9.Q: Inherited Iniquity vs. New Covenant Grace (KSM 01) ⛓️

⛓️ ప్రశ్న: అయ్యగారు, పాత నిబంధనలో “తండ్రుల దోషం కుమారుల మీద మోపుట” అనేది ఉంది. అలా ఎందుకు? దానిలో ఉన్న న్యాయం ఏంటి? కొత్త నిబంధనలో దాన్ని బట్టి చెప్పే పాఠం ఏమిటి? ప్లీజ్ ఆన్సర్ చేయండి అని చెప్పేసి మెసేజ్ పెట్టారు అయ్యగారు. దీనికి ఆన్సర్ చెప్పండి. (0:57:21)

YouTube Link: ఇక్కడ క్లిక్ చేసి వీడియో చూడండి


దైవజనులు Apostle. Ranjith Ophir గారి వివరణ: (4m 43s)

  • ⛓️ వారసత్వ దోషం: పాత నిబంధన కాలములో దేవుడు తండ్రుల దోషము కుమారుల మీదకి రప్పిస్తాను అన్నాడు. అసలు దోషం అనేది వచ్చిందే ఇంకెవడి కారణంగానో వచ్చిందే కదా! ఇప్పుడు ఒక పర్టికులర్ ఫ్యామిలీలో (Particular family) ఒక తాతగారు ఏమో తప్పు చేశాడు, ఆయన కొడుకు, మనవలు, మునిమనవలు ఆ శాపం మోస్తారు అంటే ఇది అన్యాయం అంటున్నాను. అసలు ఆదాము అనే అసలు తాత చేసిన తప్పుకే కదా ఈ దోషమైనా వచ్చింది. ఆదాము ఏదెను తోటలో తప్పు చేసి ఉండకపోతే ఈ ముత్తాత గారు కూడా చేయలేడు కదా! గనుక విషయం ఏంటంటే – వారసత్వంగా పాపము, శాపం వస్తా ఉండింది. అది తండ్రులు, తాతలది కావచ్చు లేకపోతే ఆదాము హవ్వలది కావచ్చు.
  • ✝️ సిలువలో మార్పు: అయితే యేసు ప్రభువు వారు సిలువలో యజ్ఞముగా మరణించి, ఆయన సిలువ రక్తమును కార్చి, పరిశుద్ధ దైవ రక్తాన్ని కార్చి చచ్చిపోయి, మళ్ళీ మూడవ నాడు మహిమతో లేచినప్పుడు ఈ సాంప్రదాయము అనేది భగ్నం అయిపోయింది. ఈ పద్ధతి లేదు ఇక. ఇక వాళ్ళు ఈ శాపగ్రస్తమైన ఆదాము జాతిలో పుట్టిన వాళ్ళు ఎప్పుడైతే వాళ్ళు నీటి బాప్తిస్మం పొందారో, చచ్చిన వాళ్ళ కింద లెక్క. అంటే ఆదాము కడుపున పుట్టిన ఆ పాపాత్ముడు అన్నవాడు గతించిన హిస్టరీ (History). వాడు లేడు ఇంకా, ఆ శాల్తీ లేదు. చచ్చిపోయాడు, సమాధి అయిపోయింది. ఇప్పుడు ఉన్నవాడు అదే మొహంతో ఉన్నాడు కానీ, వీడు కొత్త మనిషి, నూతన సృష్టి.
  • నూతన వారసత్వం: ఇతడు ఆదాము పాపానికి వారసుడు కాదు, యేసు పరిశుద్ధతకు వారసుడు. ఆదాము పాపము ఎంత అప్రయత్నంగా వీడి ప్రమేయం లేకుండా వీడి మీదకి వచ్చిందో, యేసు నీతి, యేసు పరిశుద్ధత కూడా అలాగే అప్రయత్నంగా వీడి ప్రమేయం లేకుండా వచ్చేస్తుంది. గనుక కొత్త నిబంధనలో కూడా కొంతమంది బోధకులు కొన్నిసార్లు మనం చేసేది కలిసి రానప్పుడు – మన పిల్లలకు పెళ్లిళ్లు కావట్లేదు, మనకు ఆరోగ్యం బాగుండట్లేదు, వ్యాపారం కలిసి రావట్లేదు – అలాంటప్పుడు తండ్రుల తాతల శాపం నీ మీద ఉందని బెదిరించే బోధలు కొత్త నిబంధనలో కూడా కొంతమంది ఇటీవల కాలంలో చేస్తున్నారు.
  • 🛡️ తెంపివేయబడిన శాపం: అది కేవలము లేఖనాలకు వ్యతిరేకం. యేసు సిలువ యజ్ఞము జరిగిన తర్వాత ఎవరూ కూడా తండ్రుల దోషాన్ని మోయరు. రక్షణ పొందని వాళ్ళందరూ కూడా ఆదాము దోషం కిందనే ఉన్నారు. మారుమనస్సు పొంది నీటిలో ముంచబడటం (బాప్తిస్మము) పొందిన వాళ్ళు, సువార్త నమ్మి బాప్తిస్మం పొందిన వాళ్ళు ఈ పారంపర్యంగా వచ్చిన పాపము, శాపము నుండి విడుదల పొందారు. యేసు మనలను శాపము నుండి, ధర్మశాస్త్రపు శాపము నుండి విడిపించేశాడు. కాబట్టి ఇప్పుడు కొత్త నిబంధన కాలంలో నమ్మి బాప్తిస్మం పొందినోళ్ళకి పితృ పారంపర్యంగా శాపం ఏదీ రాదు. అసలు వీళ్ళు వాళ్ళ పిల్లలే కాదు, వీళ్ళు దేవుని మూలంగా పుట్టినవారు. కనుక దేవుని మీద ఏమన్నా ఉంటే శాపం అది వీడికి వస్తుంది. దేవుని కొడుకు కాబట్టి దేవుని మీద ఎలాగూ లేదు గనుక మనకు రాదు. క్రైస్తవులు వేరే సెపరేట్ సెక్షన్ ఆఫ్ ద సొసైటీ (Separate section of the society), దే ఆర్ స్పెషల్ పీపుల్ (They are special people).

Detailed English Translation:

⛓️ Question: In the Old Testament, God speaks of visiting the iniquity of the fathers upon the children. Why was this considered just? How does this change in the New Testament?

  • Generational Curse: Under the Old Covenant, sin and its consequences were hereditary. If a forefather sinned, the stain and its judgment followed subsequent generations. This was part of the fallen nature of the Adamic race—we inherited sin without our direct involvement.
  • The Break at the Cross: This cycle was broken by the sacrifice of Jesus Christ. When He shed His divine, holy blood and rose from the dead, He provided a way out of this hereditary trap. For a believer, the act of Baptism symbolizes the death of the ‘Old Adamic Man.’ The person who inherited those curses is legally dead in God’s eyes.
  • New Creation, New Legacy: A born-again believer is a ‘New Creation.’ They are no longer heirs to Adam’s sin but heirs to Christ’s holiness. Just as Adam’s sin came upon us effortlessly, Christ’s righteousness is bestowed upon us effortlessly through faith.
  • Rejecting False Teachings: Today, some preachers try to blame family problems or health issues on ‘ancestral curses’ to frighten believers. This is contrary to the Scripture. Christ has redeemed us from the curse of the law. If you are baptized in Christ, you are a child of God, not a spiritual descendant of your earthly ancestors’ sins. You belong to a ‘separate section of society’ governed by grace, not hereditary judgment.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

సంప్రదించండి

📞 Call 9000083219 💬 WhatsApp

షేర్ చేయండి

WhatsApp Facebook Telegram