❓ ప్రశ్న: మత్తయి సువార్త 12:32 లో మనుష్య కుమారునికి విరోధముగా మాట్లాడు వానికి పాప క్షమాపణ కలదు గానీ, పరిశుద్ధాత్మకు విరోధంగా మాట్లాడు వానికి ఈ యుగమందైనను రాబోవు యుగమందైనను పాపక్షమాపణ లేదు అని ఉంది. పరిశుద్ధాత్మకు విరోధంగా మాట్లాడటం అంటే ఏమిటి? దానికి పాపక్షమాపణ నిజంగానే ఉండదా? (0:42:30)
YouTube Link: ఇక్కడ క్లిక్ చేసి వీడియో చూడండి
దైవజనులు Apostle. Ranjith Ophir గారి వివరణ: (5m 42s)
- 🔥 నేపథ్యం మరియు బ్యాక్ గ్రౌండ్: ఏ మాటైనా బైబిల్ లో మనకు అర్థం కావాలి అంటే దాని నేపథ్యం ఏంటి, దాని బ్యాక్ గ్రౌండ్ (Background) ఏంటి, కాంటెక్స్ట్ (Context) ఏంటి అనేది మనం చూడాలి. ఏసుప్రభు వారు ఈ మాట ఎప్పుడు చెప్పారంటే – 28 వ వచనంలో “నేను దేవుని ఆత్మ వలన నేను దయ్యములను వెళ్లగొట్టుచున్న యెడల నిశ్చయముగా దేవుని రాజ్యము మీ వద్దకు వచ్చి ఉన్నది” అన్నాడు. అక్కడ ఏసుప్రభు వారు చేస్తున్న అద్భుతాలను చూసి 24 వ వచనంలో పరిసయులు ఏమన్నారంటే – “వీడు దయ్యములకు అధిపతి అయిన బయలుజబులు వలననే దయ్యములను వెళ్లగొట్టుచున్నాడు కానీ మరియొకరి వలన కాదు” అన్నారు.
- 🚫 దైవ కార్యానికి దయ్యం ముద్ర: అంటే వాళ్ళు డాగ్మెటైజ్ (Dogmatize) చేసేసారు, నిర్ధారణ చేసేసి ప్రకటించారు డెఫినెట్ గా యేసుకు దయ్యం పట్టిందని. అద్భుతాలు జరుగుతున్నాయి కానీ దయ్యము యొక్క శక్తి చేతనే జరుగుతున్నాయి, ఇంకోటి కాదు అంటే దేవుడు కావడానికి వీలు లేదని వాళ్ళు వాదిస్తున్నారు. అంటే ఏసుప్రభు ద్వారా కార్యము జరుగుతున్నది, అది చేస్తున్నది ఏమో దేవుడు (పరిశుద్ధాత్మ).. కానీ దేవుడిని వీళ్ళు దయ్యం అంటున్నారు. వాళ్లకు తెలుసో తెలియకుండానో దేవుడినే దయ్యము అని పిలుస్తున్నారు వాళ్ళు. అది చాలా క్షమించరాని నేరము అని యేసుప్రభువు వారు చెబుతున్నారు.
- ⚠️ పెంతెకోస్తు విరోధులు: ఈ పాపము చాలా వరకు బ్రదరన్ (Brethren) సంఘాలు, నాన్ పెంతెకోస్తులు (Non-Pentecostals) చేస్తున్నారు. పెంతెకోస్తులు అన్య భాషలో మాట్లాడుతుంటే – “ఇదంతా సైతాన్ బట్టి మాట్లాడుతున్నాడు, వాడు కరకరమని మాట్లాడుతున్నాడు అర్థం లేదు అర్ధం తెలియదు, ఇదంతా దేవుడు అయితే ఇలాగ మాట్లాడడు, నా దేవుడు అల్లరికి కర్త కాడు” అని చెప్పి పెంతెకోస్తు విరోధులందరూ ఆ పరిసయులు చేసిన పాపమే చేస్తున్నారు. మరి వీళ్ళందరూ నరకానికి వెళ్తారా అనేది సెకండ్ క్వశ్చన్ (Second question).
- ⚖️ మరణకరమైన పాపం vs క్రియల ఫలం: మరణకరము అయిన పాపము ఒకటి, మరణకరము కానీ పాపము ఒకటి. మరణకరమైన పాపము ఒకటి ఏంటంటే – యేసు రక్తమునే తృణీకరించడం. అంటే బాప్తిసం పొందకుండా ఉండటం, యేసు రక్తము నాకు అక్కరలేదు, యేసు రక్తం వేస్ట్ (Waste) అంటాడు చూడండి అది మరణకరమైన పాపం. అయితే విశ్వాసులు తమ దేహముతో జరిగించిన వాటి ఫలమును అది మంచిదైనను సరే చెడ్డదైనను సరే మన క్రియల ఫలం పొందటానికి క్రీస్తు న్యాయ పీఠం ముందు ప్రత్యక్షం కావాలి (2 కొరింథీ 5:10). క్రీస్తు న్యాయ పీఠం ముందు పోయినప్పుడు చెడ్డవి కూడా ఉన్నాయట వీళ్ళలో. అందులో ఒకటి ఇది – అంటే నిత్యత్వంలో మనకు నిత్య నష్టము కలిగించే పాప కార్యాలు ఇవి.
- 🧱 నిత్య నష్టం మరియు పదవుల కోత: వాడు తప్పే చేశాడు, నిత్యత్వం అంతా శిక్ష అనుభవిస్తాడు, నష్టపోతాడు అంటే నరకానికి వెళ్తాడు అని కాదు. వాడు గొప్ప సేవ చేసిన ఒక గొప్ప దైవజనుడు కావచ్చు, అనేక వేల మందికి సువార్త ప్రకటించి ఉండవచ్చు. కానీ అక్కడికి వెళ్ళిన తర్వాత దేవుడు ఉండి – “నువ్వు ఒక గేట్ మన్ (Gate man) లాగా ఉండి పొమ్మని” చెప్తాడు. వాచ్మెన్ లాగా ఉండు, తోటమాలి లాగా ఉండు అంటాడు. అదేంటండీ మా ఊర్లో మామూలు విశ్వాసులు అందరూ కూడా రాజులు అయిపోయారు, నేనేంటి గేటు మన్ ఏంటి అంటే – “నీవు నిత్య పాపము చేసావు బాబు, నిశ్చత్వం అంతా నీవు దండనను అనుభవించవలసిందే. నా రక్తమును ఆశ్రయించినందుకు మహిమలో నివసించే అవకాశం ఇచ్చాను గానీ, నువ్వు నన్నే దయ్యవ అని పిలువు”. ఇది దేవుని తీర్పు.
- ✨ ముగింపు: గనుక పరిశుద్ధాత్మ వరాలను అనవసరంగా దూషించకండి. తెలియకపోతే తెలియనట్లు ఉండండి గానీ మనకే పౌలు కంటే ఎక్కువ తెలిసినట్టు మాట్లాడకండి. మీకు తెలియని సంగతులు ఎన్నో ఉన్నాయి. ఒకవేళ పొరపాటున మాట్లాడినా, పశ్చాత్తాప పడితే దేవుడు తప్పకుండా క్షమిస్తాడు. కానీ అదే సిద్ధాంతంలో చచ్చిపోయారు అనుకోండి, అప్పుడు కూడా క్రీస్తు న్యాయ పీఠం ముందు గద్దింపు ఉంటుంది కానీ అగ్ని గుండంలోకి పంపడం ఉండదు. న్యాయపీఠం ముందుకు వెళ్ళాడు గనుక అక్కడ నుంచి ఇంక పరలోకమే కానీ నరకం ఉండదు.
Detailed English Translation:
❓ Question: Matthew 12:32 mentions that speaking against the Holy Spirit is an unpardonable sin. What is the context of this statement? Does it mean a believer who speaks against the Spirit will go to hell, or is there another spiritual consequence?
- The Historical Context: Jesus spoke this after the Pharisees witnessed Him casting out demons by the Holy Spirit but claimed He did it by Beelzebul (the prince of demons). They were dogmatically attributing the manifest work of God to the power of Satan. Calling the Holy Spirit a demon is a grave offense.
- Modern Warnings: Today, some Christian groups mock the gifts of the Spirit (like speaking in tongues), labeling them as satanic or disorderly. This mirrors the sin of the Pharisees. While this may not result in the loss of salvation (hell), it leads to a permanent loss of eternal rewards.
- Eternal Loss at the Judgment Seat: According to 2 Corinthians 5:10, all believers must stand before the Bema Seat of Christ. While the Blood of Jesus saves them from hell, their earthly deeds are judged. Blaspheming the Spirit results in ‘eternal loss’—where a prominent minister might be saved but assigned a lowly position in heaven, such as a gatekeeper, while simple believers reign as kings.
- Conclusion: Do not mock spiritual mysteries you don’t understand. If a person repents for such words, God is faithful to forgive. However, persisting in such a doctrine until death results in a stern rebuke and loss of heavenly status at Christ’s judgment seat, even though they remain in God’s kingdom.
