❓ ప్రశ్న: ప్రభురాత్రి భోజనం పగలు చేయాలా లేక రాత్రి చేయాలా? ప్రతి వారం చేయాలా లేక నెలకొకసారి చేస్తే సరిపోతుందా? దీని గురించి వివరించండి సార్. (0:32:44)
YouTube Link: ఇక్కడ క్లిక్ చేసి వీడియో చూడండి
దైవజనులు Apostle. Ranjith Ophir గారి వివరణ: (2m 16s)
- 🍞 సమయము – ప్రాముఖ్యత: ఇప్పుడు ఇంకో ప్రశ్న ఏమడిగారు – పగలా రాత్రా? ప్రభురాత్రి భోజన రహస్యం.. అది కూడా ప్రభురాత్రి భోజనం ఒకవేళ ఆచరించే సమయము గనుక, ఒకవేళ ఆ సమయం గనుక ఒకవేళ అంత ఇంపార్టెంట్ (Important) అయితే.. ప్రభురాత్రి భోజనాన్ని గూర్చి విపులంగా రాశాడు పౌలు భక్తుడు.
- 📖 పౌలు ఉపదేశం: మీరు ఒకరినొకరు క్షమించుకోవాలి, మిమ్మును మీరు స్వపరీక్ష చేసుకోవాలి, యోగ్యముగా పాల్గొనాలి, ఇది ప్రభువు యొక్క శరీరమని ఎంచాలి, ప్రభువు రక్తమని గ్రహించాలి.. ఇన్ని వివరాలు రాసినవాడు “ఇది రాత్రి కాలమున మాత్రమే పాటించవలెను” అని రాయగలిగేవాడే! కానీ పౌలు ఆ ఆజ్ఞ మనకు రాయలేదు. అందుచేత దానిని మనం డాగ్మటైజ్ (Dogmatize) చేయకూడదు. అనవసరమైనటువంటి ఆ వివాదానికి తెరదీయటమే దాని వల్ల ప్రయోజనం ఉండేది.
- 🚿 ఆత్మీయ స్నానము: ఇకపోతే ఈ నెలకొక్కసారా, వారానికి ఒకసారి అనేది.. నేను “ప్రభురాత్రి భోజన రహస్యం” అనే గ్రంథంలో నేను రాశాను. అందులో ముఖ్యంగా ఏంటంటే దాంట్లో ‘స్నానం’ అనేది ఇన్వాల్వ్ (Involve) అయి ఉన్నది. గనుక స్నానము సంవత్సరానికి ఒకసారి చేస్తాను అంటే దానికి కేసులు పెట్టలేం.. ఇండియన్ పీనల్ కోడ్ (Indian Penal Code) ప్రకారం ఏ దేశంలో కూడా దానికి ఏం చట్టం ఉండదు. కానీ వాడికి ఆరోగ్యం బాగుండదు.
- 🗓️ వారానికోసారి: గనుక స్నానము సాధ్యమైనంత ఆఫన్ (Often) గా చేయాలి, తరచుగా చేయాలి. అలాగే ప్రభురాత్రి భోజనం ఎన్ని సార్లు వీలైతే అంత తీసుకుంటే మంచిది. అయితే మండే, ట్యూస్డే, వెనస్డే (Mon, Tue, Wed) తీసుకోవడానికి వీలు లేదు, అవకాశం ఉన్నంత తరచుగా అంటే ఆదివారం ఒక్కటే సాధ్యము. మధ్యలో తీసుకోవడానికి లేఖనాధారం లేదు మనకు.
- ✨ ముగింపు: అందుచేత ప్రతి ఆదివారం తీసుకోవడం మంచిదని మన సహవాసాల్లో మేము నమ్ముతున్నాము. మరి ఒకవేళ కాదండి “మాకు ఏడాదికో స్నానం చేస్తేనే బాగుంటది” అనుకుంటే.. వాళ్ళ మీద మేము కేసు పెట్టలేము కానీ, న్యాయపీఠం ముందు అంత ఆరోగ్యవంతులుగా కనబడరేమోనని వాళ్ళను మేము ప్రేమతో హెచ్చరిస్తున్నాం. ఓకే.
Detailed English Translation:
❓ Question: Should the Lord’s Supper be taken during the day or at night? Also, should it be observed weekly or monthly? What is the correct biblical practice?
- The Importance of Timing: If the specific time of day (night vs. day) were a mandatory requirement, Apostle Paul would have explicitly mentioned it. In his detailed instructions to the Corinthians, he covered self-examination, worthiness, and the significance of the bread and wine, but he never commanded that it must be held only at night. Making the time of day a rigid doctrine only creates unnecessary controversy.
- The Analogy of Cleansing: In my book, The Mystery of the Lord’s Supper, I compare this sacrament to a spiritual cleansing or ‘bath.’ Legally, no law can force a person to bathe daily, but common sense says that infrequent bathing leads to poor health.
- Weekly Observance: Spiritual cleansing should be frequent. While we don’t have scriptural backing to take it every single day of the week, the first day of the week (Sunday) provides a consistent opportunity. Therefore, we believe in observing it every Sunday.
- Conclusion: Taking the Lord’s Supper monthly or yearly is like bathing infrequently; you remain spiritually ‘unhealthy.’ We encourage weekly participation to maintain spiritual vitality. While we cannot force this upon others, we warn that those who neglect frequent communion may not appear spiritually robust before the Judgment Seat of Christ.
