96.Q: Is it Biblical to Celebrate Puberty Functions? (KSM 06) 💃

❓ ప్రశ్న: ఆడపిల్ల రజస్వల అయినప్పుడు పెళ్లి అనే తంతు లాగానే ఒక పెద్ద వేడుకగా, వైభవంగా ఏర్పాటు చేయడం బైబిల్ సమ్మతమేనా? దీనిపై మీ సలహా ఏమిటి సార్? వైజాగ్ పాడేరు నుండి పిలుపు గారు అడుగుతున్నారు. (1:17:12)

YouTube Link: ఇక్కడ క్లిక్ చేసి వీడియో చూడండి


దైవజనులు Apostle. Ranjith Ophir గారి వివరణ: (3m 50s)

  • 💃 బైబిల్ మరియు సాంప్రదాయం: అది బైబిల్ లో ఎవ్వరూ కూడా చేసినట్టు రాయబడలేదు, చేయండి అని కూడా రాయబడలేదు. అది సామాజికంగా మన దేశ సాంప్రదాయం. అది వ్యక్తిగత అభిప్రాయం. నన్ను అడిగితే నేను మాత్రం ఏమనుకుంటానంటే.. ఆడవాళ్ళ అంటే నాకు చాలా గౌరవం. దట్ ఈజ్ బికాజ్ ఆఫ్ మై మదర్. మా అమ్మ నా మీద వేసిన ముద్ర చాలా బలమైన ముద్ర వేసింది. సో మా అమ్మను బట్టి లోకంలో ఫీమేల్స్ అందరూ కూడా నా మదరే అనుకునేటటువంటి ఆ పిచ్చి పట్టింది నాకు.
  • ⚠️ ఇబ్బందికరమైన పరిస్థితులు: నేనేమనుకుంటానంటే ఆడవాళ్ళకు సహజంగా సిగ్గు ఎక్కువ, షైగా ఉంటారు. ఆ పసిపిల్ల, చిన్నపిల్ల నిన్న మొన్నటి దాకా ఎగిరి దూకి గంతులు వేసి ఆడుకునే పసితనము.. సడన్ గా దేహంలో ఒక మార్పు వచ్చింది. మార్పు అయితే వచ్చింది కానీ సడన్ గా ఈ పసి మనసు వెళ్ళిపోయి ముసలి మనసు వచ్చేది కదా! గనుక ఆ పిల్లకి ఇంకా ఎగరాలి, దూకాలి, ఆడుకోవాలి అనేదే ఉంటుంది. తనలో ఏం జరిగిందో ఆ బిడ్డకు తెలియదు. అలాంటప్పుడు ఆ పిల్లని మనం ఒక సెంటర్ ఆఫ్ అటెన్షన్ అట్రాక్షన్ గా ఊరవాళ్ళందరి దృష్టి ఆ అమ్మాయి మీదకు వచ్చేటట్టు ఒక వేడుక చేస్తే.. ఎదిగి ఎదుగని మగపిల్లలు, ఆకతాయి కుర్రవాళ్ళు ఆ అమ్మాయి మీద అప్పటి నుంచి ఒక చెడు దృష్టి సారిస్తారు.
  • 🛡️ సామాజిక ప్రభావం: “ఈమె ఈ సంబంధాలకు ఇప్పుడు వ్యక్తురాలైంది, యోగురాలైంది, పెద్దోళ్ళ లెక్క ఈమెను ట్రై చేయొచ్చు” అని కొంతమంది దుర్మార్గులు, కొందరు ఇట్లా రకరకాల సమాజం యొక్క దృష్టి ఆ అమ్మాయి మీద ఆ రోజు నుంచి కొత్తగా మారిపోతుంది. ఆ అమ్మాయికేమో తెలీదు పాపం పసి మనసు.. నిన్న మొన్నటి దాకా బానే ఉన్నారు వీళ్ళందరూ, ఇప్పుడు నన్ను ఎందుకో వింత జంతువుని చూసినట్టు చూస్తున్నారు వీళ్ళకి ఏమైంది అని ఆ అమ్మాయి ఆశ్చర్యపోవడం. కనుక ఇదంతా చాలా ఎంబారసింగ్ సిచువేషన్ (Embarrassing situation), చాలా ఇబ్బందికరమైనది.
  • ముగింపు: గనుక అవన్నీ చేయకపోతే మంచిదని నా ఉద్దేశము. కానీ మన దేశంలో అలవాటు అయిపోయింది. చేయకపోతే మంచిది కాదని, అరిష్టం వస్తుందని భ్రమపడుతుంటారు. అరిష్టాలు ఏమీ రావు. మా బంధువుల ఇళ్లల్లో, మా ఇళ్లల్లో అసలు ఈ వేడుకలు మేము ఎరగం. మేము పెంతెకోస్తు ఐపీసి (IPC) లో పుట్టి పెరిగాము.. అరిష్టాలు ఏమీ రాలేదు, ప్రపంచానికి మా కుటుంబాన్ని దేవుడు ఆశీర్వాదకరంగా చేశాడు. కనుక నన్ను సలహా అడిగితే మాత్రం “బెటర్ నాట్ డూ ఇట్” (Better not do it) అంటాను. ఒకవేళ చేయాలనుకున్న వాళ్ళు ఏం చేస్తారు.. తప్పనిసరి అయితే ఆశీర్వదిస్తాం ఏముంది! ఓకే.

Detailed English Translation:

❓ Question: Is it biblically acceptable to celebrate puberty functions (Rajeswala function) with grandeur? What is your advice on this cultural practice?

  • Scriptural vs. Cultural: There is no biblical mandate or example of celebrating puberty. It is purely a social tradition in our country. Personally, I have deep respect for women, a value instilled in me by my mother, and I view all women with that same respect.
  • Psychological Impact on the Child: Girls are naturally modest. A young girl who was playing freely until yesterday suddenly experiences a biological change, but her mind is still innocent. Making her the center of attention in a grand ceremony can be confusing and embarrassing for her.
  • Societal Consequences: Such public celebrations often draw the unnecessary and sometimes predatory attention of young men or ill-intentioned people toward the girl. The girl, in her innocence, doesn’t understand why people are suddenly looking at her differently, which can be traumatizing.
  • Conclusion: My advice is to avoid these functions. There is a superstition that not celebrating brings bad luck, but that is false. In my own family and the IPC tradition I grew up in, we never practiced this, yet God has blessed us immensely. While it is not a “sin” to celebrate if one insists, it is better to avoid it for the sake of the girl’s dignity and modesty.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

సంప్రదించండి

📞 Call 9000083219 💬 WhatsApp

షేర్ చేయండి

WhatsApp Facebook Telegram