❓ ప్రశ్న: ఈనాడు క్రైస్తవులు కూడా రాఖీ పండుగ వచ్చినప్పుడు రాఖీలు కట్టుకొని కనబడుతున్నారు. గనుక క్రైస్తవులు రాఖీలు కట్టుకోవచ్చా? రాఖీ కట్టుకోవడం విగ్రహారాధన కిందకు వస్తుందా? దీనికి మీరిచ్చే జవాబు ఏంటి సార్? (0:14:21)
YouTube Link: ఇక్కడ క్లిక్ చేసి వీడియో చూడండి
దైవజనులు Apostle. Ranjith Ophir గారి వివరణ: (3m 41s)
- 🎗️ సాంఘిక పండుగ: చాలా మంచి ప్రశ్న, అవసరమైన ప్రశ్న. ఆ ప్రశ్న అడిగిన సహోదరుని నేను అభినందిస్తున్నాను. మొట్టమొదటి విషయము – రాఖీ పండుగ మత సంబంధమైనది కాదు. రాఖీ పండుగ ఆధ్యాత్మికమైనది కాదు. అదేదో అలెగ్జాండర్ ద గ్రేట్ దండయాత్ర చేసినప్పుడు, ఆ యుద్ధంలో మరి ఒక వీరుడు ఆయన ఒక ఎదురొచ్చిన ప్రత్యర్థిని చంపబోతూ ఉంటే.. ఆ సమయంలో అతని భార్య అన్నయ్యగా భావించి గుర్తుండడానికి రాఖీ కట్టింది.
- 🤝 అనుబంధం – నిబంధన: ఆమె నా చెల్లెలు గనుక అనుబంధం ఉంది, ఒక నిబంధన చేసింది – “చెల్లెలిని విధవరాలు చేయొద్దు కదా” అని. సరే బ్రతకని పోరా అని పంపించాడు. అన్నా చెల్లెళ్ల అనుబంధం అని ఒక బ్యూటిఫుల్ స్వీట్ సెంటిమెంట్ (Beautiful sweet sentiment). ఈ సృష్టిలో నేను అనుకుంటాను తల్లి తనయులు, తల్లి కూతుర్లు.. అన్ని సెంటిమెంట్ల తర్వాత మధురమైనది అన్నా చెల్లెల అనుబంధం. అది నా వ్యక్తిగత భావన.
- 🏘️ సామాజిక ఆచారం: కనుక అన్నా చెల్లెళ్ల అనుబంధానికి సూచనగా ఆ రాఖీ కట్టడం అనేది సామాజికం, ఇట్స్ ఏ సోషల్ నార్మ్ (It’s a social norm), సాంఘిక ఆచారము. ఇప్పుడు చూడండి జైళ్లలో ఉన్నటువంటి ఖైదీలకు ఆడపిల్లలు వెళ్లి అది కడతారు, వాళ్ళు ఎంత సంతోషిస్తారు! ఆ రాఖీ పండుగ నాడు “మమ్మల్ని అందరూ వెలివేసి దుష్టులు దుర్మార్గులు అనుకొని అందరూ అసహ్యించుకుంటుంటే, ఆడపిల్లలు వచ్చి ఆ టీనేజర్స్ చిన్న చిన్న పిల్లలు వచ్చి అన్నయ్య అని రాఖీ కడితే” వాడు తన వ్యక్తిత్వం అంతా సంస్కరించబడుతుంది. ప్రేమ, అనుబంధం, అనురాగం అనేది వాటి లోపలికి మనం జొప్పించినట్టు అవుతుంది.
- ⚠️ దురుపయోగం: మరి రాఖీ పండుగ అనేది ప్రతిదానికి సదుపయోగం ఉన్నది, తర్వాత మిస్ యూస్ (Miss use) చేసే దురుపయోగము కూడా ఉన్నది. కొంతమంది ఆడపిల్లలు బాయ్‌ఫ్రెండ్ జేబు మొత్తం ఖాళీ చేసిన తర్వాత వానిని వదిలించుకోవాలంటే రాఖీ కడతారు.. అది కూడా ఉంది. వాడిని మొత్తం దులుపుకున్న తర్వాత, వాడి దగ్గర మొత్తం దివాళా తీసిన తర్వాత వీళ్ళ మేకప్‌లకు వీళ్ళ సోపులకు జల్సాలకు వాడిని మొత్తం వాడుకొని.. ఇకా వానికి ఇప్పుడు రిటైర్మెంట్ (Retirement) ఇవ్వాలి ఎట్లాగంటే అన్నయ్య అని చెప్పేసి రాఖీ కడతారు. రాఖీ కడితే రిటైర్మెంట్ అయిపోయింది, మళ్ళా కొత్తవాడిని పెట్టుకో.. ఇటువంటి బద్మాషీలు కూడా ఉన్నాయి.
- ✨ ముగింపు: కానీ బేసికల్లీ (Basically) ఆ రాఖీ అనేది ఒక ఉన్నతమైనటువంటి అన్నా చెల్లెళ్ల సెంటిమెంట్‌కు అదొక ప్రతీక. అది కట్టుకోగానే మనం హిందువులమని ఇంకో దేవుని మొక్కినామని కాదు. ఆ రాఖీ దాని వెనుక ఒక దేవత గానీ దేవుడు గానీ మోక్ష సాధన గానీ భక్తి సూత్రం గానీ ఏమీ లేదు. ఓన్లీ సామాజికమైన ఒక విషయం. కట్టుకున్నా కూడా క్రైస్తవులు అది ఏమి విగ్రహారాధన కాదు, అన్య దేవత ఆరాధన కాదు. అభ్యంతరం అయితే లేదు. ఓకే.
Detailed English Translation:
❓ Question: Nowadays, some Christians are seen wearing Rakhi. Is it permissible for Christians to wear Rakhi? Does it fall under idol worship? What is your response to this?
- A Secular Tradition: This is a good and necessary question. Firstly, Rakhi is not a religious or spiritual festival. Its origins are historical, tied to a sentiment where a queen supposedly sent a thread to Alexander the Great’s enemy to protect her husband, establishing a sibling-like bond.
- Symbol of Sibling Bond: In my personal view, the bond between a brother and sister is one of the sweetest sentiments after parental bonds. Rakhi is a social norm and a cultural practice that celebrates this bond. It is not an act of worship.
- Social Reformation: We see young girls visiting prisons to tie Rakhi to inmates. For those who feel rejected by society, being called ‘brother’ can be a reforming experience, instilling love and affection in their hearts.
- The Negative Side: Like any tradition, Rakhi can be misused. Some may use it as a convenient way to end a romantic relationship after exploiting someone financially. Such behaviors are unfortunate but do not define the essence of the tradition.
- Conclusion: Fundamentally, Rakhi is a symbol of a high sentimental value between siblings. Tying a Rakhi does not mean one is worshipping another deity or following a non-Christian path to salvation. It lacks any religious or devotional core. Therefore, there is no biblical objection to Christians wearing it as a social gesture. It is not idol worship.
