10.Q: Fundamental Right to Freedom of Religion (KSM 01) 🗳️

🗳️ ప్రశ్న: భారత రాజ్యాంగం కల్పించిన ప్రాథమిక హక్కులలో ఒకటైన “మత స్వాతంత్రపు హక్కు” గురించి క్లుప్తంగా వివరించండి. మతము అనేది వచ్చేసరికి ఇంత సెన్సిటివ్ ఇష్యూగా ఎందుకు మారుతున్నదో అగోచరమైన విషయం? (1:01:54)

YouTube Link: ఇక్కడ క్లిక్ చేసి వీడియో చూడండి


దైవజనులు Apostle. Ranjith Ophir గారి వివరణ: (5m 46s)

  • 🧼 వైవిధ్యం – ఒక పోలిక: మతము అనేది వచ్చేసరికి ఇంత సెన్సిటివ్ ఇష్యూగా (Sensitive issue) ఎందుకు మారుతున్నదో అగోచరమైన విషయం. ఇప్పుడు సబ్బు స్వాతంత్ర్యము అనేది ఏమైనా మన రాజ్యాంగంలో ఉందా? లేదు. సబ్బు స్వాతంత్ర్యము, ఆ వాలిషింగ్ క్రీము స్వాతంత్ర్యము అనేది లేదు. వస్త్రధారణ స్వాతంత్ర్యం అనేది మెన్షన్ చేయబడలేదు. పంచకట్టు కట్టుకునే వాళ్ళు కట్టుకుంటారు, ప్యాంట్లు వేసుకుంటే వేసుకుంటారు. లేకపోతే ఆ వాళ్ళు ఎవరి ఇష్టం వచ్చినటువంటి వస్త్రధారణలు వాళ్ళు ధరించుకుంటారు. ఆడవాళ్ళు కూడా చీరలు, చూడీదార్ పైజామాలు వాళ్ళకి ఇష్టమైంది. అలాగే సబ్బు – హమాం సబ్బు, లిరిల్ సబ్బు, లక్స్ గాని, సంతూర్ గాని ఏదో ఒకటి మెడిమిక్స్.. ఏదో ఒకటి వాడుకుంటారు. అంటే మార్కెట్ లో వెరైటీ ఉంది. ఆహారము – శాకాహారము, మాంసాహారము. మాంసాహారంలో మళ్ళీ వేరు వేరు, శాకాహారంలో రకరకాలు. ఇప్పుడు ఇన్ని రకాల వైవిధ్యం, వెరైటీ మనకి ఏది నచ్చితే అది చేసుకోవచ్చు అనేది మన జీవితంలో అన్ని రంగాల్లోనూ ఉంది. ఏ సబ్బైనా వాడతాము, ఏ బట్టలైనా కట్టుకుంటాం, ఏ తిండి అయినా తింటాము.
  • 🧠 వ్యక్తిగత విశ్వాసం: అలాగే నాకు నచ్చింది ఏదో నేను నమ్ముతాను. మతం అనేది నా తలకాయలోనే విశ్వాసం. అది దేశానికి ఒక సమస్య కాదు, సమాజానికి ఒక సమస్య కాదు. నేను అల్లా దేవుడు అని అనుకున్నాను అనుకోండి, సొసైటీకి ఏం ప్రాబ్లం లేదు. యేసయ్య దేవుడు అనుకున్నాను అనుకోండి, ఎవడికి ఏం సమస్య లేదు. వాళ్ళ ఇంట్లో అన్నం వండరు కదా? తింటే అరగదా? నేనేదో నమ్మినందుకు అలాగ ఏమీ లేదు. కృష్ణుడు, రాముడు అని అనుకున్నాను వాడికే నొప్పి. కనుక ఈ మతమును గూర్చి మాట్లాడడమే ఒక స్టూపిడిటీ (Stupidity), బుద్ధిహీనత, మూర్ఖత్వము.
  • ⚖️ నిరూపించలేని సత్యం: ఏ మనిషికైనా ఏ మతాన్నైనా నమ్మే అధికారము ఉండాలి. ఎందుకు అంటే ఒక విషయం చెప్తున్నాను – ఇప్పుడు ఫలానా సబ్బు మంచిది కాదు, ఫలానా సబ్బు మంచిది, ఇది వాడితే చర్మానికి హాని, ఇది వాడితే మంచిది అని ల్యాబ్ లో నిరూపించే అవకాశం ఒకవేళ ఉండొచ్చు. కానీ అల్లామియాను, యేసయ్యను, రాముడిని, కృష్ణుడిని, అయ్యప్పను తీసుకెళ్లి ల్యాబ్ లో పెట్టి ఏ దేవుడు హానికరము, ఏ దేవుడు ప్రయోజనకరమని నిరూపించే అవకాశం లేదు. అసలు ఎవరు చూశారు? ఏ దేవుడిని చూపిస్తారా? నేను యేసుని చూపించలేను, వాళ్ళు అల్లాని చూపించలేరు, వీళ్ళు రాముణ్ని చూపించలేరు. వాళ్ళ హృదయంలో విశ్వాసము. గనుక ఇదిగో నేను నమ్మిన దేవుడే రైటు అని నేను ల్యాబ్ లో నిరూపించలేను గనుక, అతడు ఏది నమ్మినా నేను దాన్ని అబ్జెక్షన్ చేసే అధికారం నాకు లేదు.
  • 🤝 మతాన్ని మించిన మానవత్వం: అయితే నాకు ఇలాగ తోస్తుంది బాబు, మోక్షానికి ఇది కరెక్ట్ మార్గం అని నాకు అనిపించింది, ఆలోచించుకో అని చెప్పడం కూడా నా విధి, నా ధర్మం. వాళ్ళు చెప్పింది వినడం నా విధి, నా ధర్మము. అలా చెప్పేటప్పుడు “అన్నయ్య నాకు ఇలాగ అనిపిస్తుంది, ఇది ఎక్కువ రీజనబుల్ (Reasonable) వే లాగా ఉన్నది, ఆలోచించు అన్నయ్య” అని చెప్పి చెప్పినాక అతడు విన్నా, వినకపోయినా ఇంకా అన్నయ్య అనే అనుబంధమే కొనసాగాలి. నా మతాన్ని అంగీకరిస్తేనే అన్న లేక తమ్ముడు, లేకపోతే వాడిని చంపేయాలి అనేది ఉన్మాదం. ఇప్పుడు రిలీజియన్ ఈజ్ నాట్ బ్యాడ్, ఫెనాటిసిజం ఈజ్ డేంజరస్ (Religion is not bad, fanaticism is dangerous). మతం అనేది ఏ మతమైనా మంచే చెబుతుంది, తోటి మానవుడిని ప్రేమించమని చెప్తుంది కానీ చంపమని చెప్పదు. కానీ మతోన్మాదం అనే దానికి విరోధంగా మనం పోరాడాలి.
  • 🏠 వ్యక్తిగత సాక్ష్యం: ఇప్పుడు నేను నా బంధువుల్లో మా మేనత్త గారు ఒక ముస్లింని పెళ్లి చేసుకుంది. నా కోడలు కూడా ఒక ముస్లిం, నా కూతురులాగా చూసుకుంటాను. నేను ఎందుకు ద్వేషించాలి? ఐ యామ్ ఏ ప్రాక్టికల్ పర్సన్ (I am a practical person). నేను చెప్పేది ఆచరించి చేస్తున్నా. నా బంధువుల్లో దగ్గర బంధువుల్లో హిందువులు ఉన్నారు, ముస్లింలు ఉన్నారు, వాళ్ళని సమానంగా ప్రేమిస్తాం. సందర్భం వచ్చినప్పుడు చెప్తాం – “బాబు ఇది కరెక్ట్ మార్గం అని అనుకుంటున్నాను అని నువ్వు ఆలోచించుకో, నీకు కూడా సబబు తోస్తే నమ్ము లేకపోతే నమ్మబాకు”. నువ్వు వదిలేసినా, నమ్మినా నమ్మకపోయినా ద సేమ్ రిలేషన్ షిప్ (The same relationship). మతం అనేది వ్యక్తిగతము. అది దేశ సమస్య కాదు. దేశానికి ఉన్న సమస్య గతుకుల రోడ్లు, డ్రైనేజీ, తాగే నీళ్లు లేవు, సాగునీరు లేదు, అవినీతి, లంచగొండితనం, వాతావరణ కాలుష్యం, నిరుద్యోగ సమస్య, నేరాలు పెరిగిపోతున్నాయి – ఇది దేశ సమస్య. నా తలకాయలో నమ్మకం ఎవడికీ సమస్య కాదు. అది సమస్య అనుకున్నవాడే దేశానికి ఒక పెద్ద సమస్య, ముందు వాడిని జైల్లో వేయాలి అసలు.

Detailed English Translation:

🗳️ Question: Can you briefly explain the “Right to Freedom of Religion” provided by the Indian Constitution as one of the fundamental rights? Why has religion become such a sensitive and controversial issue today?

  • A Choice Like Any Other: We don’t have a “Right to Soap” or a “Right to Fashion” explicitly listed because society accepts personal choice in those areas without conflict. Whether you choose a certain brand of soap, dress in a specific way, or eat vegetarian or non-vegetarian food, it is considered a personal preference. Religion should be viewed the same way—as a personal belief held within one’s mind.
  • The Irrationality of Religious Conflict: My belief in Jesus, or someone else’s belief in Allah or Rama, doesn’t hinder another’s daily life. It doesn’t stop them from cooking or digesting their food. Making religion a public issue of conflict is a mark of stupidity. Since no laboratory can ‘prove’ which deity is superior or harmful, we have no right to object to another’s faith.
  • Faith vs. Fanaticism: It is my duty to share what I believe is the path to salvation, and it is my duty to listen when others share their views. However, the relationship—be it as brothers or neighbors—should remain intact regardless of whether the message is accepted. Religion is not bad; fanaticism is. Faith teaches love; fanaticism teaches hatred.
  • Practical Humanity: In my own family, I have relatives who are Hindu and Muslim. I love them equally. My daughter-in-law is from a Muslim background, and I treat her as my own daughter. I share my faith reasonably, but the relationship doesn’t depend on conversion.
  • The Real Issues: Religion is a personal matter, not a national crisis. India’s real problems are broken roads, poor drainage, lack of clean water, corruption, pollution, and unemployment. A person’s internal belief system is not a threat to anyone. Those who try to turn personal faith into a national problem are the real enemies of the state and should be dealt with legally.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

సంప్రదించండి

📞 Call 9000083219 💬 WhatsApp

షేర్ చేయండి

WhatsApp Facebook Telegram