84.Q: The Importance of the Bible vs. the Vedas (KSM 06) ⛪

❓ ప్రశ్న: వేదాలలో ఉన్నటువంటి ఈశ్వరుడు, బైబిల్ లో ఉన్నటువంటి ఈశ్వరుడు ఒక్కడే అని మీరు చెబుతున్నారు కదా! అటువంటప్పుడు బైబిల్ విలువ ఏముంది మరి? అన్ని గ్రంథాలలో ఈశ్వరుడు ఉన్నప్పుడు, బైబిల్ లో ఉన్న ఈశ్వరుడు వేదాలలో కూడా ఉంటే.. ఇప్పుడు రెండు చదువుకోవాలా క్రైస్తవులు? అసలు బైబిల్ యొక్క ప్రత్యేకత ఏమిటి? (0:20:42)

YouTube Link: ఇక్కడ క్లిక్ చేసి వీడియో చూడండి


దైవజనులు Apostle. Ranjith Ophir గారి వివరణ: (2m 38s)

  • 🧐 అవగాహన లోపం: అది చాలా అజ్ఞానముతో కూడుకున్న ప్రశ్న మార్క్ గారు. ఒక విషయం ఏంటంటే – గ్రంథములన్నిటిలో సాక్ష్యం ఉన్నది గాని, చారిత్రికంగా వాస్తవ ప్రపంచంలో, వాస్తవ జగత్తులో.. ఏ ఊర్లో, ఏ పట్టణంలో, ఏ దేశములో, ఏ కాలములో, ఏ ఉజ్జాయింపుగా ఏ కాలఘటంలో, ఏ తారీకున ఆ యజ్ఞము జరిగింది అనేది బైబిల్ మాత్రమే ఖచ్చితంగా మనకు అడ్రస్ చెబుతుంది. ఓకే.
  • 📖 సాక్ష్యం vs చరిత్ర: ఇప్పుడు వేదము చెప్పింది ఏంటంటే – “విరాట్ పురుషుడు అవతరిస్తాడు, ఆయన మరణించి మళ్ళీ లేస్తాడు, ఆయన మరణ పునరుద్ధానముల వల్ల పాప పరిహారం కలుగుతుంది” అనే మాట ఉన్నది అన్నది గానీ.. అది ఎక్కడ జరిగింది? ఎప్పుడు జరిగింది? చరిత్రలో ఎట్లా పట్టుకోవాలి? అనేది మాత్రం అక్కడ మనకు దొరకదు.
  • 🗺️ ఖచ్చితమైన అడ్రస్: బైబిల్ లో మాత్రమే చారిత్రికంగా ఆ యొక్క ఖచ్చితమైన అడ్రస్ మనకు దొరుకుతుంది. గనుక ఇతర గ్రంథములలో చూస్తేనేమో, సనాతన గ్రంథాల్లో “యజ్ఞం ఒకటి జరుగుతుంది, ఆ యజ్ఞము ద్వారా మానవులకు రక్షణ కలుగుతుంది” అనే సమాచారం మాత్రమే దొరుకుతుంది. అయితే ఆ యజ్ఞ పురుషుడు మనకు వాస్తవ జగత్తులో ఎక్కడ, ఎప్పుడు అవతరించాడు, ఎలా జరిగింది.. చరిత్రను మనకు అందుబాటులోకి తీసుకొచ్చే ఏకైక గ్రంథము బైబిల్.
  • ముగింపు: ఇది కూడా వందల సార్లు చెప్పా. ఇంతకుముందు నేను బైబిల్ ఎందుకు నాకు కావాలి అంటే – ఇతర గ్రంథాల్లో ఇలా యజ్ఞం జరుగుతుంది అనే సమాచారం ఉంది కానీ, “జరిగింది ఫలానా చోట, ఈ రీతిగా ఆయనను పట్టుకోండి” అని నా అందుబాటులోకి రక్షకున్ని తెచ్చి నా ముందు నిలబెట్టిన ఏకైక గ్రంథము బైబిల్ గ్రంథం. గనుక వేదము లేకపోయినా బైబిల్ చదివి నేను రక్షణ పొందగలను, కానీ బైబిల్ లేకపోతే ఒట్టి వేదమే చదివితే సాక్ష్యమే దొరుకుతుంది కానీ రక్షకుడు దొరకడు. అందుచేత బైబిల్ దైవ గ్రంథం నాకు ప్రామాణికం. ఓకే.

Detailed English Translation:

❓ Question: If the God mentioned in the Vedas and the Bible is the same, then what is the special value of the Bible? Should Christians read both? Why do we need the Bible specifically if the information is already in other ancient texts?

  • Witness vs. History: This question stems from a misunderstanding. While other ancient scriptures contain a ‘witness’ or prophecy of a divine sacrifice, only the Bible provides the historical ‘address.’ It tells us exactly in which town, country, and time period this sacrifice took place.
  • The Vedas’ Limitation: The Vedas state that the ‘Virat Purusha’ (The Supreme Being) will descend, die, and rise again to provide atonement for sins. However, they do not specify where or when this occurred in history. You cannot ‘find’ the Savior in history using only those texts.
  • The Bible’s Specificity: The Bible brings that spiritual information into the real world. It provides the historical context of Jesus Christ—His birth, His crucifixion, and His resurrection—at a specific geographic location and time. It brings the Savior to our doorstep.
  • Conclusion: You can obtain salvation by reading only the Bible, even without the Vedas, because the Bible points you directly to the Savior. However, reading only the Vedas might give you the information that a Savior is needed, but it won’t lead you to the person of the Savior. That is why the Bible remains my primary and absolute authority.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

సంప్రదించండి

📞 Call 9000083219 💬 WhatsApp

షేర్ చేయండి

WhatsApp Facebook Telegram