❓ ప్రశ్న: వైజాగ్ నుండి జగదీష్ అనే ఒక సహోదరుడు అడిగారు – హెబ్రీలకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 26వ వచనంలో ఒక మాట ఉంది సార్.. “అప్పుడు ఆయన శబ్దము భూమిని చలింపజేసెను గాని ఇప్పుడు నేను ఇంకొకసారి భూమిని మాత్రమే కాక ఆకాశమును కూడా కంపింప చేతును అని మాట ఇచ్చి ఉన్నాడు”. ఇది యుగాంతమందు జరుగుతుందా? ఇది దేని గురించి చెబుతున్నాడు ఈ మాట అని చెప్పేసి అడుగుతా ఉన్నాడు. (0:25:22)
YouTube Link: ఇక్కడ క్లిక్ చేసి వీడియో చూడండి
దైవజనులు Apostle. Ranjith Ophir గారి వివరణ: (3m 12s)
- 🌌 చలింపజేయబడినవి తీసివేయబడును: అక్కడే “చలింప చేయబడినవి బొద్దిగా తీసివేయబడును” అనే మాట అంటాడు అక్కడ. హెబ్రీ 12:26 లో, 27 చూస్తే “ఇంకొకసారి” అన్నమాట చలింపజేయబడనివి నిలకడగా ఉండు నిమిత్తము.. అవి సృష్టింపబడినవి అన్నట్టు “చలింపజేయబడినవి బొద్దిగా తీసివేయబడును” అని అర్థం అవుచున్నది అంటాడు.
- ☄️ ఉనికిలో నుండి తొలగించుట: అంటే అర్థం ఏంటంటే – భూమిని కంపింపజేసెదను అంటే ఏదైతే అలా కంపింపచేసే అవకాశం ఉందో, అది అవుట్ ఆఫ్ ఎగ్జిస్టెన్స్ (Out of existence) దాన్ని దేవుడు చెరిపివేసి, ఉనికిలో నుండి తొలగించి లేకుండా చేసే అవకాశం ఉన్నది అన్నట్టు.
- ✨ ఆకాశ కంపము: అయితే ఇంకొకసారి భూమిని మాత్రమే కాదు ఆకాశమును కూడా కంపింప చేసెదను అన్నాడు. అంటే ఆకాశమును కూడా కంపింప చేస్తాడు అంటే ఆకాశం కూడా లేకుండా పోతుంది అని అర్థం. ఏదైతే చలింపజేయబడే అవకాశం ఉన్నదో అది లేకుండా పోతుంది.
- 🏰 నిత్యరాజ్యము: చలింపజేయబడకుండా ఉండేది అంటే – నిత్యరాజ్యము, దేవుని యొక్క నిత్య నివాసము, పరలోక పట్టణం. అది ఎప్పటికీ చలింప చేయబడదు. ఇక్కడ భూకంపాలు వస్తే అక్కడ రాదు. ఇక్కడ భూకంపము, ఆకాశ కంపము కూడా వస్తుందట.. అప్పుడు ఆకాశమే లేకుండా పోతుంది అన్నమాట. అంటే యుగాంతము, యుగ సమాప్తి, మళ్ళీ కొత్త యుగ ఆరంభంలో అది జరుగుతుంది. ఓకే.
Detailed English Translation:
❓ Question: Hebrews 12:26 says, “Once more I will shake not only the earth but also the heavens.” Does this refer to the end of the age? What is the spiritual significance of God shaking the heavens?
- Removal of the Shakable: The passage continues in verse 27 to explain that the shaking signifies the removal of what can be shaken. This means that everything in the created, material universe that is subject to instability will be phased out of existence by God.
- Ceasing to Exist: When God says He will shake the earth, He means He will remove it from its current form of existence. But He adds that He will shake the heavens as well. This implies that even the celestial realms as we know them will pass away.
- The Unshakable Kingdom: Only that which cannot be shaken will remain. This refers to the Eternal Kingdom of God, His dwelling place, and the Celestial City (New Jerusalem). While the physical earth and heavens experience ‘shaking’ or destruction, the Kingdom of God remains eternally stable.
- End of the Age: This cosmic event occurs at the end of the current age—the consummation of all things—leading into the dawn of a new eternal age. It is the final sifting where the temporal is removed to make way for the eternal.
