❓ ప్రశ్న: అసలైన అంబేద్కర్ రైట్ అంటే ఎవరు? తనకి ఉండాల్సిన లక్షణాలు ఏమిటి? ఎట్లా అంబేద్కర్ రైట్ అవుతాడు? అసలు ఒక హిందువుగా ఉండి అంబేద్కర్ రైట్ అవ్వడం సాధ్యమేనా? (0:17:35)
YouTube Link: ఇక్కడ క్లిక్ చేసి వీడియో చూడండి
దైవజనులు Apostle. Ranjith Ophir గారి వివరణ: (02m 49s)
- 📝 అంబేద్కర్ రైట్ లక్షణాలు: ఇప్పుడు ఫండమెంటల్ గా ఇస్లాంలో ఉండి అంబేద్కర్ రైట్ కావచ్చు, క్రిస్టియన్ గా ఉండి అంబేద్కర్ రైట్ కావచ్చు. కానీ ఒక హిందువుగా ఉండి అంబేద్కరిస్టు అవ్వడం అనేది పాసిబుల్ కాదు. ఎందుకు అని అంటే.. అసలు పుట్టుకతోనే అందరూ సమానం కాదు, ఒకడు ఉన్నత స్థితిలో ఉన్నాడు, ఒకడు నీచ స్థితిలో బై బర్త్ (By birth) ఉన్నాడు అని చెప్పేదే కుల వ్యవస్థ. వాడి క్యారెక్టర్ ను బట్టి, వాడు సమాజం కొరకు చేసిన సేవను బట్టి, ప్రవర్తనను బట్టి కాకుండా.. బై బర్త్ వాడు సుపీరియర్, వీడు ఇన్ఫీరియర్ అనేది కుల వ్యవస్థ. కుల వ్యవస్థ లేని హిందూయిజం లేదు, కుల వ్యవస్థ అనేది లేకపోతే హిందుత్వమే లేదు ఇక!
- 🛤️ విరుద్ధమైన వాదం: అంబేద్కర్ యొక్క మౌలిక సిద్ధాంతం ఏంటంటే.. అసలు మనుషులందరూ ఒకటేనని. గనుక మనుషులందరూ ఒకటేనని అంబేద్కరిస్ట్ భావాలు కలిగి ఉండి, మనుషులందరూ ఒకటి కాదు అనే మతంలో ఎట్లా ఉంటారు? అది తాను కూర్చున్న కొమ్మ తానే నరుక్కున్నట్లు, ‘సెల్ఫ్ డిఫీటింగ్ ఆర్గుమెంట్’ (Self-defeating argument) అది. అందుచేత యు కెన్ బి ఏ గుడ్ ముస్లిం అండ్ బి ఆన్ అంబేద్కరిస్ట్ (You can be a good Muslim and be an Ambedkarist), ఎందుకంటే బేసికల్లీ మానవ జాతి ఒకటి అనేదే ముస్లింలు కూడా నమ్ముతున్నారు.
- 🤝 సమానత్వమే ప్రాతిపదిక: అలా నమ్మిన ఇంకేదైనా మతం ఉండొచ్చు, బుద్ధిజం కూడా అలాగే నమ్ముతుంది. సర్వమానవ సమానత్వము, మనుషులందరూ బై బర్త్ ఈక్వలే (By birth equal), కానీ హెచ్చుతగ్గులు లేవు అని నమ్మే ఏ మతంలోనైనా ఉండి అంబేద్కరిస్ట్ గా ఉండొచ్చు. అంతేగానీ ఆ మనుషులందరూ పుట్టుకతోనే ఒకడు ఎక్కువ, ఒకడు తక్కువ ఎందుకంటే ఒకడు దేవుని తలకాయ నుంచి పుట్టాడు, ఒకడు దేవుని కాళ్ళ నుంచి పుట్టాడు అని చెప్పి సిద్ధాంతం కలిగిన మతంలో ఉండి.. ఆ సమాజమంతా ఏకం కావడానికి నేను పోరాడుతాను అనడము తాను కూర్చున్న కొమ్మని తాను నరుక్కున్నట్టే.
- ✨ ముగింపు: సో నో ప్రాబ్లం.. ఐ కెన్ బి ఏ గుడ్ క్రిస్టియన్ (I can be a good Christian) అండ్ వర్క్ ఫర్ ద ఈక్వల్ జస్టిస్ ఫర్ ఎవరీవన్ (Work for equal justice for everyone) ఇన్ ద సోషల్ సొసైటీ. ఎందుకంటే ఆదాము నుంచి అందరు మనుషులు వచ్చారని మేము నమ్ముతాం. అలా నమ్మిన వాళ్ళు ఎవరైనా అంబేద్కర్ భావజాలం కొరకు ఫైట్ చేయవచ్చు, ఇబ్బంది లేదు. ఆయన ఏమి మతంలో ఉండమని చెప్పలేదు, ఆ వివక్ష ఉన్న మతం ఒక్కటే వద్దు అన్నాడు అంతే. అది విషయం. ఓకే.
Detailed English Translation:
❓ Question: Who is a true Ambedkarite and what are their qualities? Is it possible for a person to remain a Hindu and still be a true follower of Ambedkar? (0:17:35)
- The Core Conflict: Fundamental Ambedkarism is built on the foundation of human equality. Hinduism, however, is traditionally intertwined with the caste system (Varna system), which posits that humans are born unequal—some superior and some inferior—based on their birth origin (e.g., from the head or feet of the Divine).
- Self-Defeating Logic: To claim to follow Ambedkar (who sought the annihilation of caste) while staying within a religious structure that justifies caste by birth is a self-defeating argument. It is like cutting the branch you are sitting on. You cannot fight for absolute equality while adhering to a doctrine of inherent inequality.
- Compatibility with Other Faiths: A person can be a good Muslim, Christian, or Buddhist and still be a true Ambedkarite. This is because these faiths fundamentally believe that all humans share a single origin (like Adam and Eve) and are born equal. These religions provide a theological basis for the social justice that Ambedkar championed.
- Conclusion: Ambedkar did not mandate a specific religion for everyone, but he strictly rejected any system that promotes discrimination and birth-based hierarchy. Therefore, anyone who believes in the absolute equality of all human beings can be an Ambedkarite, provided their faith does not contradict that very equality.
