❓ ప్రశ్న: మామూలుగా ఇప్పుడు అందరికీ కూడా యేసు క్రీస్తును గూర్చిన రక్షణ సువార్త అందిస్తున్నారు కదండీ.. దీన్ని బట్టి నమ్మి బాప్తిసం పొంది క్రీస్తునందు ఉన్నవారికి పరలోకము. మరి ప్రభువు రాకముందు, అంటే యేసుప్రభువు అవతరించక ముందు ఉన్న అన్యులకు రక్షణ ఎట్లా? కేవలం ఇశ్రాయేలు యూదులకేనా? అన్యులు రక్షణ పొందాలంటే అప్పుడు ఏం చేయాలి? పూర్వం పాత నిబంధన కాలంలో పరిస్థితి ఏంటి సార్? శ్రీనివాస్ గారు గుంటూరు నుండి అడుగుతున్నారు. (0:18:23)
YouTube Link: ఇక్కడ క్లిక్ చేసి వీడియో చూడండి
దైవజనులు Apostle. Ranjith Ophir గారి వివరణ: (2m 19s)
- 🌍 అవతరణకు ముందు రక్షణ: సంతోషం శ్రీనివాస్ గారు, మీరు నిజమైన అన్వేషకులు ఆలోచన పరులు అని నాకు అర్థమైంది. చాలా మంచి ప్రశ్న అడిగారు. ఈ విషయాన్ని నేను ‘మహిమ ప్రపంచం’ అనే నా గ్రంథంలో ప్రత్యేకంగా రాశానండి. యేసుక్రీస్తు ప్రభువు వారు అవతరించడానికి ముందు ఉన్న వాళ్ళకు కూడా వాళ్ళకు రక్షణ, వాళ్ళ మనస్సాక్షిని బట్టి ఉంటుందని రోమా పత్రిక రెండవ అధ్యాయంలో పౌలు భక్తుడు రాశాడు.
- ⚖️ యూదులు మరియు అన్యులు: గనుక అంతకుముందు ఇశ్రాయేలీయులు మాత్రమే పరలోకానికి వస్తారు, అన్యులందరూ నరకానికి వెళ్తారు అనేది కాదు.. అది చాలా తప్పు. నా గ్రంథాలు మీరు చదవండి, ప్రత్యేకంగా ‘మహిమ ప్రపంచం’ అనే గ్రంథంలో క్రీస్తుకు ముందు ఉండి రక్షణ పొందిన అన్యులు ఉన్నారు, క్రీస్తుకు ముందు ఇశ్రాయేలీయులుగా ఉండి రక్షణ పొందిన వాళ్ళు ఉన్నారు. ఇశ్రాయేలు జనాంగమే లేక ముందు కూడా రక్షణ పొందిన వాళ్ళు అన్యులు ఉన్నారు.
- ✨ రక్త ప్రోక్షణ మరియు విశ్వాసం: గనుక అటువంటిది ఏమి లేదండి. అసలు దేవుడు వీరు వారిని కాదు.. రక్త ప్రోక్షణ ఆచారమును ఆచరించిన వారు, “నా అంతట నేను నా స్వయం కృషి చేత నీతిమంతుడిని కాలేను, దేవుని కృపే నాకు ఆధారము, యజ్ఞమే ఆధారము” అని ఆ విశ్వాసం ఆదాము నుండి ఉందండి. ఆదాము నుండి ఉంది. అందుచేత పాత నిబంధన కాలంలో యూదులు కాని వారు అనేకమంది రక్షణ పొందారు. పరలోకంలో మనం వాళ్ళని కలుసుకుంటాం. ఓకే.
Detailed English Translation:
❓ Question: We are preaching the Gospel of Jesus Christ today for salvation. But what about those who lived before the birth of Christ? Was salvation limited only to the Jews/Israelites? How could Gentiles obtain salvation in the Old Testament times?
- Salvation Through Conscience: This is a very insightful question. I have detailed this in my book, Mahima Prapancham (World of Glory). Apostle Paul explains in Romans 2 that for those who lived before Christ or without the Law, their conscience acts as a witness. Their salvation was determined by how they responded to the light they had.
- Not Limited to Israel: The notion that only Israelites go to heaven and all Gentiles go to hell is biblically incorrect. There were saved Gentiles even before the nation of Israel existed. God is not partial; He looks at the heart.
- The Principle of Sacrifice and Grace: From the time of Adam, the principle of salvation was the same: realizing that one cannot become righteous through self-effort but needs God’s grace and a ‘sacrifice’ (Yajna). Those who put their faith in God’s provision and followed the sacrificial systems revealed to them were saved.
- Conclusion: Many non-Jews from the Old Testament period are in heaven. We will meet them there because they trusted in the grace of God that was eventually fulfilled through Christ. Salvation has always been about faith in God’s mercy, not just national identity.
