85.Q: Do Animals Have a ‘Living Soul’? – Genesis 7:15 (KSM 06) 🌱

❓ ప్రశ్న: ఆదికాండం 7:15 ప్రకారం మృగాలకు కూడా ‘జీవాత్మ’ ఉంటుందా? “జీవాత్మ గల సమస్త శరీరులలో రెండేసి రెండేసి ఓడలో ఉన్న నోవహు వద్దకు ప్రవేశించెను” అని ఉంది కదా! అసలు నరునికి మరియు మృగానికి మధ్య గల ఆత్మీయ వ్యత్యాసం ఏమిటి? (0:27:24)

YouTube Link: ఇక్కడ క్లిక్ చేసి వీడియో చూడండి


దైవజనులు Apostle. Ranjith Ophir గారి వివరణ: (7m 39s)

  • ⚖️ మానవుడు vs మృగము: ఇది చాలా మంచి ప్రశ్న, లేఖనములను పరిశోధించే వారికి కలిగే సందేహం ఇది. యాక్చువల్ గా క్రైస్తవ సిద్ధాంతం ఏంటంటే – మానవజాతికి మాత్రమే, నరునికి మాత్రమే ‘ఆత్మ’ అనేది ఉన్నది. మృగములన్నిటికి ఉండేది శరీరము మరియు ప్రాణము.. ఈ రెండు మాత్రమే. గనుక వాటికి నిత్యత్వంలో ఉనికి ఉండదు. నరుడు మరణించినా ఆత్మ ఉంటుంది గనుక నిత్యత్వం అంతా ఉనికిలో ఉంటాడు. ప్రసంగి గ్రంథము 3వ అధ్యాయము 21వ వచనంలో – “నరుల ఆత్మ పరమునకెక్కిపోవునో లేదో, మృగముల ప్రాణము భూమికి దిగిపోవునో లేదో ఎవరికి తెలియును?” అని ఉంది. నరుని సంగతి నరుడు మరణించినప్పుడేమో ఆత్మ ఉంటుంది పరలోకానికి వెళ్తుందని మన నమ్మకం. ఇక మృగం చచ్చిపోయినప్పుడు ఆత్మ లేదు గనుక ప్రాణమే ఉన్నది అది భూమికి చేరిపోతుంది అనేది నమ్మకం. గనుక నరునికి మూడు భాగాలు శరీరము, ప్రాణము, ఆత్మ కూడా ఉన్నది ఎక్స్ట్రా.. మిగతా ప్రాణికోటి అంతటికీ శరీరము, ప్రాణము మాత్రమే ఉంది.
  • 📖 లేఖనాల్లో జీవాత్మ: మరి ఆదికాండము 7వ అధ్యాయము 15వ వచనములో ‘జీవాత్మ గల సమస్త శరీరులలో రెండేసి రెండేసి ఓడలో ఉన్న నోవహు వద్దకు ప్రవేశించెను’ అని రాయబడింది కదా! ఇది ‘సెల్ఫ్ కాంట్రడిక్షన్’ (Self-contradiction) కదా అనిపించవచ్చు. కానీ అదే అధ్యాయం 22వ వచనంలో క్లారిటీ ఉంది – “పొడి నేల మీద ఉన్న వాటన్నిటిలోనూ నాసికా రంధ్రములలో జీవాత్మ సంబంధమైన ఊపిరి గలవన్నియు చనిపోయెను” అని ఉంది. అంటే ఇక్కడ ‘జీవాత్మ’ అనేది దేవుడు ఊదిన ఆ ‘ఊపిరి’ని బట్టి వాడబడింది.
  • 💨 జీవవాయువు మరియు ఆత్మ: ఆదికాండము 2వ అధ్యాయము 7వ వచనములో దేవుడైన యెహోవా నేలమంటితో నరుని నిర్మించి వాని నాసికా రంధ్రములలో జీవవాయువును ఊదగా నరుడు ‘జీవాత్మ’ ఆయెను. దేవుడు ఊపిరి ఊదినప్పుడే ఆ మట్టికి ప్రాణము వచ్చింది, ఆ ప్రాణము కలిగిన మట్టి దేహం లోపలికి జీవాత్మ కూడా వచ్చింది. అయితే ఆత్మకు మరియు ప్రాణానికి చాలా దగ్గరి సంబంధం ఉంది.. అవి పెట్రోల్ మరియు డీజిల్ లాగా కలిసిపోతాయి.
  • ⚔️ ప్రాణాత్మల విభజన: హెబ్రీ పత్రిక 4వ అధ్యాయము 12వ వచనంలో “ప్రాణమును ఆత్మను విభజించునంత మట్టుకు దేవుని వాక్య ఖడ్గము దూరుతుంది” అని ఉంది. అంటే ఆత్మ, ప్రాణము కలిసిపోయాయి కాబట్టి వాటిని విభజించాల్సిన అవసరం వచ్చింది. అవి ఎంత దగ్గర అంటే, వాటి మధ్యలో ఒక గోడ కట్టి మెయింటైన్ చేయకపోతే మిళితమైపోతాయి. దేవుడు ఊదిన ఊపిరికే నరుడికి ప్రాణము వచ్చింది, ఆత్మ వచ్చింది. కానీ మిగతా జంతువులకు మాత్రం ప్రాణమే ఉన్నది, ఆత్మ రాలేదు అనేది బైబిల్ స్పష్టీకరిస్తుంది.
  • ముగింపు: అక్కడ జీవాత్మ ఉన్నది అని అంటే అర్థం వాటికి చనిపోయిన తర్వాత కూడా కంటిన్యూ అయ్యే ‘స్పిరిట్’ (Spirit) ఉన్నదని కాదు. ఆ జీవవాయువు (Breath of life) ఉండటం వల్ల వాటి ప్రాణములో ఆత్మ యొక్క కొన్ని లక్షణాలు కూడా ఉంటాయి. ఇతర లేఖనాల కాంతిలో చూస్తే.. ధనవంతుడు చనిపోయినాక ఆత్మ వెళ్లి అగ్నిగుండంలో ఉన్నట్టు, లాజరు ఆత్మ వెళ్లి అబ్రహాము రొమ్మున ఉన్నట్టు ఈ జంతువుల ఆత్మలు నిత్యత్వంలో ఉండవు. అందుకే జంతు హత్య పాపం కాదు, కానీ దేవుని స్వరూపంలో ఉన్న నరహత్య మాత్రం పాపం. అది విషయం. ఓకే.

Detailed English Translation:

❓ Question: Genesis 7:15 mentions that animals have a “living soul.” Does this mean animals possess an eternal spirit like humans? What is the actual spiritual difference between man and beast?

  • The Distinction in Nature: Biblical anthropology defines man as a tripartite being (Body, Soul, and Spirit). Animals, however, are bipartite, possessing only a physical body and a “soul” (life-force/breath). Ecclesiastes 3:21 clarifies that the spirit of man ascends, while the life-force of a beast descends into the earth.
  • Understanding “Living Soul”: The reference in Genesis 7:15 to animals as “living souls” is clarified in verse 22 as the “breath of life” in their nostrils. When God breathed into man in Genesis 2:7, man became a living soul with an eternal spirit. For animals, this breath represents biological life but lacks the eternal spiritual component given to mankind.
  • Soul vs. Spirit: The soul (emotions, mind, instincts) and the spirit (the eternal essence) are closely intertwined. Hebrews 4:12 suggests that only the Word of God can discern or divide the soul and spirit. In animals, the soul functions for survival, but they do not possess the eternal spirit required for existence beyond death.
  • Conclusion: Animals do not have a persistent identity in eternity. Their “soul” ceases with their physical life. This is why the Bible does not classify the slaughter of animals for food as a sin, whereas taking a human life is a grave offense against the Creator’s image.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

సంప్రదించండి

📞 Call 9000083219 💬 WhatsApp

షేర్ చేయండి

WhatsApp Facebook Telegram