టడం అంటే – క్రీస్తు అనే బండ మీద మనం కట్టబడాలి, ఆయనకేసి కొట్టబడకూడదు. వాస్తవంగా చిన్నపిల్లలను కొట్టి చంపమని దేవుడు చెప్పలేదు. అక్షరార్థంగా పసిపిల్లలను బండకేసి కొట్టడం అని దేవుడు చెప్పలేదు. బబులోను అంటే అది ఒక ఆత్మీయ అర్థము, పిల్లలు అంటే అది ఇంకో ఆత్మీయ అర్థం. బబులోనులో పుట్టిన పిల్లలు అంటే బబులోను బోధలో పెంచబడిన అబద్ధ బోధలు.. వాళ్ళను కొట్టి చంపడం అంటే ఆ అబద్ధాలను చంపమని అర్థమే తప్ప, మనుషులను చంపమని ఎప్పుడు దేవుడు చెప్పలేదు. అది అలంకార భాష అని చెప్పాను, అది మీరు అర్థం చేసుకోండి. ఓకే.
Detailed English Translation:
❓ Question: Psalm 137:9 says, “Happy is the one who seizes your infants and dashes them against the rocks.” Skeptics and believers alike find this verse difficult. Does it justify violence against children, or is there a deeper spiritual meaning?
- The Principle of Allegory: To understand the Old Testament, we must apply the principle established by Apostle Paul. In Galatians 4:23-24, he explains that historical events like those of Abraham’s family are “spoken figuratively” or as allegories. Similarly, 1 Corinthians 10:11 states that these events happened as examples (types) and were written down for our instruction at the end of the ages.
- Babylon as a Spiritual Entity: In biblical symbology, Babylon is not just a city but a representation of Satan’s kingdom and anti-God systems. Revelation 18:2 and 17:1-2 describe “Mystery Babylon” as a great prostitute and a dwelling place for demons. Since Genesis 11, Babylon has symbolized human rebellion against Divine Truth.
- Who are the ‘Infants’ of Babylon?: Figuratively, the ‘children’ or ‘infants’ of Babylon are the products of false doctrines, ideologies, and systems that oppose the Gospel. They are the ‘offspring’ of satanic teachings—the lies and deceptions planted in the hearts of people.
- The Spiritual Act of Dashing: Dashing these infants against the rock is a metaphor for spiritual warfare. It does not mean physical harm to children. God is the protector of children. Rather, it means taking the ‘offspring’ of false teachings (the lies) and smashing them against the ‘Rock’ of Truth, which is Christ.
- Conclusion: The verse is a blessing for those who identify false teachings while they are still ‘infants’ (in their early stages) and destroy them using the Truth of Christ. It encourages the complete eradication of lies and demonic influences within a spiritual community. It is an allegory of intellectual and spiritual victory, not physical cruelty.
