❓ ప్రశ్న: దేవుని పిలుపు దర్శనం లేకుండా అనేకమంది సేవకులుగా వస్తున్నారు. సంఘాల్లో ఉన్నవారిని మీరు ఎందుకు యేసయ్యని నమ్ముకున్నారు అంటే సరైనటువంటి కారణం చెప్పనటువంటి స్థితిలో చాలామంది ఉన్నారు. రోగం తగ్గిందని, స్వస్థత కుదిరిందని వస్తున్నారు. మరి వీరందరూ కూడా మహాశ్రమల కాలం వచ్చినప్పుడు ఎలా ఉండగలుగుతారు? వారి పరిస్థితి ఏమిటి? (0:32:43)
YouTube Link: ఇక్కడ క్లిక్ చేసి వీడియో చూడండి
దైవజనులు Apostle. Ranjith Ophir గారి వివరణ: (2m 31s)
- ⛪ పొట్టు మరియు గింజ: మీ ప్రశ్నలోనే మీకు సమాధానం తెలుసు అని నాకు స్ఫురిస్తూ ఉంది. అంటే వాళ్ళు సరైన రక్షణ సాక్ష్యము, రక్షణ అనుభవం లేకుండానే క్రైస్తవులుగా చలామణి అవుతున్నారు. మరి ఇలాంటి రక్షణ అనుభవము, నిత్య జీవము లేకుండానే కొనసాగుతున్న ‘పొట్టు’ అనేది క్రైస్తవ సంఘంలో ఉంది.
- 🔥 మహాశ్రమల కాలం: చాలా వరకు ఆ పొట్టంతా కాల్చేయడానికి మహాశ్రమల కాలం వస్తుంది. మహాశ్రమల కాలంలో నిజంగా రక్షణ పొందిన వారు ఎవరో, లేక నామకార్థులు ఎవరో తేలిపోతుంది. కనుక దాని విషయం మనకు చింత అనవసరం.
- ✨ ముగింపు: మనం రక్షణ పొందాం కనుక మన రక్షణ మనం కాపాడుకొని, మనలాంటి వాళ్ళని కొంతమందిని తయారు చేయడంలో మనం దృష్టి పెడితే మంచిది. మరి నామకార్థంగా ఉండి, నూతనంగా తిరిగి జన్మించకుండానే క్రైస్తవులుగా చలామణి అయ్యేవారు ఎలాగో వాళ్ళు కాలిపోతారు. ఆ మహాశ్రమల కాలం ఉండేదే వాళ్ళని తీసేయడానికి. రైట్. గాడ్ బ్లెస్ యు (God bless you).
Detailed English Translation:
❓ Question: Today, many enter the ministry without a divine calling or vision. Many believers also cannot explain why they follow Jesus, often citing only physical healing or personal benefits. How will these people survive the Great Tribulation? What will be their fate?
- Chaff vs. Grain: Your question contains the answer. There is a lot of ‘chaff’ in the Christian community today—people who operate as Christians or ministers without a genuine experience of salvation or eternal life. They lack the root of a true spiritual rebirth.
- The Purpose of the Tribulation: The Great Tribulation is coming specifically to burn away this ‘chaff.’ During that time of intense trial, the distinction between those who are truly saved and those who are merely nominal Christians will become clear. The fire of tribulation will expose the reality of one’s faith.
- Our Responsibility: We should not worry too much about them. Instead, since we have received salvation, we must focus on preserving our own spiritual standing and mentoring others to reach the same level of genuine faith.
- Conclusion: Those who masquerade as Christians without being born again will inevitably face the heat of the Tribulation. That period exists precisely to sift the wheat from the chaff and remove those who are not truly His.
