❓ ప్రశ్న: లూకా 9:50 లో చెప్పబడిన అపరిచితుడు (యేసు నామంలో దయ్యాలను వెళ్లగొట్టిన వ్యక్తి) ఎవరు? ఇతర పరిచర్యలను మనం ఎందుకు ఆటంక పరచకూడదు? (1:16:30) 👤📜🔍
YouTube Link: ఇక్కడ క్లిక్ చేసి వీడియో చూడండి
దైవజనులు Apostle. Ranjith Ophir గారి వివరణ: (04m 22s) 🎙️🛡️
- 👤 అపరిచితుడు: అతను ఎవరంటే మనకు బైబిల్ లో అతని వివరం ఇవ్వబడలేదు. శిష్యులకు తెలియని అపరిచితుడు యేసు నామాన్ని ఉపయోగించి దయ్యాలను వెళ్ళగొడుతున్నాడు. ఇతను ఎప్పుడు యేసయ్య పెట్టిన మీటింగ్స్ లో దగ్గర కనబడలేదు. అతడు మనవాడు కాదు గనుక మేము ఆటంకపరిచాము అని శిష్యులు యేసయ్యకు చెప్పారు.
- 🚫 ఆటంక పరచొద్దు: యేసయ్య – “వాడిని ఆటంక పరచొద్దు, మీకు విరోధి కానివాడు మీ పక్షమున ఉన్నవాడే” అని చెప్పాడు. ఇది సార్వత్రిక సంఘానికి 2000 ఏళ్ల పాటు పనికొచ్చే పాఠం. మన డినామినేషన్ కి వస్తేనే వాడు సేవ చేయాలి అని అందరూ అనుకుంటున్నారు. కానీ నా యేసయ్యనే కదా అతను ఘనపరుస్తున్నాడు? వాడు యేసును ప్రకటిస్తున్నప్పుడు నేను ఎందుకు ఆపాలి అనే విశాల హృదయం ఉండాలి.
- ⚡ ప్రభువుకు కనెక్ట్: యేసయ్య సెలవు లేకుండా ఆయన నామంలోని ప్రభావం బయటికి రాదు. స్కెవ కొడుకులు యేసు నామాన్ని వాడితే దయ్యాలు వాళ్ళ మీద పడ్డాయి. కానీ ఇతని ద్వారా కార్యాలు జరుగుతున్నాయి అంటే అతను యేసుప్రభువుకు కనెక్ట్ (Connect) అయ్యాడు అని అర్థం. మనకు తెలియకుండా ఏసుప్రభువుతో కనెక్ట్ అయినోళ్ళు చాలామంది ఉంటారు. ఈ అవగాహన వస్తే మతోన్మాదం పారిపోతుంది.
Detailed English Translation:
❓ Question: Who is the stranger in Luke 9:50 casting out demons? Why shouldn’t we stop other ministries? 👤🚫🤔
- The Unknown Exorcist: The Bible doesn’t name him, but he was successfully using Jesus’ name.
- Christ’s Response: Jesus told the disciples not to stop him. This is a lesson in broadmindedness—if someone glorifies Jesus, don’t stop them even if they aren’t part of your specific group.
- Success Proves Authority: If a person heals or casts out demons in Jesus’ name effectively, it shows they are divinely connected. We should accept all who preach Christ.
