❓ ప్రశ్న: అంబేద్కర్ గారు బౌద్ధుడిగా మారారు, కానీ మీరు క్రైస్తవుడిగా ఉండి “నేను మాత్రమే అసలైన అంబేద్కర్ రైట్” అని ఎలా చెప్పుకుంటారు? ఆయన చేసిన దానికి, మీరు చేస్తున్న దానికి వ్యత్యాసం ఉన్నట్టు కనబడుతుంది కదా! దీన్ని మీరు ఎలా సమర్థించుకుంటారు? (0:13:13)
YouTube Link: ఇక్కడ క్లిక్ చేసి వీడియో చూడండి
దైవజనులు Apostle. Ranjith Ophir గారి వివరణ: (04m 22s)
- ☸️ నిజమైన అంబేద్కర్ రైట్ ఎవరు?: అది కూడా చాలా మంచి ప్రశ్న. ఇప్పుడు అంబేద్కర్ గారు మావాడు అని చెప్పి ఏప్రిల్ 14న వారి జయంతి నాడు అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసిన వాళ్ళు.. “మేము మాలలము గనుక మాకు మాల పిల్లనే కావాలి, మాదిగ అబ్బాయి కావాలి” అని కులం ప్రాతిపదిక మీద పెళ్లిళ్లు చేసుకుంటున్న వాళ్ళు ఏ రకంగా అంబేద్కరిస్టులు? మరి అంబేద్కరిజం అనుకున్నోళ్ళందరూ బౌద్ధులా? అందరూ బౌద్ధులు కమ్మన్నాడా ఆయన? అనలేదు కదా! “నేను నాకు ఇష్టమై బౌద్ధ మతంలోకి వెళ్తున్నాను, మీరందరూ బౌద్ధంలోకి రమ్మని నేను చెప్పడం లేదు” అని కూడా అన్నాడు ఆయన.
- ⚖️ కులాన్ని కూలదోయడం: కులం అనే పునాది మీద ఒక నీతిని గాని జాతిని గాని నిర్మించలేమని బాబాసాహెబ్ చెప్పారు. నేను ఆ లెక్కన అసలైన అంబేద్కర్ ఇస్టుని. ఎందుకంటే నేను 350 పైచిలుకు కులాంతర వివాహాలు నా సొంత ఖర్చు మీద చేశాను. ఈ దేశంలో ఎవడైనా ఒక రాజకీయ నాయకుడు గాని, మత నాయకుడు గాని, అంబేద్కర్స్ అన్న ఒక సామాజిక కార్యకర్త గాని.. ఎవరైనా 300 పెళ్లిళ్లు నేను నా సొంత ఖర్చు మీద చేశాను అన్నోడు ఉన్నాడా? నేను చేసినటువంటి ఆ కులాంతర వివాహాలకు అన్నిటికీ నేనే తల్లి తండ్రి అయినంతగా వాళ్ళని చూసుకొని, వాళ్ళ వ్యాపారమా ఉద్యోగమా అన్ని చూసి నిలబెట్టిన వాడిని. ‘డెమాలిష్ దిస్ బ్లడీ కాస్ట్ సిస్టమ్’ (Demolish this bloody caste system) అన్నారు ఆయన.. అది చేసినోడిని మొత్తం భారతదేశంలో నేను ఒకడిని.
- 🚫 ఆచారాల నిర్మూలన: హిందువుల పండుగ చేయవద్దు అని కూడా ఆయన చెప్పాడు. “బుద్ధుడు విష్ణు అవతారం అంటే నేను నమ్మను” అని ఆయన ప్రమాణం చేయించారు. ఇప్పుడు అంబేద్కర్ ఇస్ట్ అన్నోళ్ళ ఇళ్ళల్లో తిరిగి చూడండి.. వాళ్ళు ఎన్ని హిందూ పండుగలు చేస్తున్నారు? మరి వాళ్ళు ఎట్లా అంబేద్కర్ ఇస్టులు? కులాన్ని గౌరవించిన వాడు అంబేద్కర్ ఇష్టా? లేక కులాన్ని కూలగొడతాను అని చెప్పి కోట్లు ఖర్చు పెట్టినవాడు అంబేద్కర్ ఇష్టా? కులాన్ని కూలగొట్టిన వాళ్ళే అసలైన అంబేద్కర్ రైట్స్. నన్ను విమర్శించే వాళ్ళకి నా చరిత్ర తెలియదు, నేను ఏం చేశానో తెలియదు.
- ✨ ముగింపు: నా శిష్యులు లక్షల మంది ఉన్నారు దేశంలో, ఎవరిని అడిగినా చెప్తారు. అంబేద్కర్ గారి ఆశయాలను కేవలం మాటల్లో కాకుండా, చేతల్లో చూపిస్తున్నాను కాబట్టే నేను అసలైన అంబేద్కర్ రైట్ అని ధైర్యంగా చెబుతున్నాను. మీరు ఏ మతంలో ఉన్నా సరే, కులాన్ని వదిలేసి మానవత్వాన్ని చాటినప్పుడే మీరు అంబేద్కర్ గారి వారసులు అవుతారు. అది విషయం. ఓకే.
Detailed English Translation:
❓ Question: Dr. B.R. Ambedkar converted to Buddhism, but you remain a Christian. How can you claim to be a “true Ambedkarist” when your path seems different from his? (0:13:13)
- Actions over Words: Many claim to be Ambedkarists by simply garlanding his statues once a year, yet they strictly follow caste rules when it comes to marriage. How can they be called followers of Ambedkar? Ambedkar himself said he was choosing Buddhism for himself but did not force everyone to do the same.
- Abolishing the Caste System: Ambedkar’s primary goal was to “Annihilate Caste.” I have practically worked towards this by facilitating and funding over 350 inter-caste marriages. I have personally stood as a parent to these couples, ensuring their livelihood and social stability. This is the practical application of Ambedkar’s ideology—destroying the blood-stained caste system.
- Sincerity in Ideology: Ambedkar gave 22 vows, including not following certain rituals and beliefs that promote inequality. Many so-called Ambedkarists still cling to caste-based festivals and identities. A true Ambedkarist is one who breaks the foundations of caste, not one who merely talks about it.
- Conclusion: My identity as a Christian does not hinder my commitment to Ambedkar’s social vision. By eradicating caste within my ministry and supporting equality through action, I uphold the essence of his mission. It is not about the label of religion, but the commitment to human equality and the destruction of discrimination.
