❓ ప్రశ్న: వేదాలను తృణీకరించిన అంబేద్కర్ గారి మార్గంలో ఉండి, మీరు వేదాలను గౌరవిస్తూ “హైందవ క్రైస్తవం” రాయడం అంబేద్కర్ రైట్ అనిపించుకుంటుందా? మీ మీద సోషల్ మీడియాలో వస్తున్న ఈ ప్రశ్నపై మీ జవాబు ఏంటి సార్? (0:05:46)
YouTube Link: ఇక్కడ క్లిక్ చేసి వీడియో చూడండి
దైవజనులు Apostle. Ranjith Ophir గారి వివరణ: (07m 27s)
- ⚖️ నేను అంబేద్కర్ రైట్ ని: మొట్టమొదటి విషయం ఏంటంటే.. నేను అంబేద్కరైట్. అంబేద్కరిస్ట్ అన్నోళ్ళు ఎవరైనా ఉంటే ఇండియాలో ఫస్ట్ నేనే అని కూడా నేను చెప్పుకుంటున్నాను. అంబేద్కర్ గారేమో వేదములను ప్రామాణికంగా ఎంచలేదు, వాటిని మొత్తమే ఆయన తృణీకరించారు. మరి నేనేమో వేదములు బ్రహ్మ ముఖోద్దిష్టములు, అందులో దేవుని గూర్చిన సాక్ష్యము, మోక్ష మార్గానికి గూర్చిన ఉపదేశం ఉన్నదని ‘హైందవ క్రైస్తవం’ రాశాను. మరి ఇది అంబేద్కరిజం కాదు కదా అనే ప్రశ్న ఉన్నది. నా సమాధానం ఏంటంటే.. డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ గారు మాకు సామాజిక విషయంలో మాత్రమే గురువు, ఆధ్యాత్మిక గురువు ఆయన కాదు.
- 📖 ఆధ్యాత్మికత vs సామాజికం: ఆయన మాకు స్పిరిచువల్ లీడర్ కాదు. మోక్ష మార్గం ఎలా కనుక్కోవాలి అనే విషయంలో ఆధ్యాత్మికంగా మమ్మల్ని మోక్ష పదంలో తీసుకెళ్తాను అని ఆయన ఎప్పుడూ చెప్పలేదు. పైపెచ్చు మీరు క్రైస్తవులు అయిపోండి, ముస్లింలు అయిపోండి, బౌద్ధులు అయిపోండి.. ఏ మతంలోనైనా ఉండండి గానీ మీరు అంటరాని వాళ్ళు అని చెప్పినటువంటి ఆ మతంలో మాత్రం మీరు ఉండొద్దు అని ఆయన ఓపెన్ గా చెప్పారు. “నేను హిందువుగా పుట్టాను ఎందుకంటే అది నా చేతిలో అప్పుడు లేదు.. నేను హిందువుగా మాత్రం చావను, ఇది నా చేతిలో ఉంది” అని ఆయన చెప్పారు. గనుక క్రైస్తవ మతంలోనైనా ఉండొచ్చు అని ఆయన చెప్పారు కాబట్టి నేను ఉన్నాను.
- 🛡️ సువార్త ప్రకటనకు ఆధారం: నేను యేసు ప్రభువు వారిని గూర్చిన సువార్త లోకమంతట చాటించడానికి పూనుకున్నాను. యేసు ప్రభువు వారి ఆజ్ఞ ప్రకారం, ప్రజల అభిమాన పాత్రమైనటువంటి పుణ్య గ్రంథాలను ఆధారంగా తీసుకొని క్రీస్తు సువార్త ప్రకటిస్తున్నాను. భారతదేశంలోని సమాజంలోని హెచ్చుతగ్గులు, వివక్ష నిర్మూలించడం ఎలా? అన్న ఒక్క ప్రిన్సిపుల్ విషయంలోనే మాకు బాబాసాహెబ్ గురువు, మార్గదర్శకుడు. చచ్చిపోయిన తర్వాత ఉండే నరకం ఎలా తప్పించుకోవాలో అది యేసుప్రభువు వారు చెప్తారు.. కానీ బ్రతికుండగానే మనవాదులు ఒక నరకం సృష్టించారు దళితులకు.. ఈ భూమి మీద ఉన్న ఆ నరకం నుండి తప్పించుకోవాలంటే మాత్రం అంబేద్కరిజం ఒక్కటే శరణ్యము.
- ✨ ముగింపు: సమాజాన్ని సంస్కరించడానికి మాకు అంబేద్కర్ గారు గురువు, కానీ మోక్ష సాధన కొరకు మాత్రం మేము క్రీస్తుని నమ్ముకున్నాం. యస్ ఆన్ అంబేద్కరిస్ట్ ఐ కెన్ బి ఏ గుడ్ క్రిస్టియన్ (As an Ambedkarist I can be a good Christian) అండ్ యస్ ఏ గుడ్ క్రిస్టియన్ ఐ కెన్ బి ఆన్ అంబేద్కరిస్ట్ ఆల్సో (As a good Christian I can be an Ambedkarist also). దేన్నైనా వాడుకుంటాను టు బి ఏ గుడ్ క్రిస్టియన్.. నేను ఖురాన్ని, వేదాలను, ఉపనిషత్తులను వాడుకుంటాను. నేను వేదాలను తీసుకున్నా కూడా మళ్ళీ మానవులంతా ఒకటేనని నిరూపించినప్పుడు బాబాసాహెబ్ కూడా ప్రశంసిస్తారు నన్ను. అది విషయం. ఓకే.
Detailed English Translation:
❓ Question: Dr. B.R. Ambedkar rejected the Vedas, yet you honor them in your book “Haindava Kraistavam.” How can you still claim to be an ‘Ambedkarist’? (0:05:46)
- The Distinction of Leadership: I proudly call myself an Ambedkarist. However, it is essential to distinguish between social leadership and spiritual leadership. Dr. B.R. Ambedkar is our guide in social matters and the fight against discrimination, but he never claimed to be a spiritual guru for salvation.
- Freedom of Faith: Ambedkar explicitly stated that people should leave any religion that treats them as untouchables and can join any faith like Christianity, Islam, or Buddhism. Since he gave the liberty to be a Christian, I practice my faith while following his social principles. My spiritual foundation is Christ, while my social foundation is Ambedkarism.
- Using Scriptures for Outreach: My book “Haindava Kraistavam” uses the Vedas not to uphold a caste-based system, but to find common ground for the Gospel. By using familiar scriptures, I aim to show that God’s plan for humanity is universal and equal.
- Conclusion: There is no conflict between being a good Christian and a dedicated Ambedkarist. One addresses the hell created by man on earth (caste discrimination), while the other addresses eternal salvation. I will use any knowledge, including the Vedas or Quran, to prove that all humans are equal in God’s sight.
