❓ ప్రశ్న: ఒకరి కాళ్లు ఒకరు కడుక్కోవడం (Foot Washing) అనేది నేడు క్రైస్తవులకు సిద్ధాంతమా? యేసు ప్రభువు తన శిష్యులకు చెప్పాడు కదా, దాన్ని ఎందుకు పాటించడం లేదు? ఈ మధ్య వైజాగ్ లో ఎక్కువగా దీనిని ప్రకటిస్తూ, ప్రచారం చేస్తూ మరి జరిగించాలని కోరుకుంటున్నారంట కొన్ని సంఘాల వారు. దీని గురించి చెప్పమని అడిగారు సార్. (0:28:41)
YouTube Link: ఇక్కడ క్లిక్ చేసి వీడియో చూడండి
దైవజనులు Apostle. Ranjith Ophir గారి వివరణ: (4m 03s)
- 🦶 ప్రామాణికం ఏమిటి?: నేను చాలా సార్లు, చాలా సందర్భాల్లో ఈ ప్రశ్నలకు సమాధానం చెప్పాను. సకల జనులు చిత్తగించండి – క్రైస్తవులకు, క్రైస్తవ విశ్వాసులకు శిరోధార్యమైనటువంటి, ఆచరణీయమైనటువంటి, తప్పకుండా ఆచరించి తీరవలసిన విధాయకమైనటువంటి ఆచార పారంపర్యములు ఏమి అంటే.. ఆదిమ అపోస్తలులు ఇలాగు చేశారు లేకపోతే చేయమని చెప్పారు అనే రికార్డు (Record) బైబిల్ లో ఉండాలి.
- 📖 యేసు మాటలు vs అపోస్తలుల భాష్యం: ఇప్పుడు యేసుప్రభువు చెప్పినది కూడా మనకు సిద్ధాంతం కాదు, ఈ విషయం గమనించాలి. ఎందుకు కాదంటే యేసుప్రభువు వారు ఇంకా ఉన్నతమైనటువంటి ఉపదేశం చేశాడు. ఫర్ ఎగ్జాంపుల్ (For example) – నిన్ను ఎవడైనా అప్పు అడగగోరు వాని నుండి మొఖం తిప్పేసుకోవద్దు అన్నాడు. అంటే ఎవడైనా అప్పు అడిగితే వెంటనే ఇచ్చేయాలి. ఎవడైనా నిన్ను ఒక మైల్ దూరం రమ్మని అడిగితే రెండు మైళ్లు పోవాలన్నాడు. ఇప్పుడు ఇవి ప్రాక్టికల్ (Practical) గా సంఘంలో సిద్ధాంతముగా మనం బోధించగలమా? అడిగినోనికి నేను కాదని చెప్పను అనే దుకాణం పెట్టుకుంటే.. అనిల్ అంబానీ, ముఖేష్ అంబానీ కూడా ఒక వారం రోజుల్లో చిప్ప పట్టుకోవాల్సి వస్తది.
- 🏛️ పౌలు – నేర్పరి శిల్పకారుడు: అది ఆచరణ సాధ్యం కాదు. అలాగే యేసు ప్రభువు వారి యొక్క బోధనలకు భాష్యం మనం చెప్పుకోవాలి.. అపోస్తలుల బోధనల లేక వారి యొక్క ప్రాక్టికల్ లైఫ్ (Practical life) యొక్క, వారి యొక్క ఆచరించినటువంటి జీవిత విధానం యొక్క కాంతిలో యేసుప్రభువు బోధనలకు మనం భాష్యం చెప్పుకోవాలి. కానీ యేసు మాటలు మాత్రమే మనము డాగ్మటైజ్ (Dogmatize) చేసి సిద్ధాంతీకరించడానికి అవకాశం లేదు. అందుకే పౌలు అన్నాడు – “నేర్పరి శిల్పకారుని వలె నేను పునాది వేసితిని”. గనుక సిద్ధాంత విషయాల్లో పౌలే గీటురాయి, పౌలే ప్రామాణికం. మనకు పౌలు బోధనలే ప్రామాణికం.
- 🚫 సిద్ధాంతం కాదు: ఇప్పుడు ఈ పాద ప్రక్షాళన అనేది పౌలు చేసినట్టు గానీ, చేయమని చెప్పినట్టు గానీ రికార్డు న్యూ టెస్టమెంట్ (New Testament) లో లేదు. గనుక మనకు అది సిద్ధాంతం కాదు. యేసు చెప్పాడు అంటే అలాంటి ఆటిట్యూడ్ (Attitude) కలిగి ఉండమని, అవసరమైతే అంతకైనా తగ్గించుకునే ఆ ఆటిట్యూడ్ కలిగి ఉండమని. ఒకవేళ అక్షరాలే తీసుకున్నాం అనుకోండి.. పై పైకి మాత్రం ఆయన చెప్పాడు గనుక పరిసయ్యుల్లాగా అక్షరం పాటించాలని కాళ్ళు కడగొచ్చు, లోపల వాడిని చంపి పారేసేటంత ద్వేషం ఉండొచ్చు. దానికి ఎవడు జవాబుదారి?
- ✨ ముగింపు: గనుక పైపై చర్యలు మాత్రమే మనము సిద్ధాంతీకరించి వాటిని తప్పకుండా చేయాలి అని విధాయకమని మనం నియమిస్తే.. పై చూపులకు కనబడేటట్టుగా వాళ్ళు కాళ్ళు కడగొచ్చు, లోపల ద్వేషము అసూయ పెట్టుకోవచ్చు. గనుక అవసరమైతే దానికైనా సంతోషంగా ఒప్పుకోగలిగిన సాత్వికము, దీనమనస్సు కలిగి ఉండమని భావం అంతే తప్ప.. మీరందరూ తప్పకుండా కాళ్ళు కడుక్కోమని అక్షరార్థంగా చేయమని కాదు. అలాగ అని ఉంటే గనుక పౌలు చేసేవాడు. పౌలు చేయలేదు, చేయమని రాయలేదు కూడా. గనుక మనకు అది సిద్ధాంతం కాదు. ఓకే.
Detailed English Translation:
❓ Question: Is foot washing a mandatory doctrine for Christians today? Since Jesus washed His disciples’ feet and commanded them to do the same, why is it not practiced in many churches? Some groups are now aggressively promoting this as a necessary ritual. What is the biblical truth?
- The Standard for Doctrine: For any practice to be considered a mandatory doctrine for the Church, there must be a record in the New Testament that the Apostles either practiced it or commanded it in their epistles.
- Interpreting the Words of Jesus: We must understand that not every literal statement of Jesus is a church doctrine. For example, Jesus commanded to give to anyone who asks and to go two miles if asked for one. If these were literal doctrines, even the wealthiest would be bankrupt in a week. These are high moral principles, not organizational mandates. We must interpret the teachings of Jesus through the lens of the Apostles’ practical lives and teachings.
- Paul as the Master Builder: Apostle Paul called himself a “master builder” who laid the foundation. In matters of church doctrine and practice, Paul’s teachings and the records of the early church are our benchmarks.
- Not a Recorded Apostolic Practice: There is no record of Paul or any other Apostle performing ritual foot washing or commanding the churches to do so as a sacrament. Therefore, it is not a doctrine. When Jesus washed feet, He was teaching an ‘attitude’ of humility and servanthood.
- Spirit vs. Letter: Ritualizing such acts often leads to hypocrisy. A person might wash another’s feet while harboring hatred in their heart. God desires a humble spirit and a submissive heart rather than an outward ritual. If it were a required ritual for the church age, Paul would have practiced and prescribed it.
- Conclusion: Foot washing is a lesson in humility, not a ritual requirement. We are called to have the same mind that was in Christ Jesus—a heart of a servant—rather than focusing on the literal act of washing feet. Since it lacks apostolic prescription, it is not a binding doctrine for the Church.
