❓ ప్రశ్న: ఇప్పుడున్న ఈ అవినీతి సమాజంలో ఒక క్రైస్తవుడి యొక్క ప్రవర్తనా నియమావళి ఎలా ఉండాలి? కొన్ని పనులు కావాలంటే అవినీతి చేయక తప్పడం లేదు కదా! మరి లంచం ఇవ్వడం పాపమా? అలాంటి సందర్భాల్లో క్రైస్తవుడు ఎలా నడుచుకోవాలి? వైజాగ్ నుండి ఒక సహోదరి ఈ ప్రశ్నను అడుగుతున్నారు. (1:21:02)
YouTube Link: ఇక్కడ క్లిక్ చేసి వీడియో చూడండి
దైవజనులు Apostle. Ranjith Ophir గారి వివరణ: (4m 04s)
- ⚖️ లంచం – తీసుకోవడం vs ఇవ్వడం: నేను నమ్మేది ఏంటంటే.. దేవుడు బైబిల్ గ్రంథంలో ఎక్కడ కూడా లంచం ‘పుచ్చుకోవద్దు’ అని రాశాడు తప్ప, ‘ఇవ్వద్దు’ అని రాయలేదు. ఎందుకంటే లంచం ఇవ్వడం అంటే ఉన్న డబ్బును పోగొట్టుకోవడం. ఏ మనిషి కూడా ఇష్టపూర్వకంగా తన డబ్బును పోగొట్టుకోడు. గవర్నమెంట్ ఆఫీస్ లో పని ఉండి నేను వెళ్ళాను అనుకోండి.. నేను బలహీనుడిని, వాడు బలవంతుడు. వాడు తలుచుకుంటే నా ఫైల్ పాస్ చేయగలడు లేకుంటే తీతబుట్టలో పారేయగలడు.
- 🛡️ అత్యాచారంతో పోలిక: నేను అడగలేను, దెబ్బలాడలేను.. కనుక వాడు “నాకు ఇంత ఇవ్వాలి” అంటే అది ఎట్లా ఉంటుందంటే.. బలహీనురాలైన ఒక అమ్మాయి మీద ఒక బలవంతుడు పశుబలంతో మీదపడి అత్యాచారం చేసి మానభంగం చేసినట్టు జరుగుతుంది. అది ఇవ్వటం ఇష్టం లేదు కానీ పని జరగదు. అలాంటప్పుడు “ఎందుకు తీసుకున్నావురా?” అని దేవుడు తీసుకున్న వాడిని దండిస్తాడు తప్ప, ఏడుస్తూ ఏడుస్తూ ఇచ్చినోడిని దేవుడు దండించడు. వాడు అక్కడ అత్యాచారం చేయబడ్డ ఆడపిల్ల పాత్రలో ఉన్నాడు.
- 💼 ఉద్యోగంలో క్రైస్తవుని బాధ్యత: ఒకవేళ క్రైస్తవుడు ఆఫీసర్ గా ఉంటే.. నేను లంచం తీసుకోను అని భీష్మించుకుంటే, తప్పక తీసుకోమని ఎవడు ఒత్తిడి చేయగలడు? పై అధికారి ఒత్తిడి చేస్తే.. “సార్ అదేదో మీరే చూసుకోండి, నన్ను ఇన్వాల్వ్ చేయకండి. ఈ అవినీతి సొమ్ము ఒక్క రూపాయి కూడా నాకు వద్దు” అని మనం కరాఖండిగా చెబితే, బలవంతంగా తెచ్చి జేబులో ఎవరూ కుక్కరు కదా! అవినీతి చేయక తప్పడం లేదు అనేది కరెక్ట్ కాదు. భక్తసింగ్ గారు, పి.ఎం. సమూయేలు గారు సేవ ఆరంభించినప్పుడు కూడా ఇలాంటి చర్చలు వచ్చాయి.
- ✨ ముగింపు: మీ సీట్లో మీరు ఉన్నప్పుడు మీ విధులు మీ ధర్మం ప్రకారం నిర్వర్తించండి. ఒక రూపాయి కూడా పైన తీసుకోవద్దు అని భీష్మించుకోండి. ఆఫీస్ లో మిగతా వాళ్ళు తింటే తిననియ్యండి, వాడు దేవుని తీర్పులోకి వస్తాడు. కానీ మీరు మాత్రం తీసుకోవద్దు. ఇచ్చేవాడి పరిస్థితి వేరు, తీసుకునేవాడి పరిస్థితి వేరు. తీసుకునేవాడు దేవుని దృష్టిలో నేరస్తుడు. అది విషయం. ఓకే.
Detailed English Translation:
❓ Question: How should a Christian behave in a corrupt society? Is giving a bribe a sin when it seems impossible to get work done without it?
- Taking vs. Giving Bribes: The Bible strictly forbids taking bribes, but it doesn’t explicitly categorize the victimized giver in the same way. No one gives money away willingly; it is often an act of desperation to receive a rightful service.
- The Analogy of Victimization: Giving a bribe under compulsion from a powerful official is like a weak person being violated by a powerful aggressor. The giver is often the victim of “systemic rape” of their resources. God judges the one who demands and takes the bribe, not the one who gives it in distress to move a pending file.
- Integrity in the Workplace: If a Christian is in a position of power, they must resolve not to take a single cent of corrupt money. No superior can force you to be corrupt if you stand firm. You should perform your duties with honesty and refuse any part of illicit gains, even if everyone else in the office is doing it.
- Conclusion: While taking a bribe is a grave sin, giving one out of necessity in a corrupt system is seen through the lens of victimization. However, a Christian official should set a standard of absolute integrity, trusting God for their sustenance and protection rather than participating in corruption.
