95.Q: The Speck and the Beam in the Eye – Matthew 7:3 (KSM 06) 🪵

❓ ప్రశ్న: మత్తయి సువార్త 7:3 ప్రకారం – “నీ కంటిలో ఉన్న దూలమును ఎంచక నీ సహోదరుని కంటిలో ఉన్న నలుసును చూస్తావు ఎందుకు?” అని ఉంది కదా! అసలు కంటిలో దూలం ఉండటం ఏంటి? దీని అంతరార్థం ఏమిటో వివరించండి. నిర్మల్ నుండి మార్క్ గారు ఈ ప్రశ్నను అడుగుతున్నారు. (1:14:08)

YouTube Link: ఇక్కడ క్లిక్ చేసి వీడియో చూడండి


దైవజనులు Apostle. Ranjith Ophir గారి వివరణ: (3m 04s)

  • 🪵 తప్పు యొక్క పరిమాణం: సోదరుడు మార్క్ గారు అడిగిన ప్రశ్న మత్తయి సువార్త ఏడవ అధ్యాయము మొదటి వచనాల్లో యేసుప్రభువు చెప్పిన మాట. “మీరు తీర్పు తీర్చకుడి, అప్పుడు మీకు కూడా తీర్పు తీర్చబడదు” అని చెబుతూ ఈ ఉదాహరణ ఇచ్చారు. ఇక్కడ నలుసు అంటే చాలా చిన్నది, దూలం అంటే అంత పెద్దది. కంట్లో అంత పెద్ద దూలం ఎలా ఉంటుంది? అంటే అది ఆ తప్పు యొక్క పరిమాణాన్ని (Size of the mistake) సూచిస్తోంది.
  • ⚠️ స్వపరీక్ష ఆవశ్యకత: నీలో ఉన్నటువంటి చాలా పెద్ద పెద్ద తప్పులను నీవు పట్టించుకోకుండా, వేరే వాళ్ళ జీవితంలోని చిన్న చిన్న తప్పులను ఎందుకు ఎంచుతున్నావు? అని ప్రభువు ప్రశ్నిస్తున్నారు. మొదట నీ కంట్లో ఉన్న దూలాన్ని తొలగించుకో, అప్పుడు ఎదుటివాని కంట్లోని నలుసును తీసివేయుటకు నీకు తేటగా కనబడుతుంది అని ఉంది.
  • 🛡️ పరిష్కారం: ఎదుటివాని కంట్లో నలుసు ఉన్నది నేను తీసేస్తా, వాడి జీవితంలో ఒక చిన్న తప్పు ఉన్నది నేను సవరిస్తా అని ఎవరైనా పూనుకుంటే.. వాడి కంట్లోనే పెద్ద దూలం ఉన్నప్పుడు వాడు ఆ పనిని సరిగ్గా చేయలేడు. వాడికి అది తేటగా కనబడదు, దాని వల్ల ఎటువంటి ప్రయోజనం ఉండదు.
  • ముగింపు: గనుక ప్రతి విశ్వాసి కూడా తనలోని తప్పులను గూర్చి తీవ్రంగా స్వపరీక్ష (Self-examination) చేసుకోవాలి. తనను తాను తప్పు దిద్దుకొని, తరువాత నీతి మార్గంలో నడిచి.. అప్పుడు ఎదుటివానిలోని తప్పులు ఏమైనా ఉంటే వాటిని ఎత్తి చూపి, సవరించి వారు కూడా సన్మార్గంలో నడవడానికి సహాయం చేయాలి. అది విషయం. ఓకే.

Detailed English Translation:

❓ Question: What is the spiritual meaning behind Matthew 7:3, where Jesus speaks about the speck in a brother’s eye and the beam in one’s own eye?

  • The Scale of Faults: Jesus uses the analogy of a small speck and a large wooden beam (log) to illustrate the scale of human faults. It is physically impossible to have a literal beam in an eye; the Lord is using a metaphor to describe the magnitude of our own sins compared to others’.
  • The Hypocrisy of Judgment: Jesus rebukes those who obsess over the minor flaws (specks) of others while completely ignoring their own massive transgressions (beams). We are warned not to judge others while we ourselves are living in greater disobedience.
  • Clear Vision for Ministry: To help someone remove a “speck” from their life, one must first have clear vision. If you have a “beam” in your own eye, your judgment is clouded, and you cannot effectively lead others to righteousness.
  • Conclusion: The path to helping others begins with rigorous self-examination. A believer must first repent and correct their own major faults. Only then can they see clearly enough to provide humble and effective guidance to a brother or sister in need.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

సంప్రదించండి

📞 Call 9000083219 💬 WhatsApp

షేర్ చేయండి

WhatsApp Facebook Telegram