❓ ప్రశ్న: “మేలాయెను ప్రభు శ్రమనొందుట” మరియు “నీ వాక్యమే శ్రమకొలిమిలో” పాటలు ఏ సందర్భంలో రాశారు? (0:44:04)
YouTube Link: ఇక్కడ క్లిక్ చేసి వీడియో చూడండి
దైవజనులు Apostle. Ranjith Ophir గారి వివరణ: (12m 15s)
- 🎵 మేలాయెను ప్రభు – తొలి శ్రమల అనుభవం: ఈ పాట సందర్భము అంటే.. చాలామంది అనుకునేది ఏంటంటే కుటుంబం కుప్పగూలిపోయినప్పుడు అయ్యగారు ఒంటరి అయిపోయి ఈ పాట రాసి ఉంటారని, కానీ అది తప్పు. “మేలాయెను ప్రభు” అనే పాట రాసినప్పుడు నాకు అసలు పెళ్లే కాలేదు, నేను బ్రహ్మచారిని. అప్పుడు కూడా శ్రమలు వచ్చినాయి, శ్రమ పడడానికి భార్య అక్కర్లేదు. ఆ రోజుల్లో కొంతమంది దైవజనులు కూడా నా మీద విషపు చూపు నిలిపి విమర్శలు, నిందారోపణలు చేశారు. నేను దేవుణ్ణి అడిగాను, “నన్ను ఎందుకు ఇన్ని బాధలు పెట్టావు?” అని. అప్పుడు దేవుడు నాతో మాట్లాడి, “ఈ శ్రమలన్నీ రాకముందు నీలో ఉన్న పరిశుద్ధత ఎంత? ఈ శ్రమలు గడిచిపోయాక నీ పరిశుద్ధత మట్టం ఎంత ఉందో చూసుకో” అన్నాడు. అప్పుడు నాకు అర్థమైంది.. శ్రమల ద్వారానే నాలో పాపం అంటే భయం పుట్టింది. అందుకే “ప్రతి గాయము పరిశుద్ధత పెంచెను” అని ఆ పాట రాశాను.
- 🔥 నీ వాక్యమే – మరణపు అంచులలో: “నీ వాక్యమే శ్రమకొలిమిలో” అనే పాట రాసేటప్పటికి నాకు పెళ్లయింది, నా భార్య నాకు దూరమై ఒంటరి జీవితం గడుపుతున్నాను. అప్పుడు ఒక భయంకరమైన పెను శోధన వచ్చింది. “నేను ఇక దేవుని సేవకు పనికిరానేమో, భార్యను మార్చుకోలేనోడు దేశానికేం బోధ చేస్తాడని జనం అంటున్నారు కదా” అని కృంగిపోయాను. ఒకసారి ఇల్లందుకు బస్సులో వెళ్తున్నప్పుడు, “ఈ బస్సు నుంచి దిగేది నేను కాదు, నా శవమే దిగుతుంది” అనుకున్నంత వేదన పడ్డాను. కానీ ఇల్లందు వెళ్ళాక ఒక భక్తుని ఇంట్లో మోకరించి కన్నీటితో ప్రార్థన చేసినప్పుడు, దేవుని వాక్యం నన్ను బ్రతికించింది. “నీ వాక్యమే నన్ను బ్రతికించెను” అని అప్పుడు ఆ పాట రాశాను.
- ✨ పాటల ప్రభావం – సాక్ష్యాలు: ఈ పాటలు కేవలం నన్ను మాత్రమే కాదు, ఎంతోమందిని బ్రతికించాయి. అనంతపూర్‌లో హెబ్రోన్ సహవాసానికి చెందిన పెద్ద దైవజనులు పాస్టర్ ఎలీషా గారు (దేవునికి స్తోత్రము గానము చేయుట మంచిది పాట రచయిత) నాతో అన్నారు, “నాయనా, మేలాయెను ప్రభు అనే నీ పాట నన్ను బ్రతికించింది” అని. అలాగే సీయోను గీతాల రచయిత బి.జె. పాల్ గారు కూడా “నేను చనిపోతానేమో అనుకున్నప్పుడు నీ పాట నన్ను ఆదుకుంది” అని చెప్పారు. నా పాటలను వాడుకొని బాధితులను బ్రతికించింది ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మ దేవుడే. ప్రతి పాట వెనుక ఒక చిన్న గ్రంథమంత చరిత్ర ఉంది. అది విషయం. ఓకే.
Detailed English Translation:
❓ Question: In what context were the songs ‘Melayenu Prabhu Shramanonduta’ and ‘Nee Vakyame Shramakolimilo’ written? (0:44:04)
- Context of ‘Melayenu Prabhu’: Contrary to popular belief, this song was written before Apostle Ranjith Ophir’s marriage. Facing severe criticism and false accusations from contemporary ministers, he questioned God about his suffering. God revealed to him that these trials were refining his holiness. Realizing that his fear of sin increased through pain, he penned the words, “Every wound increased my holiness”.
- Context of ‘Nee Vakyame’: This song was born out of a much deeper crisis after his marriage failed and he was living alone. Feeling disqualified for ministry and burdened by public judgment, he felt like a ‘living corpse’ while traveling to Yellandu. However, in a moment of intense prayer, God’s Word revived his spirit. He realized that man’s certification doesn’t matter as long as God’s grace is present.
- Impact of the Songs: These songs have saved many lives, including renowned hymn writers like Pastor Elisha and B.J. Paul, who testified that these lyrics gave them hope during their darkest hours. The songs continue to be a source of strength for many in the Christian community.
