❓ ప్రశ్న: యేసుక్రీస్తు రెండవ రాకడ ఏ విధంగా ఉండబోతుంది? ఆయన మళ్ళీ తల్లి గర్భం ద్వారా జన్మిస్తారా లేక మేఘారూఢుడై వస్తారా? (0:13:40)
YouTube Link: ఇక్కడ క్లిక్ చేసి వీడియో చూడండి
దైవజనులు Apostle. Ranjith Ophir గారి వివరణ: (02m 00s)
- 🛡️ ఏకైక మాతృ గర్భ జననం: మెస్సీయకు (మెస్సీయగా రావడానికి) ఒక మాతృ గర్భంలో పుట్టడం అనేది ఒక్కసారి జరిగిపోయింది. రెండవసారి ఆయన ఏ రీతిగా ఒలీవల కొండ మీద నుండి వెళ్ళాడో, అదే రీతిగా ఒలీవల కొండ మీదకు వస్తాడు. మేఘం మీద వెళ్ళాడు, మేఘం మీద వస్తాడు. ఒక తల్లి గర్భం ద్వారా రాడు ఏసుప్రభు వారు.. లేఖనాలను పరిశోధిస్తే వాస్తవాలు తెలుస్తాయి.
- 🧱 ప్రకటన గ్రంథపు సాక్ష్యం: ఏసుప్రభువు వారు ప్రజలందరూ చూస్తుండగా మేఘాల మీద ఆశీనుడై వస్తాడు. ప్రకటన గ్రంథము మొదటి అధ్యాయము ఏడవ వచనం ప్రకారం – “ఇదిగో ఆయన మేఘారూఢుడై వచ్చుచున్నాడు; ప్రతి నేత్రము ఆయనను చూచును, భూజనులందరూ ఆయనను చూతురు; ఆయనను పొడిచిన వారు (ఇశ్రాయేలు ప్రజలు) కూడా ఆయన వస్తుంటే చూసి రొమ్ము కొట్టుకుందురు” అని లేఖనం ప్రవచించింది. అది యేసు రాకడ.
- ⚖️ అబద్ధపు క్లెయిమ్స్: అంతేకానీ, భూమ్మీద మళ్ళీ ఒక తల్లిదండ్రి ద్వారా పుట్టి.. ఒక మానవులలో మళ్ళీ మానవ జన్మనెత్తి “నేనే క్రీస్తును” అని అనడం అంత హాస్యాస్పదమైన విషయం. అదంతా భ్రమింపజేసే ఒక దురాత్మ. తల్లిదండ్రికి పుట్టినోళ్ళు పురుషులు క్లెయిమ్ చేస్తేనే దానికి దిక్కు లేదు.. ఇప్పుడు ఆడ క్రీస్తుని ఎవరు యాక్సెప్ట్ చేస్తారు? బైబిల్ ఎరగనోళ్ళు, చదవనోళ్ళు, సత్యాసక్తి లేనోళ్ళు మాత్రమే అటువంటి మోసపరిచే ఆత్మల యందు లక్ష్యం ఉంచుతారు.
Detailed English Translation:
❓ Question: How will the Second Coming of Jesus Christ take place? Will He be born again through a human womb or return on the clouds?
- One-time Incarnation: The Messiah’s birth through a mother’s womb was a one-time historical event. For His second coming, He will return exactly as He ascended from the Mount of Olives. He ascended on a cloud, and He will return on a cloud. Lord Jesus will not come through a human womb again; scriptural research reveals this reality clearly.
- Global Visibility: Lord Jesus will return seated upon the clouds while all people watch. According to Revelation 1:7, “Behold, He is coming with clouds, and every eye will see Him, even they who pierced Him (the people of Israel). And all the tribes of the earth will mourn because of Him.” This is the true biblical return of Jesus.
- Rebuttal to Deception: Therefore, the idea of being born again to human parents and claiming “I am Christ” is utterly ridiculous. It is nothing but a deceiving spirit. When even men born of parents cannot validly make such claims, who would accept a ‘female Christ’? Only those who do not know the Bible, haven’t read it, or lack a genuine interest in the truth will pay attention to such deceiving spirits.
