❓ ప్రశ్న: మత్తయి సువార్త 27వ అధ్యాయం 46వ వచనంలో ఇంచుమించు మూడు గంటలప్పుడు యేసు – “ఏలీ ఏలీ లామా సబక్తానీ” అని బిగ్గరగా కేక వేసెను. ఆ మాటకు “నా దేవా నా దేవా నన్ను ఎందుకు చెయ్యి విడిచితివి?” అని అర్థము. ఏసుప్రభువుకి తెలుసు కదా అయ్యగారు మనకోసము చెయ్యి విడిచాడు అని, మరి అలా ఎందుకని? దానికి గల కారణం ఏమిటి? ఆయనకు అంతా తెలిసినా అలా ఎందుకు అడిగారు? (1:07:46)
YouTube Link: ఇక్కడ క్లిక్ చేసి వీడియో చూడండి
దైవజనులు Apostle. Ranjith Ophir గారి వివరణ: (5m 54s)
- 👤 అవతారము అంటే ఏమిటి?: ఈ ప్రశ్న ప్రవీణ్ అనే బ్రదర్ అడగడం చాలా మంచిది. అనేకమందికి కూడా అవసరమైన ప్రశ్న. మొట్టమొదటి విషయం ఏమిటంటే – ఈ అవతారము అనే దానిని మనం అర్థం చేసుకోవాలి. అవతారము అంటే భగవంతునిలో, సర్వేశ్వరుడులో, సర్వవ్యాపకుడు అయినటువంటి ఆ మహాదేవునిలోని ఒక భాగము, ఒక అంశ ఒక నర స్వరూపంతో మానవ సమాజంలోకి ఎంటర్ కావడం (Enter) అది అవతారం.
- 🕉️ అవతారవాదం: అసలు భగవంతుడు అవతరిస్తాడు అనేదే ఇస్లాం ఒప్పుకోదు. సర్వాంతర్యామి, అంతటా వ్యాపించిన భగవంతుడు మళ్ళీ ప్రత్యేకంగా భూమ్మీదకి రావడం ఎందుకు? రాడు. అలాగే ఏమైనా ఒక కార్యం నెరవేర్చాల్సి ఉంటే ఆయన దగ్గర కోట్ల మంది దేవదూతలు ఉన్నారు, ఫరిస్తాలు. వాళ్ళని పంపించుకుంటాడు, ఆయన ఎందుకు మనిషిగా వస్తాడు? దేవుడు ఎప్పటికీ మనిషి కాడు అనేది ఇస్లాం నమ్మకం. కానీ క్రైస్తవం గాని, హైందవం గాని ఈ రెండు కూడా అవతారవాదాన్ని నమ్ముతాయి. దేవుడు కొన్ని ప్రత్యేక సందర్భాల్లో, కాలాలలో మనిషిగా ఆయన రూపుదాల్చి మానవ సమాజంలో ప్రవేశిస్తారు. ఇది అవతార వాదం.
- 🧱 దైవత్వ లక్షణాల పరిమితి: సరే, అయితే దీనికి ఇక్కడ మనము బేసికల్లీ అందరూ గ్రహించాల్సింది ఏంటంటే – దేవుడు మనిషిగా అవతరించాడు అనగానే దైవత్వ లక్షణాలకు ఆయన గుడ్ బై చెప్పాడు ఆ కొద్ది టైమ్ కొరకు. ఎందుకంటే అవతరించాడు అంటే ఒక చోటికి వచ్చాడు. ఒక చోటికి వచ్చాడు అనగానే సర్వవ్యాపకత్వాన్ని వదిలేసినట్టేనా? అవును. ఇప్పుడు ఆయన బెత్లెహేముకు వచ్చాడు అంటే ఇండియాలో లేడు అప్పుడు, చైనాలో లేడు. అక్కడే ఉన్నాడు అంటే ఆమ్నీ ప్రెసెన్స్ (Omnipresence) అనేది పోయింది కదా! కనుక సర్వవ్యాపకత్వము అనేదాన్ని ఆ చిన్న తునక ఆయన వదిలేశాడు. వదిలేయగానే దేవత్వంలోని ఇతర లక్షణాలు – సర్వజ్ఞత కూడా వదిలేశాడు. సర్వశక్తిమత్వము కూడా వదిలేశాడు. ఈ మూడు కూడా భగవంతుని లక్షణాలు. ఏదైనా చేయగలిగేది సర్వశక్తిమత్వము, అంతటా ఏకకాలంలో ఉండగలగడం సర్వవ్యాపకత్వము, అన్ని ఎరిగి ఉండడం సర్వజ్ఞత.
- 🩸 పరిపూర్ణ మానవుడిగా యేసు: ఈ సర్వజ్ఞత వదులుకుంటాడు, తర్వాత సర్వశక్తిమత్వం వదులుకుంటాడు ఎందుకంటే సర్వవ్యాపకత్వాన్ని వదిలేశాడు గనుక. వదిలితేనే ఒక దగ్గరికి అవతరించగలిగాడు గనుక. గనుక యేసు ప్రభువు వారు భూమి మీద ఏది మాట్లాడినా మానవుడిగానే, మానవ పరిమితులలోనే మాట్లాడాడు. ఏది చేసినా మానవుడిగా దేవుని మీద విశ్వాసముతో మానవ పరిమితులలోనే చేశాడు. ఆయన చేసిన అద్భుతాలన్నీ కూడా దేవునిగా చేయలేదు ఆయన, దేవుడు బలపరిచిన ఒక మనిషిగా చేశాడు. హి వాజ్ ఏ హోలీ మ్యాన్ స్ట్రెంత్న్డ్ బై గాడ్ (He was a holy man strengthened by God). అందుకే యోహాను 14వ అధ్యాయంలో ఫిలిప్పుతో చెప్తాడు ఆయన ఏంటంటే – “నన్ను చూచినవాడు నా తండ్రిని చూచాడు” అని చెప్తూ – “నా తండ్రి నా యందు నివసించుచు తన క్రియ చేయుచున్నాడు. నా యందు విశ్వాసం ఉంచువాడు నేను చేయుచున్న క్రియలు చేస్తాడు, నాకంటే మరి గొప్పవి కూడా చేస్తాడు” అని అంటాడు. కనుక యేసుప్రభువు “నేను దేవుని కనుక ఇలా చేశానురా మీరు ఎక్కడ చేస్తారు మీరు మనుషులు” అనలేదు.
- ✝️ సిలువపై కేక: నేను చేస్తే మీరు కూడా చేస్తారు ఎందుకంటే నేను దేవుని మీద విశ్వాసంతో చేశాను, మీరు కూడా చేయగలుగుతారు. కనుక మొదటి తిమోతి 2:5 లో పౌలు భక్తుడు అన్న మాట ఎప్పుడూ మర్చిపోకూడదు – “దేవుడు ఒక్కడే, దేవునికి నరునికి మధ్య మధ్యవర్తి ఒక్కడే, ఆయన క్రీస్తు యేసు అను నరుడు” (The man Christ Jesus). యేసుప్రభు వారు ఒక మనిషిగా ఈ భూమి మీద జీవించాడు. మనిషిగా మాట్లాడి మనిషిగానే అద్భుతాలు చేశాడు. గనుకనే “నా దేవా నా దేవా నువ్వు నన్ను ఎందుకు వదిలేశావు” అని ఆ హ్యూమన్ ఫీలింగ్ (Human feeling), ఆ హ్యూమన్ అగోనీ (Human agony) ని ఆయన వ్యక్తం చేశారు. అసలు ఆయన ఆ మాట అని ఉండకపోతే మొదటి తిమోతి 2:5 అబద్ధం అయిపోతుంది, క్రీస్తు యేసు అను నరుడు అనే మాట తీసేయాలి ఇంకా. ఆ మాట అన్నాడు గనుక ఈ ‘నరుడు’ అనేది సమర్థించబడుతుంది.
Detailed English Translation:
❓ Question: On the Cross, Jesus cried out, “My God, my God, why have you forsaken me?” Since Jesus is God and knew exactly why He was there and that the Father would temporarily turn away due to our sins, why did He ask this question?
- The Concept of Incarnation: To understand this, one must understand the nature of Incarnation (Avatar). While Islam rejects the idea of God becoming man, both Christianity and Hinduism accept it. Incarnation means a portion of the Infinite, Omnipresent God entering the human realm in a finite, human form.
- Limitation of Divine Attributes: When God became man in Jesus, He voluntarily laid aside His divine attributes to function within human limitations. By choosing to be in one place (Bethlehem or Calvary), He set aside His omnipresence. Consequently, He also functioned without His innate omniscience and omnipotence, relying instead on the Father through faith.
- Living as a Man: Jesus did not perform miracles as God; He performed them as a holy man strengthened by the Holy Spirit. He told His disciples that they could do the same works if they had faith. This proves He lived entirely within the human experience.
- The Agony of the Cross: 1 Timothy 2:5 calls Him “the man Christ Jesus.” If Jesus had not felt the genuine human agony and the terrifying sense of separation from the Father, He wouldn’t have been truly human. His cry, “Why have you forsaken me?” was a real expression of human suffering and soul-anguish. It confirms His humanity. If He hadn’t uttered those words, the claim that He was truly ‘Man’ would be questionable. His cry validates that He bore our judgment not just as a divine observer, but as a real man experiencing real forsakenness.
