94.Q: Ministry and Business: Can a Servant of God Do Business? (KSM 06) 💼

❓ ప్రశ్న: దేవుని సేవ చేస్తూ సొంతంగా ఏదైనా వ్యాపారం (Business) చేయవచ్చా? సేవకులకు ఇది అనుమతించబడినదేనా? అపోస్తలుడైన పౌలు గారి మాదిరి ఏమిటి? జహీరాబాద్ నుండి రజియమ్మ గారు ఈ ప్రశ్నను అడుగుతున్నారు. (1:10:40)

YouTube Link: ఇక్కడ క్లిక్ చేసి వీడియో చూడండి


దైవజనులు Apostle. Ranjith Ophir గారి వివరణ: (3m 00s)

  • 💼 వ్యాపారం మరియు సేవ: ఖచ్చితంగా చేయొచ్చు. అపోస్తలుడైన పౌలు చేసింది వ్యాపారమే కదా! పౌలు డేరాలు కుట్టుకున్నాడు అంటే అది వ్యాపారమే. అందుచేత సేవకుడు లేక సేవకురాలు – లింగభేదం ఏదైనా పర్వాలేదు, దైవ సేవ చేస్తూ సంపాదన కొరకు ఏదైనా పని మనం చేసుకోవచ్చు.
  • ⚖️ నైతిక నియమావళి: అయితే మనం చేసే పని చట్ట విరుద్ధమైనది (Illegal) కాకూడదు, సమాజానికి హానికరమైనది ఏదీ చేయొద్దు. ఉదాహరణకు- గంజాయి అమ్మడం గాని, సారా, కల్లు, ఇల్లు, చుట్టలు గిట్లు అమ్మడం గాని.. ఇలాంటి అవినీతికరమైన కార్యక్రమాలు మనం చేయకూడదు. అవి తప్ప, చట్టబద్ధంగా మన మనస్సాక్షికి తప్పు తోచకుండా ఉండేటటువంటి నైతికమైన మంచి వ్యాపారాలు ఏదైనా చేయొచ్చు. అలా సంపాదించి మనం అందులో దశమ భాగం దేవునికి ఇవ్వాలి, సువార్త ప్రకటించాలి. అందులో దోషం లేదు.
  • సంఘం యొక్క దృష్టి: సేవకురాలు వ్యాపారం చేస్తున్నప్పుడు సంఘం ఆమెను ఎలా చూడాలి? పౌలును మనం ‘టెంట్ మేకర్’ (Tent maker) గా చూస్తున్నామా లేక ‘అపోస్తలుడు’గా చూస్తున్నామా? పౌలు డేరాలు కుట్టుకోవడం అనేది ఆయన పొట్టకూటి కొరకు ఆయన చేసుకున్న పర్సనల్ పని. అంతమాత్రాన ఆయనను కేవలం టెంట్ మేకర్ అని ఎవరూ అనరు కదా! ఆయన అపోస్తలుడు, దేవుని సేవకుడు, ప్రవక్త, బోధకుడు.
  • ముగింపు: రొట్టె సంపాదించుకోవడానికి ఏ పనైనా చేయొచ్చు. ఒకడు రిక్షా తొక్కొచ్చు, ఆటో నడుపుకోవచ్చు, టీచర్ ఉద్యోగం లేదా బ్యాంక్ ఉద్యోగం చేస్తూ దేవుని సేవ చేయొచ్చు. వాళ్ళు ఉదర పోషణార్థం చేసే పనిని బట్టి వాళ్ళను తక్కువ చేసి చూడొద్దు. ఎప్పుడైతే వాళ్ళు సువార్త ప్రకటించి సంఘమును ఆత్మీయంగా పెంచుతున్నారో, అప్పుడు మనం వారిని దైవజనులుగానే గౌరవించాలి. డేరాలు కుట్టే పౌలు అని పిలిచే దమ్ము ఎవరికైనా ఉందా? అలా అంటే శాపగ్రస్తులు అయిపోతారు. కనుక సేవ చేస్తూ వ్యాపారం చేయడంలో ఎటువంటి తప్పు లేదు. అది విషయం. ఓకే.

Detailed English Translation:

❓ Question: Is it scripturally permissible for a servant of God to run a business or have a job while in ministry? What was Apostle Paul’s example regarding this?

  • Tent-Making Ministry: Absolutely, it is permissible. Apostle Paul himself was a tent-maker by trade. He worked with his hands to support his ministry and personal needs. Therefore, any servant of God, regardless of gender, can engage in secular work or business.
  • Ethical Standards: The only condition is that the work must be legal and ethical. A believer cannot engage in businesses that harm society, such as selling harmful substances or participating in corruption. Any honest, law-abiding business that doesn’t violate one’s conscience is acceptable.
  • Respecting the Office: A pastor should not be judged by their secular job. Paul was not primarily known as a tent-maker but as an Apostle of Christ. Whether a servant of God is a teacher, a driver, or a businessman, their primary identity in the church is that of a spiritual leader.
  • Conclusion: Working for a living while serving God is honorable. The congregation should respect the spiritual office of the leader regardless of their secular profession. Paul’s example proves that vocational ministry is a valid and dignified way to serve the Lord.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

సంప్రదించండి

📞 Call 9000083219 💬 WhatsApp

షేర్ చేయండి

WhatsApp Facebook Telegram