84.Q: How to Respond to Those Insulting Christianity on YouTube? (KSM 06) 🐕

❓ ప్రశ్న: YouTubeలో క్రైస్తవ్యాన్ని, దేవుడిని దూషిస్తున్న వారిని మనం ఎలా ఎదుర్కోవాలి? వారి విమర్శల వల్ల క్రైస్తవ్యానికి నష్టం జరుగుతుందా? దీనిపై మీ స్పందన ఏమిటి? (0:23:22)

YouTube Link: ఇక్కడ క్లిక్ చేసి వీడియో చూడండి


దైవజనులు Apostle. Ranjith Ophir గారి వివరణ: (4m 55s)

  • 🐕 పట్టించుకోవద్దు: ప్రారంభము నుండి కూడా క్రైస్తవ్యాన్ని అవమానించి, హేళన చేసి, దూషించి, ద్వేషించి మరి బురద జల్లే కార్యక్రమం చేసినటువంటి ప్రబుద్ధులు చాలామంది ఉన్నారు. నేను అనుకుంటాను.. ఆ కరుణాకరు అనే అతడు, రాధా మనోహర్ అనే అతడు, అసలు వాళ్ళు మనకు ఇష్యూ (Issue) కాదు. వాళ్ళు అలాగ అంటానే ఉంటారు. ఇప్పుడు ఏనుగు రాజమార్గంలో టీవీగా (Dignified) వెళ్ళిపోతున్నప్పుడు అరిసే ప్రాణులు అరుస్తానే ఉంటాయి. కనుక వాళ్ళు అరుస్తున్నారు కదా అని వాళ్ళని ఏం చేయొద్దు, మనం దాని వల్ల యేసుక్రీస్తుకు ఏం నష్టం లేదు, క్రైస్తవ్యానికి నష్టం లేదు.
  • 🚫 విశ్వాసులపై ప్రభావం లేదు: ఇప్పుడు ఈ వ్యతిరేకంగా ఇంటర్నెట్ లో, YouTube లో ఉండి బురద జల్లుతున్నటువంటి ప్రబుద్ధుల మాటలు విని యేసంటే ఇష్టం లేనోళ్ళు చంకలు గుద్దుకుంటున్నారు. ఇదివరకే యేసు అంటే ద్వేషం పెంచుకొని మాకు వద్దు అనుకున్నోళ్ళు సంతోషపడుతున్నారు తప్ప.. ఆల్రెడీ యేసు కొరకు నా జీవితం అంకితం చేస్తాను అనుకున్నోళ్ళు వీళ్ళ మాటలు విని ఒక్కడన్నా బయటికి పోయాడా? ఎవడూ పోడు.
  • 🚗 కుక్కలతో పంచాయితీ: వాళ్ళని అసలు పట్టించుకోకుండా వదిలేయడమే తగిన శాస్తి. ఇప్పుడు మనం కార్లో వెళ్ళిపోతున్నప్పుడు కుక్కలు వెంటబడతాయి. మనం ఆగి దాంతో పంచాయితీ పెట్టుకుంటామా? “ఎందుకే నా వెంటపడుతున్నావు? నిన్ను ఏమన్నా అన్నానా? నీ ఇంటికి వచ్చానా? నీ రూపాయి తిన్నానా? ఏం చేశాను?” అని కుక్కతో మనం పంచాయితీ పెట్టుకోం కదా. కార్లో వెళ్తుంటే కొన్ని కుక్కలకు అది పని, వెంటపడతాయి. ఇక మనం పట్టించుకోకుండా వెళ్ళిపోతే కాసేపు వచ్చి అలసిపోయి వెనక్కి వెళ్ళిపోతాయి.
  • ముగింపు: అలాగున యేసు ప్రభువును గూర్చిన సాక్ష్యము ఈ ప్రపంచంలో నానాటికి ప్రబలుతా ఉన్నది. చైనా వంటి కమ్యూనిస్ట్ దేశంలో కూడా ఇప్పుడు ఫాస్టెస్ట్ గ్రోయింగ్ రిలీజన్ (Fastest growing religion) క్రిస్టియానిటీ. గనుక వీళ్ళేదో చెబితే దాని వల్ల క్రైస్తవ్యానికి ఏం నష్టం లేదు. వాళ్ళని పట్టించుకోకుండా వదిలేయడమే వాళ్ళకి తగిన శాస్తి. ఓకే.

Detailed English Translation:

❓ Question: How should we respond to people on YouTube and social media who insult Christianity? Does their mockery affect the spread of the Gospel?

  • Ignoring the Critics: From the beginning, there have been critics who aim to mock Christianity. They are like dogs barking at an elephant; they cannot stop the journey.
  • No Impact on True Believers: These insults only appeal to those who already hate God. Not a single true believer leaves the faith because of such videos.
  • The Car and the Dog: You don’t stop your car to argue with a barking dog. You keep driving. Similarly, we must continue our mission and ignore the noise.
  • Conclusion: The Gospel is growing globally, even in countries like China. Worldly opposition cannot hinder God’s work.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

సంప్రదించండి

📞 Call 9000083219 💬 WhatsApp

షేర్ చేయండి

WhatsApp Facebook Telegram