❓ ప్రశ్న: ఈ మధ్య చర్చ జరిగినటువంటి అంశాలలో కొందరు పాస్టర్స్ క్లారిటీగా చెప్పలేకపోయారు. ఏంటంటే ఆదికాండము మొదటి వచనంలో మొదటి వచనం రెండవ వచనానికి ఉన్నటువంటి మధ్య కాలం ఎంత? అసలు కాలం ఏదైనా ఉన్నదా? ఉంటే ఆ కాలం ఎంత? దానికి ఉన్న వివరణ ఏంటి? దీని గురించి మీ వివరణ కోరుతున్నాం సార్. (0:44:06)
YouTube Link: ఇక్కడ క్లిక్ చేసి వీడియో చూడండి
దైవజనులు Apostle. Ranjith Ophir గారి వివరణ: (4m 24s)
- ⏳ మొదటి రెండు స్టేట్మెంట్లు: ఆదికాండము మొదటి అధ్యాయం మొదటి వచనంలో – “ఆదియందు దేవుడు ఆకాశములను, భూమిని సృజించెను”. ఆ నెక్స్ట్ స్టేట్మెంట్ (Next statement) ఏంటంటే – “భూమి నిరాకారముగా శూన్యముగా ఉండెను”. ఈ రెండు స్టేట్మెంట్లకు మధ్య కొంత కాల వ్యవధి, కొంత విరామము లేక కొంత వ్యవధి అనేది గడిచిపోయింది అనేది వాస్తవం.
- 📖 నివాస యోగ్యమైన సృష్టి: అది ఎలా మనకు తెలుసు అంటే – యెషయా గ్రంథం 45వ అధ్యాయము 18వ వచనంలో ఇలాగు రాయబడి ఉంది. ఏంటంటే “ఆకాశములకు సృష్టికర్త అయిన యెహోవాయే దేవుడు. ఆయన భూమిని కలుగజేసి దాన్ని సిద్ధపరిచి స్థిరపరిచెను. ఆయన నిరాకారముగా ఉండునట్లు దానిని సృజింపలేదు, ఆయన నివాస యోగ్యమగునట్లుగా దానిని సృష్టించెను” అని యెషయా భక్తుడు చెబుతున్నాడు.
- 🌍 క్రియేషన్ vs రిక్రియేషన్: అంటే నివాస యోగ్యమగునట్లుగా ఆయన దానిని సృష్టించి ఉంటే.. ఆ తర్వాత ఒరిజినల్ క్రియేషన్ (Original creation) లో భూమి నివాస యోగ్యంగా ఉన్నది. తర్వాత నిరాకారంగా, శూన్యంగా ఎందుకో మారిపోయింది.. ఆ మధ్యలో ఏదో కొంత చరిత్ర జరిగింది. గోయింగ్ విత్ అవర్ కామన్ సెన్స్ (Going with our common sense) వి అండర్స్టాండ్ (We understand) ఏంటంటే – నివాస యోగ్యము అంటే ఏవో కొన్ని జీవులు నివసించుటకు యోగ్యంగా భూమిని చేశారు. నివసించేవారు ఎవరో ఉండి ఉండాలి.
- 🌊 పునఃస్థితి స్థాపనం: ఎడారిలో ఇల్లు కట్టేసి వచ్చాను అంటే.. “ఎందుకంటే ఊరికే సరదాగా కట్టాను అక్కడ ఎవడు ఉండడు” అని అనే మాట మనిషే చేయడు, అటువంటి వ్యర్థమైన ప్రయాసం మనిషే చేయడు. కనుక దేవుడు నివాస యోగ్యముగా భూమిని చేశాడు అని 18వ వచనం చెప్పింది అంటే నివాసులు ఉండి ఉండాలి. ఆ తర్వాత ఏదో జరిగింది, ఒక ప్రళయం వచ్చింది. దాన్ని మళ్ళీ పునఃస్థితి స్థాపనం కొరకు దేవుడు దిగి రావడమే ఆదికాండం మొదటి అధ్యాయంలో ఉన్నటువంటి విషయం. అది క్రియేషన్ కాదు రిక్రియేషన్ (Re-creation). సృష్టిని పునః సృష్టి చేయటం.
- ✨ ముగింపు: అయితే మధ్యలో గడిచిన కాలం ఎంత అనేది మనకు తెలియదు. బైబిల్ లో ఎంతో కొంత కాలం అయితే గడిచింది, ఎంత అనేది మనకు తెలియదు. బైబిల్ చెప్పని విషయం మనం చెప్పలేము. దేవుడు బైబిల్ లో అన్ని విషయాలు రాయలేదు. మనము రక్షణ పొంది సంపూర్ణులమై పరలోకంలో దేవునితో యుగయుగాలు జీవించడానికి మనకు ఏదైతే తెలియటం అవసరమో అవి మాత్రమే బైబిల్ లో రాయించాడు ఆయన. అన్నీ దేవుడు రాయలేదు, రాస్తే ఆ బుక్ (Book) మనం మోయలేము కూడా. ఓకే.
Detailed English Translation:
❓ Question: What is the time gap between Genesis 1:1 and Genesis 1:2? Many pastors struggle to explain this. Was there a period of time in between, and if so, what happened during that interval?
- The Two Distinct Statements: Genesis 1:1 says God created the heavens and the earth. Genesis 1:2 immediately says the earth was “formless and empty.” Scripture and spiritual logic suggest a significant time gap between these two statements.
- Created to be Inhabited: Isaiah 45:18 clarifies that God did not create the earth to be formless; rather, He formed it to be inhabited. This means the original creation in Genesis 1:1 was perfect, stable, and populated by certain beings.
- From Creation to Re-creation: If the earth was created to be inhabited but later became formless and empty (v2), something catastrophic must have occurred in the interim. God does not perform futile acts, like building a house with no intention of anyone living in it. Therefore, the state described in Genesis 1:2 is a result of a judgment or a ‘flood’ that occurred before the six days of restoration.
- The Process of Restoration: What we see in the rest of Genesis Chapter 1 is not the initial creation out of nothing, but the ‘re-creation’ or restoration of a fallen earth to make it fit for mankind.
- Conclusion: While the Bible confirms a gap exists, it does not specify the exact duration of this period. God has provided all the information necessary for our salvation and spiritual perfection. He did not record every cosmic detail of the past, as the book would be too vast for us to handle. We must speak where the Bible speaks and be silent where it is silent.
